Followers

ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ



ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ



 

గిద్దలూరు,  పెన్ పవర్

 

శనివారం యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో"ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని" సభ్యుల సొంత నిధులతో నల్ల బండ బజార్ కు చెందిన పద్మ అనే నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువులు,బియ్యము కంది పప్పు, వంట నూనె చింతపండు,



మరికొన్ని నిత్యావసరాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు ఫరూఖ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను గుర్తించి గుర్తెరిగి చేయూత అందించడం మానవ ధర్మం  సమాజ సేవలోనే మనకు నిజమైన ఆనందం ఆత్మసంతృప్తి కలుగుతుందన్నారు "మరిన్ని సేవా కార్యక్రమాలు యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ" "సభ్యుల సొంత నిధులతో చేపడతామన్నారు" ఈ కార్యక్రమంలో యువ ప్రగతి పథం., సభ్యులు .. వేణుగోపాల్, సంపత్, నాగరాజు, కోటేశ్వరరావు, ఖాదర్ వలీ, రత్నం, సుబానీ, లోకేష్ లు పాల్గొన్నారు. 


కందుకూరు ను వదలని  మహమ్మారి 18 పాజిటివ్ కేసులు. 



కందుకూరు ను వదలని  మహమ్మారి

 

18 పాజిటివ్ కేసులు. 

 

(పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి, పెన్ పవర్)

 

 

కందుకూరు పట్టణంలో మరో 8 పాజిటివ్ కేసులు తాజాగా వెలుగుచూశాయి.. టౌన్ పోలీసు స్టేషను ఎస్సై డ్రైవర్ కి పాజిటివ్ అని సమాచారం. కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో  పని చేస్తున్న ఓ అదికారికి.. వారి కుటంబంలో పాజిటివ్ అని సమాచారం..? కోటారెడ్డి నగర్ సచివాలయ పరిధిలో రెండు కేసులు.. సంతోష్ నగర్ లో ఒకటి.. పాత బాంక్ బజార్లో మరొకటి.   పట్టణంలో మరో రెండు ప్రాంతాలలో రెండు కేసులు నమోదయ్యాయి.? అని సమాచారం.

నియోజకవర్గంలోని కందుకూరు మండలం మోపాడు  లో మూడు కేసులు.. గుడ్లూరు మండలం పూరేటిపల్లిలో ఒకటి... లింగసముద్రం లో మూడు పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిసింది. వలెటివారిపాలెం మండలంలోని వలెటివారిపాలెంలో ఒకటి, పొలినేనిపాలెం లో  చుండిలో ఒకరికి పాజిటివ్ రావడంతో వీరిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు.  కేసులు పెరగడం తో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

 ఇంకా మరికొన్ని రిపోర్టులు రావాల్సి వుంది. మరిన్ని పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం వుంది. దీంతో కందుకూరు మున్సిపల్ కమిషనర్ మనోహర్, సీఐ విజయ్ కుమార్, రూరల్ ఎస్సై అంకమ్మ లు కేసులు వచ్చిన ప్రాంతాలను పరిశీలించి బ్లీచింగ్ తో శానిటేషన్ చేయించి ప్రజలు ఎవరు బయటకు రాకుండా అవగాహన కల్పించారు.


మంత్రి ఆళ్ల నానికి కరోనా రోగుల నుంచి ఫిర్యాదుల వెల్లువ


మంత్రి ఆళ్ల నానికి కరోనా రోగుల నుంచి ఫిర్యాదుల వెల్లువ
    ఏలూరు కలెక్టరేట్ నుంచి మంత్రి సమీక్ష
    నాణ్యతలేని భోజనం అందిస్తున్నారన్న రోగులు
    బాత్రూంలు శుభ్రం చేయడం లేదని ఫిర్యాదు
    సమస్యలపై తన ఫోన్ నెంబర్ కు కాల్ చేయొచ్చన్న మంత్రి


ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఏలూరులోని కలెక్టరేట్ నుంచి కరోనా సమీక్ష నిర్వహించారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులతో మంత్రి మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై మాట్లాడారు. ఏలూరు ఆశ్రమ్, భీమవరం, తాడేపల్లిగూడెం కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, ఈ సమీక్షలో మంత్రికి కరోనా రోగుల నుంచి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. చికిత్సా కేంద్రాల్లో పారిశుద్ధ్యలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, బాత్రూంలు సరిగా శుభ్రం చేయడంలేదని, దుప్పట్లు ఇవ్వడంలేదని, ముఖ్యంగా భోజనం నాసిరకంగా ఉందంటూ అత్యధికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని కరోనా చికిత్సా కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు వస్తే 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చని, లేకపోతే తన ఫోన్ నెంబర్ కైనా కాల్ చేసి సమస్యలు నివేదించవచ్చని ఆళ్ల నాని స్పష్టం చేశారు. 


ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు వేర్పాటువాదులు హతం


ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు వేర్పాటువాదులు హతం


అరుణాచల్ ప్రదేశ్ లో చాలా కాలం తర్వాత తుపాకుల మోత వినిపించింది. తిరాప్‌ జిల్లా ఖోన్సా ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌటర్‌ లో ఆరుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. నాగా వేర్పాటువాద సంస్థ అయిన నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలిమ్‌  (ఎన్ ఎస్ సీ ఎన్)  ఐ ఏం  సభ్యులు జరిపిన కాల్పుల్లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు గాయపడ్డాడని డీజీపీ ఆర్పీ ఉపాధ్యాయ తెలిపారు. నిఘా వర్గాల సమాచారంతో అస్సాం రైఫిల్స్‌కు చెందిన బలగాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ పోలీసులు ఉమ్మడిగా తిరాప్‌ జిల్లాలోని ఖోన్సా ప్రాంతంలో గాలింపు చేపట్టాయని డీజీపీ తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 తుపాకులు, రెండు చైనీస్‌ ఎంక్యూ, 5 కిలోల పేలుడు పదార్థాలు, ఒక కిలో ఐఈడీ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.


కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు..  ఇంటికే ఉచితంగా కరోనా కిట్..



కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. 
ఇంటికే ఉచితంగా కరోనా కిట్..


    హోం క్వారంటైన్ లో ఉన్నవారికి కిట్ల పంపిణీ
    కిట్ లో మందులు,శానిటైజర్, ఆక్సీమీటర్, మాస్కులు
    కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి తరలింపు


కరోనాపై పోరులో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఉచితంగా కరోనా కిట్లు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. కోవిడ్ పేషంట్లు ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు ఈ కిట్ ఎంతగానో ఉపయోగపడనుంది. మొదట్లో హోం క్వారంటైన్‌లో ఉన్న బాధితులకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. ఆ తర్వాత రెండు, మూడు రోజుల వ్యవధిలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. అందుకే వారికి అవసరమయ్యే వాటిని ప్రభుత్వం ఈ కిట్ ద్వారా అందిస్తోంది. ఇప్పటికే దేశంలోనే రికార్డుస్థాయిలో కరోనా శాంపిల్ టెస్టులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ప్రతీ జిల్లాకు కోటి రూపాయల నిధులు మంజూరు చేసి.. కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అలాగే కరోనా నిర్ధారణ టెస్టింగ్ కోసం ప్రతీ జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున ఏర్పాటు చేసింది. కరోనా రోగులకు హోం క్వారంటైన్ పూర్తయ్యే వరకు సరిపోయే మందులను ఈ కిట్ల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందులో మాస్కులు, శానిటైజర్లు, యాంటి బయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లతో పాటు ఆక్సిజన్ లెవెల్‌ను చూసుకునేందుకు పల్స్ ఆక్సీమీటర్ లాంటివి ఉంటాయి.


మాడుగుల ఆస్పత్రిలో కరోనా కలకలం





మాడుగుల ఆస్పత్రిలో కరోనా కలకలం


స్టాఫ్ నర్సుకు  కరోనా పాజిటివ్.

 

విధులకు విశాఖ నుంచి రాకపోకలు.


మంగళవారం రాత్రి నైట్ డ్యూటీ చేసిన స్టాఫ్ నర్స్.

వి మాడుగుల _పెన్ పవర్.




 




మాడుగుల సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కలకలం మొదలైంది.  ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న మహిళకు కరోనా  పాజిటివ్ రావడంతో  గ్రామం ఉలిక్కిపడింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినా  ఇంతవరకు ఒక్క కరోనా కేసు మండలం లోకి  చేరలేదు.  కానీ సి హెచ్ సి లో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న మహిళ విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తుంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిన ఆమెకు అనారోగ్యం తలెత్తడంతో వైద్యం కోసం ఆస్పత్రిలో చేరింది. కోవిడ్  19 లక్షణాలు కనిపించడంతో వైద్యులు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. శుక్రవారం ఉదయం ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు చెప్పడంతో  ఈ విషయం  మాడుగుల ఆసుపత్రికి చేరింది దీంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రోగులు కలకలం చెందారు. అప్రమత్తమైన వైద్యాధికారి  ఆస్పత్రి పరిసరాలు శానిటైజెషన్  చేయించారు. స్టాఫ్ నర్స్ తో విధులు నిర్వహించిన  సిబ్బంది  కాంటాక్ట్ అయిన వారిని హోం క్వారంటైన్ కు పంపారు.  స్టాఫ్ నర్స్  మూడు రోజుల క్రితం వరకు  ఆస్పత్రికి  రాకపోకలు సాగిస్తుంది.ఈమె వద్ద  వైద్యం చేయించుకున్న వారు ఎవరు  అన్నా దిశలో  ఆరా తీస్తున్నారు.గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు అధికారులు విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.  కోవిడ్19  డైరెక్టర్ అధికారికంగా  ప్రకటించాల్సి ఉంది.




నాటు బళ్ళు కార్మికులకు ఇక్కట్లు


నాటు బళ్ళు కార్మికులకు ఇక్కట్లు


 

అనకాపల్లి

 

అనకాపల్లి పట్నంలో పూడిమడక రోడ్లో నాటు బళ్ళు కార్మికులతో శాసనమండలి సభ్యులు  బుద్ధ నాగ జగదీశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక పాలసీ పేరుతో నాటు బండిలో ఇసుక రవాణా చేసే కార్మికులు 14 నెలలుగా పనులు లేక ఇసుక రవాణా సౌకర్యం ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు పశువులకు దాణా కూడా పెట్టలేక పోతున్నావ్ అని కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందని కార్మికులు వాపోయారు . ప్రభుత్వం ఇసుక పాలసీ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాటు బళ్ళు తో గృహ నిర్మాణం చేసుకునేవారికి ఉచితంగా సరఫరా ఉంటుందని ప్రకటన చేసినప్పటికీ అధికార యంత్రాంగం రెవిన్యూ సిబ్బంది పోలీస్ అధికారులు అడ్డుకోవడం జరుగుతుందనారు. ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అధికారులకు ఆదేశాలు లేకపోవడంవల్ల మేము ఏమీ చేయలేమని సమాధానాలు చెబుతున్నారని వై సి సి శాసనసభ్యులు చోడవరం ప్రాంతంలో ఇసుక రీచ్ ను ప్రారంభించారని అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అనుమతులు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాగ జగదీష్ తెలిపారు రెవిన్యూ డివిజనల్ అధికారి శాసన మండల సభ్యులు మాట్లాడారని సోమవారం లోపు సమాధానం చెబుతామని హామీ ఇచ్చారని  తెలిపారు. అనుమతులు ఇవ్వకపోతే అనకాపల్లి ప్రాంతం తో పాటు మూలపేట తుమ్మపాల ఇతర ప్రాంతాల నాటు బళ్ళు కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల సురేంద్ర, ఆళ్ల రామచంద్రరావు, అండిబోయినశేష, బొడ్డేడ మురళి , కొయిలాడ గణేష్, నాటు బళ్ళు కార్మికులు కర్రీ దుర్గ అప్పారావు ,బొడ్డేడ రామకృష్ణ, బొడ్డేడ వెంకటేష్ ,పూడి నూకరాజు, మల్ల పూర్ణచందర్రావు, లంక అప్పారావు ,కొణతాల అప్పారావు తుమ్మపాల ప్రాంతం నుండి కొణతాల అప్పారావు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...