Followers

Showing posts with label CRIME. Show all posts
Showing posts with label CRIME. Show all posts

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వాటర్ ప్లాంట్ లు

 ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వాటర్ ప్లాంట్ లు

 ప్యూరిపై పేరు తో బోరు నీటి సరఫరా

నిద్రావస్థలో అధికార యంత్రాంగం 


 

లక్షెట్టిపేట,  పెన్ పవర్

మండలంలోని అక్రమ నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు గా కొనసాగుతుంది. నాణ్యత లోకం తెలియని ప్రజలు బోరు నీటిని త్రాగి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. బోరులో వచ్చే కలుషిత నీటిలో కొన్ని  రసాయన పదార్థాలు కలిపి అభం శుభం తెలియని ప్రజానీకం శ్వాసకోశ ఇబ్బందులతో పలు రోగాల పాలవుతున్నారు అసలే వేసవి కాలం కావడంతో ఈ సమయంలో వాటర్ ప్లాంట్ యజమానులు గుట్టుచప్పుడు కాకుండా బోర్ వాటర్ లో కొన్ని కెమికల్స్ కలిపి ఫిల్టర్ చేసి క్యాన్ డబ్బాలలో నింపుతూ సరఫరా చేస్తున్నారు  మున్సిపాలిటీలో మండలాల్లో ఇలాంటి దందా సుమారు చాలా ఉన్నవి వాటర్ ప్లాంట్ ఉండటం గమనార్హం వాటర్ ప్లాంటు కొనసాగిస్తూ నీటి పేరుతో అందినంత వరకు దండుకుంటున్నారు  నిబంధనలు తుంగలో తొక్కి వాటర్ దందా జోరుగా సాగుతుంది  నీటి కేంద్రాలపై ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్ వచ్చినా కూడా తనిఖీ చేయని రోజులున్నాయి. పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది అంతేకాకుండా  వాటర్ క్యాన్లు కొన్ని సంవత్సరాల గడిచిన క్యాన్లలో నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. నీటిని నింపి ఉండడంతో దుర్వాసన నీటిని సరఫరా చేయడంతో వాటిని తాగిన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు అంతేకాకుండా కూలింగ్ పేరుతో సుమారు 30 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు అక్రమ నీటి దందా కొనసాగిస్తూ అడిగిన అధికారులకు మామూలు అందిస్తున్నారనే అభిప్రాయాలు ప్రజల్లో  ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని పలువురుకోరుచున్నారు. నిబంధనలకు నీళ్లు.... ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్ నిర్వహణకు పలు మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ప్రతి వాటర్ ప్లాంట్ లో ఒక బయో కెమిస్ట్రీ , నీటిని ఫిల్టర్ చేసే స్టీల్ క్యాన్ లు, రసాయనిక మోతాదును పరిశీలించే పరికరాలు,వివిధ రసాయనాలు ఉంటాయి., కానీ మండలం,  మున్సిపాలిటీలోపై నిబంధనలను వాటర్ ప్లాంట్ నిర్వాహకులు పాటించడంలేదు. దీంతో ప్రజలకు ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ తో గోదావరిలో నీటి నిలువ ఉండడంతో పాటు  మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్ నీరే దిక్కవుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని వాటర్ ప్లాంట్ నిర్వాహకులు  లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మండల, మున్సిపల్ పాలకులు, అధికారులు సరైన అనుమతి లేని వాటర్ ప్లాంట్లపై దృష్టి సారించకపోవడం తో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాటర్ ప్లాంట్ ను తరచుగా తనిఖీ చేసే జిల్లా అధికార యంత్రాంగం నిద్ర మత్తు వదలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.   అధికారులు పట్టించుకోవడం లేదు. సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్  .అవునురి వెంకటేష్ ..పత్రికా ప్రకటనలో .తెలిపారు మున్సిపాలిటీలో మండలంలోని. అనేక అక్రమ వాటర్ ప్లాంట్ నెలకొన్నాయి. వాటర్ ప్లాంట్ యజమానులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించడం లేదు. తనిఖీలు చేయవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల ప్రజారోగ్యం పడకేసింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పాలకులు అధికారులు స్పందించి అక్రమ వాటర్ ప్లాంట్ పై కొరడా జులు పించాలి.  కలుషిత నీటి వల్ల రోగాలు వస్తున్నాయి. వాటర్ ప్లాంట్ లో క్యాన్లను నీటుగా పరిశుభ్రం చేయకపోవడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. వాటర్ ప్లాంట్ లో బయోకెమిస్ట్రీ ఒక పోవడం వల్ల ఎక్కువ మోతాదులో రసాయనాలు కలుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.తాసిల్దార్ మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి అక్రమ వాటర్ ప్లాంట్లపై దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

గిడ్డంగుల కార్మికుల దర్నా..

 గిడ్డంగుల కార్మికుల దర్నా.. 

కార్మికుల వేతనం నుండి కట్ చేసిన ఈఎస్ఐ..పిఎఫ్ డబ్బులు కట్టడం లేదని దర్నా. 

కాంట్రాక్టు కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న యాజమాన్యం.. కాంట్రాక్టర్లు.. 

ఏండ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాలు పెంచడంలేదని గిడ్డంగులముందు బైటాయింపు.. 

పనివేళలు సక్రంమగా అమలు చేయకుండా గొడ్డు చాకిరి చేయిస్తున్నారని కార్మికులు దర్నా.. 

ఎల్లంపేట గ్రామ ఎంపిటీసి కుమార్ జోక్యంతో సద్దుమనిగిన కార్మికుల దర్నా.. 


మేడ్చల్, పెన్ పవర్ 

ఆనాటి నుండి ఈనాటి వరకు కాంట్రాక్టు కార్మికుల సమస్యలు సమస్యలుగానే ఉండి పోతున్నాయి.. వేతనాలలో కోతపెట్టి ఇచ్చే కాంట్రాక్టర్ ఒకరైతె.. ఈఎస్ఐ పిఎఫ్ లు ఇవ్వకుండా మరికొందరు మోసంచేస్తూ కార్మికుల కష్టాన్ని కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు.. కార్మికులు తమ సమస్యలతో దర్నాలు చేయడం, యాజమాన్యం తాత్కాలిక ఒప్పందాలతో సరే అనడం పరిపాటిగా మారింది.. సమస్య తీరేది లేదు.. యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు మారేది లేదు.. కార్మికులకు జీవితకాలం ఇలాగే గడిసిపోతుంది..కాంట్రాక్టర్లు కోటిశ్వరులు అవుతున్నారు కార్మికులు మాత్రం అదేపని, అవేసమస్యలు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామ పరిధిలోని మాక్స్ కంపెనీ గిడ్డంగులలో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిడ్డంగులముందు బైటాయించి  కార్మికులు గురువారం దర్నా నిర్వహించారు.కంపెనీ యాజమాన్యం.కాంట్రాక్టర్లు తమకు పనివేళలు సక్రమంగా అమలు చేయడం లేదని,సెలవులు కూడా ఇవ్వకుండా తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ వేతనాల నుండి ఈఎస్.ఐ.పీ.ఎఫ్ కోసం డబ్బులు కట్ చేసుకుంటున్నారు కానీ తమకు ఈఎస్.ఐ.పీఎఫ్ కడుతున్నట్లు పత్రాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.., ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాలు పెంచడం లేదంటూ కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వేరేహౌస్ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.. నిరసన తెలియజేశారు.ఎల్లంపేట్ గ్రామ ఎంపీటీసీ కుమార్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు తమ ఆందోళన విరమించి విధుల్లోకి వెళ్లారు..

రెమెడిసివర్ ఇంజెక్షన్ పక్కదారి..

రెమెడిసివర్ ఇంజెక్షన్ పక్కదారి.. 

విజయనగరం, పెన్ పవర్ 

 "ప్రాణం ఖరీదు" కథనంలో ఉటంకించిన వాస్తవాలు బుధవారం కోవిడ్ విజలెన్స్ దాడుల్లో వెలుగు చూశాయి. విజయనగరం క్వీన్స్ ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ లో అక్రమాలు బయట పడ్డాయి.  ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా ఇచ్చే రెమిడేసివర్ ఇంజెక్షన్స్ ను సంబంధిత రోగికి వేయకుండా వాటిని బ్లాక్ చేసి, నగదు చెల్లించి ఖరీదైన వైద్యం చేయించుకుంటున్న వారికి కొందరు వైద్యులు, హాస్పిటల్ యాజమాన్యాలు పట్టుబడ్డాయి. అదే క్రమంలో అంతకు ముందు రోజు పట్టణంలోని క్వీన్స్ ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ లో కోవిడ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ చేసిన దాడులు చేసింది. రికార్డుల తనికీ చేసింది. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా ఇచ్చే ఇంజెక్షన్స్ పక్క దారి పడుతున్న విషయాన్ని, డ్రగ్ స్టోర్ ఇండెంట్, హాస్పిటల్ లోని రికార్డ్ ల్లో ఉన్న ఇండెంట్ కి మధ్య తేడాలను అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. అందుకు ప్రధాన బాద్యులుగా హాస్పిటల్ ఎండీ రమేష్, జనరల్ పిజిషియన్ వివేక్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో బుధవారం ఔషధ నియంత్రణ విభాగం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ లు..బాద్యులపై సెక్షన్  420తో పాటు, 188, 406, 120 బి, 468 కింద కేసులు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.

డోంకరాయిలో భారీగా గంజాయి పట్టివేత

 డోంకరాయిలో భారీగా గంజాయి పట్టివేత

మోతుగూడెం,పెన్ పవర్

వైరామవరం మండలం డోంకరాయి పోలీస్ స్టేషన్ దగ్గర గురువారం రెండు వేల కేజీల గంజాయి పట్టుబడినది డోంకరాయి ఎసై జి వెంకటేశ్వరరావు తెలియజేసిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ జి వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేయుచుండగా సీలేరు వైపు నుండి హైదరాబాద్ వైపువెలుతున్న ఎంపి17సిసి4413 అను నంబర్ గల వెటెరో కారు ఆపి విచారిస్తుండగా దాని వెనుకనే ఎపి22ఎక్స్2609 అను నంబర్ గల హైచర్ వాహనం ఆపి తనిఖీ చేయగా వాహనంలో రెండు వేల కేజీల గంజాయి గుర్తించమని దాని విలువ సుమారు ఆరవై లక్షల రూపాయలు ఉంటుందని నిందితులను విచారించగా ముందు వచ్చిన కారు కూడా వీరిదే అని మొత్తం రెండు వాహనాల్లో ఏడుగురు వ్యక్తులను గుర్తించమని వారు మన్జీత్ డాలి,అమిత్ సింగ్, సుమంత్ మండల్, రవీంద్రనాథ్ మిస్త్రీ,సుజిత్ మండల్ విరు ఒరిస్సా రాష్ట్రంలోని కలిమెలకు చెందిన వారు పవన్ మనోహర్ దుంబ్లి, కర్నాటక రాష్ట్రంలోని జిమ్ కాండి మరియు మహ్మద్ జిలాని హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారని ఈ గంజాయిని సీలేరు నుండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు తీసుకొని వెళుతున్నట్లు నిందితులు తెలిపారని రెండు వేల కేజీల గంజాయిని మరియు వాహనలను స్వాధీనపరచుకొని నిందితులను అదుపులోకి తీసుకుని రంపచోడవరం కోర్టులో హాజరు పరుస్తామని డోంకరాయి ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

మా"స్టార్లు" ఇకలేరు

 మా"స్టార్లు" ఇకలేరు




 రాజన్న సిరిసిల్ల ,  పెన్ పవర్

 కరోనా వ్యాధి తీవ్రత దృష్ట్యా మండలం లో ఒక్కసారిగా మృత్యు గంటలు మ్రోగుతున్నాయి. ఎప్పుడూ ఏలాంటి వార్త వినాల్సి వస్తుందని మండల ప్రజలు భయాందోళనలతో ఉంటున్నారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో  ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఓలాద్రి  యాదగిరి రెడ్డి 54 సంవత్సరాలు  ఉదయం కరోనాతో మృతి చెందారు కాగా పలు గ్రామాలలో ఆత్మీయంగా పని చేసి ప్రతి విద్యార్థికి తండ్రివలె దిక్సూచి గా ప్రతి విద్యార్థి కి,నోట్లో నాలుకగా ఉండేవారని ఉపాద్యాయులు ,విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మండలం లో విద్యా శాఖకు సంబంధించి  ముగ్గురు మృతి చెందడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  బొప్పాపూర్ కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు అల్లాడి రాజేశం 70 సంవత్సరాలు అతను హిందీ పండితుడు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినాడు. కోనరావుపేట ధర్మారం గ్రామం కు చెందిన మంకు రాజయ్య, ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి గా 2005 సంవత్సరం నుండి విధులు నిర్వహిస్తున్నాడు మంకు రాజయ్య 45 సంవత్సరాలు కరోనా మహమ్మారితో చనిపోవడం పట్ల అధికారులు మిత్రులు శ్రేయోభిలాషులు చనిపోయాడనే వార్త వినడం తో అతని సన్నిహితులు  జీర్ణించుకోలేకపోయారు.  పలు జాతీయ రాష్ట్రీయ  జిల్లా స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకున్నారు. రాష్ట్రంలోనే విద్యాశాఖలో గవర్నమెంట్ స్కూల్ లలో ఆంగ్ల మాధ్యమాన్ని తన భుజస్కంధాల పైన వేసుకొని ప్రతి గ్రామంలో ప్రవేశపెట్టిన ఘనత అతనికే దక్కుతుంది అని పలువురు అభిప్రాయపడ్డారు .వెంకటాపురంలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న యాదగిరిరెడ్డి 54 సంవత్సరాలు ముగ్గురు వ్యాధితో మృతి చెందడంపై మండల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎల్లారెడ్డిపేట మండల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంఘాలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నారాయణమూర్తి అకాల మృతికి సంతాపం వ్యక్తం చేసిన వైసీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ

 నారాయణమూర్తి అకాల మృతికి సంతాపం వ్యక్తం చేసిన వైసీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ

తాళ్లపూడి, పెన్ పవర్

పెద్దేవం గ్రామం  సాయిబాబా సేవాదల్ కమిటి కన్వీనర్ నామన నారాయణమూర్తి బుధవారం అనారోగ్యంతో మరణించగా, ఆయన కుమారుడు నామన వెంకట్  అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం అకాల మరణం చెందినారు.  వారిరువురి మృతి పట్ల  సంతాపాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలియజేశారు. అదేవిధంగా  ప్రెసిడెంట్ తిగిరిపల్లి వెంకటరావు, వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ, పంచాయతీ వార్డు మెంబర్ మైలవరపు రాధాకృష్ణ ,ఎంపీపీ అభ్యర్థి జొన్నకూటి పోసిరాజు, సాయిబాబా సేవాదళ్ కమిటీ సభ్యులు కోడి శంకర్, గురుస్వామి కోడి సత్యనారాయణ, నల్లాకుల సుబ్బారావు, యర్రంశెట్టి సత్యనారాయణ, జవ్వాది రాంబాబు, వేము రాంబాబు, బోడపాటి గంగరాజు, సంతాపాన్ని తేలియచేశారు. తోట రామకృష్ణ మాట్లాడుతూ నామన నారాయణమూర్తి చిన్ననాటి స్నేహితుడని, చిన్నప్పుడు కలసి ఆడుకున్నామని, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నా విజయానికి నారాయణమూర్తి కృషి చాలా ఉందని, ఆయన మరణం నాకు చాలా బాధాకరంగా ఉందని,  ఆయన కుటుంబానికి అన్నివేళలా నా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కరోనా తో వై.ఎస్.ఆర్.సి.పి సీనియర్ నాయకుడు మృతి

 కరోనా తో వై.ఎస్.ఆర్.సి.పి సీనియర్ నాయకుడు  మృతి 

సీతానగరం,  పెన్ పవర్  

మండలం వంగలపూడి గ్రామానికి చెందిన వైకాపా సీనియర్ నాయకుడు కరోనాతో ముసునూరి.వీరబాబు మృతి చెందారు. కరోనా పాజిటివ్ రావడంతో గత కొద్ది రోజులుగా రాజానగరం జి.ఎస్.ఎల్ హాస్పటల్ నందు చికిత్స పొందుతూనే పరిస్థితి మరింత విషమించడంతో మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. నియోజకవర్గ శాసనసభ్యులు,రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి.రాజా వీరబాబు కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి,మండల ప్రజలకు తీరనిలోటని మాజీ జెడ్పిటిసి కొంచ.చంద్ర భాస్కర్ రావు అన్నారు. వీరబాబు మృతితో మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు, బంధువులు,స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

సూరిబాబు సేవలు చిరస్మరణీయం..

 సూరిబాబు సేవలు చిరస్మరణీయం..

ఏలేశ్వరం, పెన్ పవర్

మండల రజక సంఘం అధ్యక్షుడు దాకమర్రి సూరిబాబు సేవలు చిరస్మరణీయమని మండల సిపిఎం కార్యదర్శి  పాకలపాటి సోమరాజు అన్నారు. ఈ మధ్య అకాల మరణం  చెందడం పట్ల సంతాప సభ జరిగింది. ఈమేరకు  బుధవారం సూరిబాబు  చిత్రపటానికి పూలమాల వేసి,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మండల రజక సంఘం అధ్యక్షునిగా పనిచేస్తూ రజకులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, దోబీ ఘాట్ నిర్మాణం తో పాటు, మండలంలోని రజకులకు సొంత సొమ్ముతో బీమా చేయించి వారి కుటుంబాలకు చేయూతనందించిన ఘనత సూరిబాబుకు దక్కుతుందని కొనియాడారు. పట్టణ రజక సంఘం అధ్యక్షుడు అంజూరు రాజారావు, కేళం శ్రీను, గుసిడి పాపయ్య, పసుపులేటి రాజబాబు, సిప్పాడ ప్రసాద్, మద్ది కనకరాజు, వానపల్లి అప్పారావు ఉన్నారు.

మళ్లీ ప్రహరీ నిర్మిస్తున్న బిల్డర్ కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది

 మళ్లీ ప్రహరీ నిర్మిస్తున్న బిల్డర్ కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది

బిల్డర్ కు కొమ్ముకాస్తున్న అజ్ఞాత శక్తి ఎవరు..?

పెన్ పవర్, కాప్రా

ఏఎస్ రావు నగర్ డివిజన్ సుబ్రహ్మణ్య నగర్ లక్ష్మీపురంలో ఐ విజన్ సిరిని అపార్ట్ మెంట్ బిల్డర్ ప్రహరీ గోడను తిరిగి నిర్మిస్తుండగా బుధవారం కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు జెసిబి సాయంతో కూల్చివేశారు. ప్రజలకు, కాలనీవాసులకు ఇబ్బంది కరంగా నిర్మించిన ట్రాన్స్ పార్మర్ ను వేరే చోటికి మార్చాలని, రోడ్డు కబ్జా చేసి నిర్మించిన ప్రహరీని లోపలికి జరిపి నిర్మించుకోవాలని కోరిన స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి "నువ్వు కార్పొరేటరైతే డబ్బులు పడేస్తా తీసుకొని పో అని జులుమ్" ప్రదర్శించిన బిల్డర్ కూల్చి వేసిన ప్రహరీని తిరిగి నిర్మించడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన కాలనీ వాసులు జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది జెసిబి సహాయంతో తిరిగి నిర్మించిన ప్రహరీ గోడను కూల్చి వేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరి అండదండలతో అక్రమ నిర్మాణాలు పాల్పడుతున్నారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కూల్చి వేసినప్పటికీ తిరిగి నిర్మించడంలో ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాల వెనక ఎంత పెద్ద శక్తులు ఉన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బిల్డర్లు కొమ్ముకాస్తున్న  అజ్ఞాత శక్తుల వ్యవహారాలను బట్టబయలు చేస్తామని అన్నారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని టౌన్ ప్లానింగ్ ఏసిపి ఖుద్దుస్ హెచ్చరించారు.

ప్రాణం ఖరీదు..

ప్రాణం ఖరీదు.. 

  పరపతి ఉన్న వాడిదే ప్రాణం..
 సామాన్యుడికి అందదు వైద్యం..
 హాస్పిటల్లో బెడ్ కొరత..
  బయట ఆక్సిజన్ కొరత..
  రెమెడిసివర్ ఇంజెక్షన్ కొరత..
 ఆరోగ్య శ్రీ ప్యానల్ హాస్పిటల్లో సిపార్సులకే సేవలు..
ఇళ్లల్లో ఖరీదైన వైద్యం చేయించుకుంటున్న ధనవంతులు, వ్యాపారులు, ప్రముఖులు..
 ప్రత్యేక ప్యాకేజీలతో హోమ్ సేవలందిస్తున్న వైద్యులు..
 వారికే తరలిపోతున్నాయి ఆక్సిజన్ లు, ఇంజక్షన్లు..
  ఆరోగ్య శ్రీ ద్వారా అందించే ఉచిత ఇంజెక్షన్స్ ని పక్కదారి పట్టిస్తున్న హాస్పిటల్స్..
 ఎక్కువ ధరలకు పలుకుబడి ఉన్న వారికి విక్రయం..
  సకాలంలో సామాన్య రోగికి అందని మందులు..
  పరిస్థితి విషమించి చనిపోతున్న సామాన్యులు..
  కొన్ని ప్రయివేట్, ఆరోగ్య శ్రీ ప్యానల్ హాస్పిటల్స్ ల్లో జరుగుతున్న కోవిడ్ స్కామ్..

విజయనగరం, పెన్ పవర్

ధనం ఇదత్ జగత్ ధనమేరా అన్నింటికీ మూలం ధనం ముందు అందరూ దాసోహం ధనవంతుడిదే ప్రపంచం ధనవంతుడుదే విలాసం ఇప్పుడు ధనవంతుడుదే ఆరోగ్యం అని రుజువు చేస్తోంది. ఈ కోవిడ్ సెకండ్ వేవ్. మొదటి దారి కన్నా రెండో దారిలో దూసుకు వచ్చిన ఈ కరోనా వైరస్ దాడికి వారు, వీరని కాదు ప్రజలంతా కకావికలమైపోతున్నారు. దీంతో కోవిడ్ వైద్యం అంత్యంత ఖరీదై పోయింది. ప్రతి ప్రాణం ఖరీదు లక్షల రూపాయల్లో ఉంది. ప్రభుత్వ ఉచిత వైద్యం మృగ్యమైపోయింది. దీంతో  సామాన్యులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడుస్తున్నారు. కోవిడ్ పరీక్ష మొదలు, వైద్యం అందక చచ్చి ఇంటికి చేరే వరకు అడుగడుగునా డబ్బు తీయాల్సిందే. లేదంటే అనాధ శవంలా అయిన వారు వదిలి పోవాల్సిందే. కానీ ఇటువంటి భరించలేని భౌతిక కష్టాలు ఏవీ సొసైటీలో పరపతి, పలుకుబడి ఉన్న ధనవంతులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులకి అంతగా లేవనే చెప్పుకోవాలి. వారికి చిటికేస్తే కాదు..చిల్లర విసిరితే చాలు అన్నీ ఇంటి ముంగిటకు వచ్చి పడుతున్నాయి. మార్కెట్లో ఆక్సిజన్ వారికే ముందు, ఆ తర్వాత వెళ్లిన వాడికి నో స్టాక్ బోర్డు. బ్లాక్ లో అత్యంత ఖరీదై పోయిన రెమెడిసివర్ ఇంజక్షన్ కూడా వారికి అందుబాటులో, సామాన్యుడికి దొరకడం గగనం. హాస్పిటల్ లో చేరితే అత్యవసర సేవలన్నీ వారికే ముందు, ఆ తర్వాతే సామాన్యులకి సాదారణ సేవలు. కోవిడ్ జాగ్రత్త కోసమని వైద్యుడు సామాన్య రోగి చేయి పట్టుకొని పల్స్ కూడా చూడడు. కానీ పరపతి ఉన్న ధనవంతులు కోరితే ప్రత్యేక ప్యాకేజితో హోమ్ ఐసోలేషన్ సేవలు అందిస్తాడు. చివరికి ఆరోగ్యశ్రీ ద్వారా తమ హాస్పిటల్స్ లోని కోవిడ్ రోగికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న రెమెడిసివర్ ఇంజెక్షన్ ను కూడా అవసరమైన సామాన్య రోగులకు వేయకుండా వాటిని బ్లాక్ చేసి, వేల రూపాయలకి విఐపీలు, వివిఐపీలకి అమ్ముకుంటున్న వైద్యులున్న హాస్పిటల్స్ కూడా జిల్లాలో ఉన్నాయి. 

విజయనగరం పట్టణంలో కొన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో ఠాగూర్ మూవీ సీన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ భయంతో రోగిని హాస్పిటల్స్ లో చేర్పించేసిన బంధువులు ఇటు వైద్యుల పైన, అటు దేవుడి పైన భారం వేసేసి బయట పడిగాపులు పడడమే తప్ప లోపలికి పోయే సాహసం చేయలేరు. అలాగని వైద్య సేవలు అందించే వైద్యుడు గానీ, వైద్య సిబ్బంది గానీ రోగిని అంటి పెట్టుకొని అలాగే ఉండిపోరు. ఐసీయూలో ఉన్న పెసెంట్ ఎలా ఉన్నాడన్న ఆందోళన తప్ప వైద్యం సకాలంలో సక్రమంగా అందుతుందో లేదో తెలుసుకోలేని దుస్థితిలో బంధువులు ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి వైద్యుల నిర్లక్ష్యమో, సిబ్బంది అలసత్వమో, హాస్పిటల్స్ లో పర్యవేక్షణ లోపమో, యజమానుల అక్రమ స్వార్దమో తెలియదు గానీ..వెరసి సామాన్యుడి ప్రాణం గాల్లో కలిసిపోవడం ఖాయం. ఇలాంటి ఘటనలు ఇటీవల విజయనగరం పట్టణం లోనే కాదు జిల్లా వ్యాప్తంగా చవిచూస్తున్నాం. అధికారిక గణాంకాలు ప్రకారం ఈ ఏప్రిల్ నెల లో ఇంతవరకు కోవిడ్ కారణంగా 24 మంది మరణించారు. ఇక లెక్కల్లో లేని కోవిడ్ చావులెన్నో స్మశానాలకు వెళ్లి అంచనా వేయాల్సిందే. ఇలా అన్ని విధాలుగా వంచనకి గురవుతూ ఖరీదైన వైద్యం సకాలంలో చేయించుకోలేక సామాన్యులు ప్రాణాలు విడుస్తున్నారు. పలుకుబడి, పరపతి ఉన్న వారు అన్నీ సమకూర్చుకొని ఖరీదైన వైద్యం చేయించుకుంటూ ప్రాణాపాయం నుంచి బయట పడుతున్నారు. ఇటువంటి వారిలోనూ ఒకటి అరా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, అవి వృద్దాప్యం లేదా దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉండడం వల్ల చోటుచేసుకుంటున్నవిగా చెప్పుకోవచ్చు. 

అవకాశం ఉండి వైద్యం చేయించుకున్న వారిని చూసి సామాన్యులు అసూయతో ఈ విమర్శలు చేయడం లేదు. కోవిడ్ టెస్ట్ కి వెల్దామన్నా విఐపీల సిపార్సు ఉండాలి. హాస్పిటల్ లో చేరాలంటే ఎవరి కాలో పట్టుకోవాలి. ఆక్సిజన్ కొద్దామన్నా వ్యాపారిని బ్రతిమిలాడుకోవాలి. అంబులెన్స్ కావాలంటే వాడు అడిగినంత చెల్లించుకోవాలి. ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం పొందాలంటే ప్రముఖులచే ఫోన్లు చేయించుకోవాలి. ఆరోగ్యశ్రీ ప్యానల్ హాస్పిటల్స్ లో బెడ్ లు ఖాళీ ఉండి కూడా ప్రాణం పోతోంది చేర్చుకోండి మహా ప్రభో అని కాళ్ళా వెళ్ళా పడినా లేదు పొమ్మంటున్నారు. వాటిని నేతలు సిపార్సు చేసిన వారి కోసం, లేదా తమ వారి కోసం రిజర్వు చేసుకుంటున్నారు. చివరికి ప్రయివేట్ హాస్పిటల్ కి వెళ్లి చేరుదామంటే, ముందే 50 వేలు లేదా లక్ష రూపాయిల డిపాజిట్ కట్టమంటున్నారు. తీరా చేరాక ఇంజెక్షన్ దొరకడం లేదు అది మీరే కొనుక్కోవాలని కండీషన్ పెడుతున్నారు. అది దొరక్కపోయే సరికి చావు కబురు చల్లగా చెబుతున్నారు. ఆ తర్వాత బ్యాలెన్స్ కట్టి బాడీ తీసుకువెళ్లాలని బెదిరిస్తున్నారు. మరి ఇటువంటి ధనిక, పేద, ప్రముఖుడు, సామాన్యుడు అని వివక్ష చూపుతూ వైద్యం అందిస్తుంటే ప్రజలకి గుండె మండదా..? వారి నెత్తురు ఉడకదా..? వారికి ఆవేశం రగలదా..? ఉచిత సేవలు ప్రభుత్వం సామాన్యులకు ఇస్తున్న వరం. అది మంచి వరమని విశ్వసించి వచ్చిన వారికి శాపంగా మారుస్తున్నాయి కొన్ని హాస్పిటల్స్. సకాలంలో సంక్రమైన వైద్యం అందించక, ఆక్సిజన్ ఇవ్వక, ఇంజెక్షన్ పెట్టక నిర్లక్ష్యం, ఆపై స్వార్థంతో సామాన్యుల చావులకి కారణమౌతున్న హాస్పిటల్ యాజమాన్యాలు ఇప్పటికైనా కాస్తా మానవత్వంతో సేవలందించండి. ఫ్రంట్ లైన్ యుద్ద వీరుల్లా మీ ప్రాణాలని పణంగా పెట్టి మరీ మీరందిస్తున్న సేవలు అత్యంత నిరూపమానం. అక్కడక్కడా మీ వృత్తిలో ఉన్న కొందరు సేవ ముసుగులో చేస్తున్న అవినీతి, అక్రమాలు, అలక్ష్యం వల్ల మీ వైద్య సమాజానికి కళంకం తీసుకువస్తున్నాయి. ప్రజలచే నిత్యం దేవుళ్ళుగా కొనియాడబడే మీరే ఒక్కోసారి వారి కంటికి అన్యాయం చేసిన వారిగా కనిపిస్తున్నారు. దయచేసి ఇటువంటి విపత్తులో మీరే ప్రజల దేవుళ్ళు. వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలందించాలని యావత్ ప్రజానీకం మీకు చేతులెత్తి వేడుకొంటోంది.

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

 అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం...

నార్నూర్,  పెన్ పవర్ 

గాడిగూడా మండలం   గ్రామ పంచాయతీ లో బుదవారం ఉదయం 10:00 గంరైసిడం అచంత్ రైసిడం అనే యజమాని ఇంట్లో ఎవరు లేని సమయలో అందరు వ్యవసాయం పనుల్లో  వెళ్యారు, ఆకస్మికంగా ఇంట్లో మంట అయి పోగా రావడంతో  యాజమని కీ తెలిపే సరికి ఇళ్లు మంటలో దగ్ధము ఆయనట్టు ఉరిప్రజలు తెలిప్యారు, పంచాయతీ సెక్రటరీ స్థలాని చేరి వివరాలు తెలుసుకొని రికార్డు రాసినట్లు యజమాని తెలిప్యారు.

మూడు లక్షల రూపాయల కర్ణాటక మద్యం స్వాధీనం

మూడు లక్షల రూపాయల కర్ణాటక మద్యం స్వాధీనం 

 చిత్తూరు,  పెన్ పవర్

 చిత్తూరు జిల్లాలో రోజురోజుకు మద్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్ పి ఎస్.రేవంత్ రెడ్డి గార్లకు వచ్చిన సమాచారం మేరకు చిత్తూరు డి ఎస్ పి  సుధాకర్ రెడ్డి మరియు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. బాలయ్య గార్ల ఆధ్వర్యంలో చిత్తూరు -  వేలూరు  రోడ్డు మార్గంలో ఉన్న మాపాక్షి క్రాస్ వద్ద చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కె. నాగ సౌజన్య మరియు తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా మద్యాన్ని తరలిస్తున్న కారును,  ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని  విచారించగా కర్ణాటక రాష్ట్రం నుండి మద్యం అక్రమంగా ఆంధ్ర రాష్ట్రానికి  పెద్ద ఎత్తున సరఫరా చేసి  పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్లు గా తెలిసేది.  వాహనంలో సుమారు మూడు లక్షల రూపాయల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యాన్ని పట్టుకోవడం లో కీలక పాత్ర పోసించిన స్పెషల్  బ్రాంచ్ మరియు  తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందిని రివార్డులతో అధినందిచారు.  ముద్దాయిలు జీడి నెల్లూరుకు మండలం,  నరసింగా  పురం గ్రామం చెందిన పి. తులసి, ఎం, పవన్ కళ్యాణ్,  చిత్తూరు కొండారెడ్డిపల్లి కి చెందిన ఏ. శ్రీనివాసులు లను అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించారు.

రహదారి ప్రమాదంలో ఒకరు దుర్మరణం

 రహదారి ప్రమాదంలో ఒకరు దుర్మరణం

లక్షెట్టిపెట్, పెన్ పవర్

మండలంలోని గుళ్లకోట స్టేజి వద్ద మంగళవారం రాత్రి లారీ బైక్ ను డీకొట్టడంతో వడ్లూరి విష్ణు(36)అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ దత్తాత్రి తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జమ్మికుంటకు చెందిన వ్యక్తి అని మ్యాదరిపేట గ్రామంలో బేకరిలో కార్పెంటర్ పని కోసం వచ్చాడన్నారు.మంచిర్యాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లి సామాను కొనుగోలు చేసుకుని మ్యాదరిపేటకు వస్తుండగా ఎదురుగా వస్తున్న టీఎస్19టీఎ1173 నెంబర్ గల టిప్పర్ డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడన్నారు.అదే వాహనం వెనుకాల కూర్చున్న మరొక వ్యక్తి శరత్ కు సల్ప గాయాలు అయ్యాయన్నారు.గాయపడ్డ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

మండలంలో ఆందోళన కలిగిస్తున్న రోజుకో కరోనా మరణం

 మండలంలో ఆందోళన కలిగిస్తున్న రోజుకో కరోనా మరణం...

ఎల్లరెడ్డిపేట,  పెన్ పవర్

కరోనా తీవ్రతతో గొల్లపల్లి, బొప్పా పూర్ లలో ఆర్య వైశ్యుల మరణాలు రోజు ఒక్కారుగా మృతి  చెందడం అందరినీ  ఆందోళనకు గురి చేస్తున్న ది. గత 14 రోజులుగా నలుగురు  వైశ్యులు మృతి చెందారు. బొప్పా పూర్ కు చెందిన చిలువేరు రవీందర్, 14 రోజుల క్రితం కరోనా మూలంగా హైదరాబాద్ ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.సోమవారం నాడు గొల్లపల్లి కి చెందిన కేశెట్టి కమల, కరోనా తో కరీంనగర్ ఆసుపత్రిలో మరణించింది.మంగళ వారం గొల్లపల్లి కే చెందిన చేపూరి పోచయ్య, సిరిసిల్ల ఆసుపత్రిలో మరణించారు.  బుధవారం ఉదయం బొప్పాపూర్ కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అల్లాడి రాజేశం,  కరోనా తో కామారెడ్డి ఆసుపత్రి లో మరణించాడు.వరుస గా కరోనా తో రెండు గ్రామాలలో మరణించిన పలువురు వైశ్యులు ఇంకా ఆసు పత్రుల్లో చికిత్స పొందుతూనే వున్నారు. వరుసగా మరణిస్తున్న వారి అంత్య క్రియలకు ఎవరూ హాజరు కలేని పరిస్థితి తో దయనీయ దుస్థితి నెలకొంది.అందరూ వుండి,అన్ని వున్నా అనాధ శవాలుగా స్మశానం కు అంబులెన్సు ల్లో చేరుతున్న మృతదేహాలు పీపీ ఈ కిట్లు ధరించిన వారితో చితిలో కలుతుండటం అందరి కంట కన్నీరు పెట్టిస్తుంది.ఇలా అనేక మందికి,అనేక గ్రామాల వారు ,అన్ని కులాల వారు ఎదుర్కొంటున్న కడు దుర్భర , దారుణ మరణాలు,మరచిపోని, మరుపు రాని అత్యంత విషాదాంత ఉదంతాలు. అల్లాడి రాజేశం రిటైర్డ్ ఉపాధ్యాయుడు హిందీ భాష పండితులు మరణంతో వారి శిష్య బృందం కూడా కంటతడి పెట్టారు ఉత్తమ ఉపాధ్యాయులు క్రమశిక్షణను నేర్పిన గురువులు హిందీ భాషను అనర్గళంగా అద్భుతంగా అలవోకగా బోధించి. ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్పించిన హిందీ భాష ఉపాధ్యాయులు పరిశుభ్రత కు శుభ్రతను నేర్పిన నిలువెత్తు రూపం హిందీ భాషను ఇంకెవరూ బోధించాలేనంత గా అందమైన సుందరమైన పదాలతో విద్యార్థుల హృదయాలకు హత్తుకునే విధంగా బోధించిన హిందీ భాషా పండితులు కరోనా మహమ్మారి తో మరణించడం మాకు తీరనిలోటని అతను బోధించిన విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు రాచర్ల బొప్పాపూర్ స్మశాన వాటిక వద్దకు వచ్చి గురువుగారికి అల్లాడి రాజేశం, కు ఆత్మ శాంతి చేకూరాలని కోరుకున్నారు.

మా భూములు ఆక్రమిస్తే సహించేది లేదు

 మా భూములు ఆక్రమిస్తే సహించేది లేదు 

 రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామం పుంత రోడ్డులో ఉన్న చర్చి పాస్టర్ అక్కడి సమీపంలోని అన్ని వర్గాలకు చెందిన భూములు ఆక్రమిస్తున్నారని రాజవోలు గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజవోలు గ్రామానికి చెందిన కోటి రాజశేఖర్, బీసీ నాయకులు పేట రామకృష్ణ తదితరులు మాట్లాడారు.సదరు పాస్టర్ పండు, డాని అనే ఇద్దరు రౌడీ షీటర్లను అడ్డు పెట్టుకుని స్థానిక ప్రజలు, రైతులను బెదిరించి భూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అదే ప్రాంతంలో రాజమహేంద్రవరం నగరానికి చెందిన జెట్టీ జ్యూయలర్స్ వారికి చెందిన స్థలం కూడా ఉందని, దానిని ఆక్రమించిన నేపథ్యంలో సదరు జ్యూయలర్స్ వారు అధికారులకు ఫిర్యాదు కూడా చేశారని వివరించారు. అయితే ఈ కజ్జా వ్యవహారాన్ని గ్రామ మాజీ సర్పంచ్ నక్కా రాజబాబుకు ఆపాదించి ఆయన పై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, సదరు పాస్టర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. స్థలాల కబా వ్యవహారానికి నక్కా రాజబాబుకు ఎటువంటి సంబంధం లేదని రాజశేఖర్, రామకృష్ణలు స్పష్టం చేశారు. కావాలనే ఆయనపై బుదర చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. స్థలాల కట్టా మొత్తానికి పాస్టరే సూత్రదారని వారు ఆరోపించారు. ఈ కబ్జా వ్యవహారం పై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో నక్కా క్రాంతి,బూరి రాజేష్,అజయ్, రత్నకుమార్, నక్కా స్వామి, నక్కా మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

నాలబై కేజీల గంజాయి పట్టివేత

 నాలబై కేజీల గంజాయి పట్టివేత

మోతుగూడెం,పెన్ పవర్

చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధిలో పోలీస్ స్టేషన్ దగ్గర మంగళవారం సాయంత్రం ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ సత్తిబాబు తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేయుచుండగా దారకోండ వైపు నుండి మహబుబాద్ వైపువెలుతున్న TS26T6207 అను నంబర్ గల అటో వాహనం ఆపి తనిఖీ చేయగా వాహనంలో నాలబై కేజీల గంజాయి గుర్తించమని దాని విలువ సుమారు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుందని మరియు ఈ వాహనంలో ముగ్గురు వ్యక్తులను గుర్తించమని వారు షేక్ సలీం, మహ్మద్ సర్ధార్ మరియు మర్కండేశ్వరరావు ఉన్నారని విరుతెలంగాణ రాష్ట్రంలోని మహబుబాద్ జిల్లా చంద్ర గూడెం కు చెందిన వారు అని ఈ గంజాయిని దారకోండ నుండి తెలంగాణ రాష్ట్రంలోని మహబుబాద్ జిల్లా తీసుకొని వెళుతున్నట్లు నిందితులు చెప్పినట్లు నాలబై కేజీల గంజాయిని మరియు వాహనం స్వాధీనపరచుకొని నిందితులను అరెస్ట్ చేసి రంపచోడవరం కోర్టుకు హాజరు పరుస్తామని మోతుగూడెం ఎస్సై వి సత్తిబాబు తెలిపారు, ఈ కార్యక్రమంలో పశువైద్యశాఖ డాక్టర్ రవితేజ,విఅర్ఒ రాజు ,ఎఎసై పట్టాభి,రాజేష్, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

అదే నిర్లక్ష్యం... అదే వైపల్యం...

అదే నిర్లక్ష్యం... అదే వైపల్యం...

రెండో రోజు పెద్ద ఆసుపత్రిలో అదే సీను
  అక్షిజన్ అందక రోగులు విలవిల

విజయనగరం, బ్యూరో పెన్ పవర్ 
                 

ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు ఇది నిన్నటి మాట అయితే విజయనగరం పెద్ద ఆసుపత్రిలో అదే సీను రిపీట్ అయ్యింది. ప్రాణ వాయువు అందక రోగులు విల విలాడుతున్నారు.  సోమవారం వేకువజామున సంఘటన మరువక ముందే మరోసారి అధికారులు నిర్లక్ష్యం, వైపల్యం, కరోనా రోగులకు శాపంగా మారింది. మంగళవారం సాయంత్రం నుంచి అక్షిజన్ అందక రోగులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. అయ్యితే అధికారులు మాత్రం పైడి భీమవరం నుంచి ట్యాంకర్ బయలు దేరింది అంటూ చెప్పడం విడ్డురంగా ఉందని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ పేషేంట్ల పట్ల ఇలా మానవత్వం మరచి వ్యహరిస్తున్న అధికారుల తీరుపై పలువురు మండి పడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటన లకు వాస్తవం గ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని అంతా వాపోతున్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి తగు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

అక్రమ నిర్మాణాలు కూల్చివేత.

 అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. 

పెన్ పవర్ దినపత్రికలో వచ్చిన వార్తకు ఆర్డీఓ ఆదేశాలతో మంగళవారం కూల్చివేతలు.. 

అక్రమంగా వెలసిన ఏడింటిలో మూడు రూములు.. రెండు బేస్మెంట్లు తొలగించన రెవెన్యూ అధికారులు.. 

మిగతావి సర్వేచేయించి కూల్చవేయనున్నట్లు ఆర్డీఓ మల్లయ్య వెల్లడి.. 

మిగిలిన రూములను కూడా తొలగించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారంలో పెన్ పవర్ దినపత్రికలో ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు ప్రచురిస్తున్న సూరారం గ్రామ సర్వేనెంబర్ 181 ప్రభుత్వ స్థలంలో మరియు కోర్టు కేసులో ఉన్న 180 లో వెలసిన మొత్తం 7 అక్రమ నిర్మాణాలలో మూడు రూములను, రెండు బేస్మెంట్లను మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య ఆదేశాలతో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు.. సర్వేయర్ అందుబాటులో లేనందున మిగతా రూములను సర్వే చేసిన అనంతరం మిగతావి కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు.. అయితె మరో నాలుగు రూములు పట్టాదారు భూమిలో వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, స్థానిక తహసీల్దారు మైపాల్ రెడ్డి అందుబాటులో లేనికారణంగా పూర్తి సర్వే నిర్వహించి నాలుగు రూములపై చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య పేర్కొన్నారు.. ఈకూల్చివేతలలో విఆర్ఓ బాలరాజు విఆర్ఏలు,మరియు రెవెన్యూ ఇతర సిబ్బంది పాల్గొన్నారు..  విచిత్రం ఏమిటంటే 1954 నుండి నేటివరకు సంభందిత ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 181 రెవెన్యూ రికార్డులలోనే ప్రభుత్వ భూమిగా ఉంది.. అది రెవెన్యూ అధికారులు జారీచేసిన రికార్డులలో ఉంది..మరొక స్థలం సర్వేనెంబర్ 180  నవాబుల కాలంనుండి ఖాతానెంబర్ 74 "మీర్జా నిజాం బేగ్" అనే మహిళ పేరు మీదనే ఉంది.. సదరు కబ్జాదారులు తమ పేరుమీద మార్చాలని 2015లో చేసుకున్న ధరఖాస్తును..కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు 29-11-2017 వ తేదీనా మెమో నెంబర్ "బి/1135/2017" తిరస్కరించారు.. 2017 రెవెన్యూ రికార్డు (పహానీ)ప్రకారం "మీర్జా నిజాం బేగ్" పేరుమీదనే వస్తుంది.. కేవలం మీర్జా నిజాం బేగ్ కు మాత్రమె చెందిన 20 గుంటల పట్టాభూమి వారి వారసులకు మాత్రమే చెందుతుంది.. లేనియెడల ప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలని సూరారం వాసులు కోరుతున్నారు..

కరోనా కాటుకు బలైన రాజారావు

కరోనా కాటుకు బలైన రాజారావు  



 పెన్ పవర్, కందుకూరు

కందుకూరు టిఆర్ఆర్ కళాశాలలో రిటైర్డ్ హిందీ లెక్చరర్‌గా పనిచేసిన జిల్లెళ్ళమూడి రాజారావు (75) కరోనా మహమ్మారి కారణంగా మంగళవారం  తెల్లవారుజామున  కన్నుమూశారు. కందుకూరు పట్టణంలోని నందావారి వీధిలో   ఆయన శనివారం నుండి అస్వస్థతకు గురయ్యారు. శ్రీరామనవమి పండుగ రోజు ఆయన ఆధ్వర్యంలో ఆ వీధిలో ఉన్న రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిన ఆ కార్యక్రమం ద్వారానే ఆయన కరోనా బారిన పడ్డారని తెలిసింది. ముందు స్వల్ప లక్షణాలు కనిపించడంతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు. సోమవారం అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఒంగోలులోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేర్చేందుకు ప్రయత్నించారు.అక్కడ ఖాళీలు లేకపోవడం తో  అంబులెన్స్ లో మళ్ళీ కందుకూరుకు తీసుకు వచ్చారు.కందుకూరు లో అవకాశం లేకపోవడం తో రాజారావు ను తీసుకుని గుంటూరు లోని అమరావతి హాస్పిటల్ లో చేర్చారు.ఎంతో మందికి ఆత్మీయుడైన రాజారావు అందరినీ దుఃఖ సాగరంలో వదిలి తిరిగిరాని అనంత లోకాలకు వెళ్ళి పోయారు.రాజారావు మృతి పట్ల కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మానుగుంట కుటుంబానికి అత్యంత విధేయుడు.ఆంద్రాకేసరి సేవా సమితి, బ్రాహ్మణ సేవాసమితి,బ్రాహ్మణ ఉద్యోగ సమాక్య, కందుకూరు బ్రాహ్మణ ఆర్యవైశ్య సేవకులు, కందుకూరు కళావేదిక, కందుకూరు రిటైర్డ్ ఉద్యోగులు సంఘం, టి ఆర్ ఆర్ కళాశాల న్యాక్ సాధన సమితి,గాయత్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ రామకృష్ణారావు, టి ఆర్ ఆర్ ప్రిన్సిపాల్ రవికుమార్ తదితరులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

సరగా వారి చెరువులో మృత్యువాత పడ్డ చేపలు

సరగా వారి చెరువులో మృత్యువాత పడ్డ చేపలు

గోకవరం,  పెన్ పవర్

  ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తెల్లవారేసరికి చెరువులో ఉన్న చేపలు మొత్తం మృత్యువాత పడ్డాయి దీంతో మూడు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు  మహిళా రైతు సేలం శెట్టి వెంకటలక్ష్మి భర్త వెంకటేశ్వరరావు మత్స్య రైతు  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అంది వచ్చిన చేపల కాస్త మృత్యువాత పడడంతో సుమారు మూడు లక్షల మేర నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు , గోకవరం మండల కేంద్రమైన గోకవరం లో జరిగిన సంఘటన గోకవరం నుండి రంప యెర్రంపాలెం వెళ్లే దారిలో ఉన్న చెరువులో పంచాయతీ ఆధ్వర్యంలో చేపల పెంపకం కొరకు లీజుకు తీసుకున్న మహిళా రైతు సేలం శెట్టి వెంకటలక్ష్మి మూడు టన్నుల మేర చేపలు వేసి వాటికి మేత తో సహా సుమారు మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని తీరా పంట చేతికి వచ్చే సమయానికి చేపలను ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మృత్యువాత పడడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలి అని ఆవేదన తో కన్నీరు మున్నీరై విలపిస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చేపల మృత్యువాత పడడం పై గోకవరం పంచాయతీ కార్యనిర్వాహక అధికారి టంకాల శ్రీనివాస్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు పంచాయతీ అధికారులు మత్స్యశాఖ అధికారులు తమను ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...