Followers

గుడ్‌ న్యూస్‌: కరోనా చికిత్సకు మరో ఔషధం


గుడ్‌ న్యూస్‌: కరోనా చికిత్సకు మరో ఔషధం


అనుమతించిన డీసీజీఐ


దిల్లీ:


 కరోనా చికిత్సలో వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) మరో ఔషధానికి అనుమతులిచ్చింది. చర్మ వ్యాధి అయిన సొరియాసిస్‌ను నయం చేయడానికి ఉపయోగించే ‘ఇటోలీజుమ్యాజ్‌’ ఇంజెక్షన్‌ను ‘పరిమితం చేసిన అత్యవసర వినియోగం’ కింద వాడేందుకు అంగీకరించింది. మోతాదు నుంచి తీవ్ర స్థాయి లక్షణాలతో బాధపడుతున్న కొవిడ్‌ రోగులకు దీన్ని ఇవ్వొచ్చని తెలిపింది. 


కరోనా చికిత్సలో ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఇటోలీజుమ్యాజ్‌కు డీసీజీఐ డాక్టర్‌ వి.జి.సొమానీ అనుమతిలిచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత్‌కు చెందిన బయోకాన్‌ సంస్థ దీన్ని తయారు చేస్తోంది. కొవిడ్‌పై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిలో కీలకంగా పనిచేసే సైటోకిన్ల విడుదలలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రోగులపై చేసిన ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చిన తర్వాతే దీనికి అనుమతులిచ్చినట్లు డీసీజీఐ అధికారులు తెలిపారు. ఎయిమ్స్‌కు చెందిన పలువురు వైద్య నిపుణులు ఈ ప్రయోగాల్ని పర్యవేక్షించినట్లు వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా దీన్ని సోరియాసిస్‌ చికిత్సలో వినియోగిస్తున్నట్లు తెలిపారు. అయితే, దీన్ని తీసుకోవడానికి బాధితులు రాతపూర్వకంగా అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారిలో ‘ఇటోలీజుమ్యాబ్‌’ ప్రభావవంతంగా పనిచేస్తోందని ముంబయిలోని నాయిర్‌ ఆస్పత్రి మే నెలలోనే ప్రకటించింది. ఇద్దరు రోగులకు దీన్ని అందించగా వెంటిలేటర్‌ దశ నుంచి సాధారణ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించింది. బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)లోని ఆస్పత్రుల్లో ప్రయోగ పూర్వకంగా వాడేందుకు ‘ఇటోలిజుమ్యాబ్‌’ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అప్పట్లో ప్రకటించారు. ముందు రోగుల కాలేయం, కిడ్నీల పనితీరును పరీక్షించిన తర్వాతే ఈ మందు ఇస్తారు. కొందరు రోగులకు ఒకడోసు సరిపోతుండగా.. మరికొందరికి మూడు డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని అప్పట్లో నాయిర్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కరోనా చికిత్సలో రెమిడెసివిర్‌, ఫవిపిరవిర్‌ వంటి ఔషధాలు ప్రభావవంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. వీటిని పలు కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అలాగే కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల పర్యవేక్షణలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సైతం వాడొచ్చని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించిన విషయం తెలిసిందే


ఘనంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్  69 వ ఆవిర్భావదినోత్సవం


ఘనంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 

69 వ ఆవిర్భావదినోత్సవం

 

పెన్ పవర్ మార్కాపురం టౌన్

 

            మార్కాపురం డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపో కార్యదర్శి సిహెచ్ జనార్ధనరావు పతాక ఆవిష్కరణ చేసినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపో కార్యనిర్వాహక అధ్యక్షులు సోమయాజుల శాస్త్రి మాట్లాడుతూ ఆర్టీసీలో కార్మికుల కోసం నిత్యం పోరాడే యూనియన్ గా మరియు ప్రభుత్వంలో విలీనం అనంతరం

 సంస్థ అభివృద్ధి కోసం పోరాడుతూ కోవిడ్ -19 కోసం యూనియన్ సభ్యులు కూడా తమ వంతు సేవ చేస్తూ ఉన్నారు.

 సంస్థ అభివృద్ధి కోసంపోరాడుతూ, గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న యూనియన్ ఆర్టీసీ నుండి పిటీడీ గా మారిన తర్వాత కూడా అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ తో కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళుతున్న ది. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డెలిగేట్ దయా సాగర్, నాని, డిపో అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు, రహమత్, తాడి శ్రీను, లాబాను, మండ్ల. కాశయ్య, మహిళా ఉద్యోగులు వరలక్ష్మి, జరీనా బేగం, గ్యారేజి అధ్యక్ష కార్యదర్శులు ఇక్బాల్ భాష, ఫ్రాన్సిస్ లతో పాటుగా అత్యధిక మంది పాల్గొన్నారు.

మన్నేటికోట లో 30 మందికి కరోనా టెస్టులు 


మన్నేటికోట లో 30 మందికి కరోనా టెస్టులు 


ఉలవపాడు, పెన్ పవర్

 

మండల పరిధిలోని మన్నేటికోట గ్రామపంచాయతీ కార్యాలయం పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో డాక్టర్ కే శ్రీనివాసరావు మరియు సిబ్బందితో కలిసి మన్నేటికోట గ్రామం లో 28 మందికి ఆత్మకూరు గ్రామానికి చెందిన ఇద్దరికీ  కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్ ఏఎన్ఎంలు పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


సౌందర్యంతోపాటు  సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి!



సౌందర్యంతోపాటు 

సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి!

 

- పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై మరింతగా దృష్టిపెట్టాలి

 

-భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలి

 

-నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం (అర్కిటెక్చర్) కూడా ఒకటి

 

-స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలి

 

-ఐఐఏ జాతీయ సదస్సులో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

 

(న్యూఢిల్లీ నుంచి పెన్ పవర్ ప్రత్యేక ప్రతినిధి)

 

పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై భారతదేశ నిర్మాణరంగ నిపుణులు (ఆర్కిటెక్ట్ లు) మరింత దృష్టిపెట్టాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. భవన నిర్మాణరంగంలో సౌందర్యంతోపాటు సౌకర్యాన్ని సమ్మిళితం చేసి ప్రజల జీవితాలను మరింత ఆనందమయంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు తమవంతుగా కృషిచేయాలన్నారు.

 

శనివారం భారతీయ నిర్మాణరంగ నిపుణుల సంస్థ జాతీయ సదస్సు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నాట్‌కాన్ 2020 - ట్రాన్సెండ్) ను ప్రారంభించిన అనంతరం ఆన్‌లైన్ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ‘నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం కూడా ఒకటి. సింధు నాగరికత, తర్వాతి కాలంలో కోణార్క్ దేవాలయం మొదలుకుని.. ఆధునిక నిర్మాణాల వరకు భారతీయ నిర్మాణ విజ్ఞానంలో స్థానిక శిల్పుల నైపుణ్యత, వినియోగించిన సామాగ్రి, సాంకేతిక విజ్ఞానం పాత్ర చాలా ప్రత్యేకం. ఈ కట్టడాలే మన నిర్మాణరంగ కౌశలానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు. నిర్మాణరంగంలో ఆత్మనిర్భరతను సాధించే క్రమంలో.. మన ప్రాచీన, సంప్రదాయ కట్టడాల వారసత్వ నిర్మాణశైలిలోని గొప్పదనాన్ని అవగతం చేసుకుని, పర్యావరణహితాన్ని మదిలో ఉంచుకుని ప్రజల అవసరాలకు సరిపోయే విధంగా నిర్మాణాలు చేపట్టడంపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పునరుత్పాదక శక్తి వినియోగించడాన్ని కూడా ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.

 

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘స్మార్ట్ సిటీస్’, ‘అందరికీ ఇళ్లు’ వంటి కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. ఈ పథకాల అమల్లో భాగంగా.. ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలకు తగిన గౌరవం ఇవ్వాలన్నారు. ఇందుకోసం స్థానిక కళాకారులు, శిల్పుల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టే ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ స్థానికుల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. వారి అవసరాలకు తగ్గట్లుగా ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

‘పట్టణాల్లో వర్షాకాలం వస్తే రోడ్లపై, కాలనీల్లో నీరు నిలిచిపోతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రభావవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ఈ సమస్యలకు సరైన పరిష్కారాన్ని సూచించేందుకు ప్రయత్నించాలి’ అని ఉపరాష్ట్రపతి వారికి సూచించారు. 

 

కరోనా మహమ్మారి కారణంగా ప్రజారోగ్యం, వారి జీవన విధానంతోపాటుగా.. నిర్మాణరంగం కూడా ప్రభావితమైందన్నారు. కరోనా తదనంతర పరిస్థితులు, సమస్యల పరిష్కారానికి వినూత్నమైన ఆవిష్కరణలకోసం చర్చించి మంచి ఫలితాలు సాధించేందుకు ఈ జాతీయ సదస్సు వేదిక కావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.


నేటి నుండి టీ స్టాల్స్ బంద్


 


నేటి నుండి టీ స్టాల్స్ బంద్


 

గిద్దలూరు, పెన్ పవర్

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో రేపటి నుంచి టీ స్టాల్ బంద్ కానున్నాయని 
గిద్దలూరు సీఐ సుధాకరరావు ఈ సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని కొమరోలు గిద్దలూరు రాచర్ల బెస్తవారిపేట మండలాలలో రేపటి నుండి టీ స్టాల్స్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా టీ స్టాల్స్ బంద్ చేస్తున్నారని సీఐ సుధాకరరావు వెల్లడించారు. స్థానికంగా కంభం మార్కాపురం లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న టీ స్టాల్ యజమానులు స్వచ్ఛందంగా నేటినుండి టీ స్టాల్స్   మూసి వేస్తున్నట్లు ఆయన తెలిపారు 

 అలాగే ఎవరైనా కానీ గోప్యంగా టి అమ్మడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీ స్టాల్స్ యజమానుల సంఘం పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారని . ఎవరైనా కానీ అటువంటి చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని  సీఐ సుధాకరరావు వెల్లడించారు 

ఓబుళాపురం లో కరోనా పాజిటివ్



ఓబుళాపురం లో కరోనా పాజిటివ్

 

గిద్దలూరు, పెన్ పవర్

 

గిద్దలూరు మండలం ఓబులాపురం లో కరోనా పాజిటివ్ కేసు నమోదు

 

అప్రమత్తమైన అధికారులు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన 
సీఐ సుధాకరరావు


 

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో... అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఓబులాపురం గ్రామం చేరుకున్నారు.   సీఐ సుధాకరరావు  భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.,  కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తిని ఐసోలేషన్ తరలించేందుకు ఏర్పాట్లు చేేశారు.  గ్రామాన్ని కంటోన్మెంట్ జోన్  గా ఏర్పాటు చేసేందుకు  చర్యలు తీసుకున్నారు. అలానే కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు..? గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు, సదరు కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలానే గ్రామ ప్రజలు ఎవరు కూడా కంటోన్మెంట్ జోన్ దాటి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని,కరోనా అనుమానిత లక్షణాలు కలిగి ఉంటే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. 



ఫ్రెండ్లీ పోలీస్


ఫ్రెండ్లీ పోలీస్


స్వార్థం లేని పోలీస్  మానవత్వం తెలిసిన పోలీస్ , న్యాయం ధర్మం తెలిసిన పోలీస్,  పోలీస్ అంటే ఇలాగే ఉండాలని నిరూపించిన  గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు.


ప్రపంచ దేశాల్ని గడగడా లాడిస్తున్న కరోనా వైరస్ నిర్ములన కొరకు గిద్దలూరు లో ఇటీవల కాలంలో జరుగుతున్న లాక్ డౌన్లో  గిద్దలూరు సర్కిల్  ఇన్స్పెక్టర్   సుధాకర్ రావు  సమర్థవంతంగా తన విధులు నిర్వహించారు.


తమ కుటుంబాలను మరియు ప్రాణాలు సైతం పక్కన పెట్టి రాత్రింబవళ్లు  కరోనా వైరస్ పై పోరాటం చేసి ఇప్పటి వరకు గిద్దలూరు లోని ప్రజలు వైరస్ భారీ పడకుండా   పోలీస్ వ్యవస్థ నుంచి ప్రధాన పాత్ర పోషించారు.


గిద్దలూరు లోని ప్రజలు  కరోనా వ్యాధి భారిన పడకుండా ప్రజలకు  అవగాహన తీసుకొని వచ్చారు.


గిద్దలూరు లో  ప్రజల మన్ననలు పొందిన గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు


సమస్యల కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ప్రజలకు వెంటనే చిరునవ్వుతో ప్రేమతో  స్వాగతం పలికి వారి సమస్యలను సానుకూలంగా శాంతియుతంగా పరిష్కారం చేయడం లో దిట్ట అని నిరూపించుకున్నారు. గిద్దలూరు  సర్కిల్  ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు కు
సలాం, పోలీస్ సలాం
అంటూ గిద్దలూరు ప్రజలు జీవితాంతం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు, ఈ విధంగా ఇటువంటి వ్యక్తి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేయడం పోలీసులకే కాకుండా ప్రజలకు కూడా చాలా ఆనందంగా ఉందని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...