Followers

మండపేట మండలం లో శనివారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు  


మండపేట మండలం లో శనివారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు


 
మండపేట, పెన్ పవర్


మండలం లో శనివారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కాగా మరొకరు ద్వారపూడి వార్డు వాలంటీర్. దీంతో ఆయా కార్యాలయ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారి నివసించే ఇంటివద్దా, కార్యాలయాల వద్దా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ప్రమాదం ఎటు నుండి వస్తుందో అర్ధం కాకుండా ఉందని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఇల్లాల్లోనే వుంటూ ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగవద్దని ఆయన సూచించారు.


ఏజెన్సీ 13 గ్రామాల ప్రజలను తరలించేందుకు  అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు


ఏజెన్సీ 13 గ్రామాల ప్రజలను తరలించేందుకు 
అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు


ప్రాజెక్టు నిర్వాసితుల గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి..
అర్హులైన అందరికీ అటవీ భూములపై సాగు హక్కు కల్పించేందుకు చర్యలు
సీజనల్ వ్యాధులు, వరదలపై, పునరావాస కాలనీ పనులపై సమీక్ష


పోలవరం పెన్ పవర్


అర్హులైన గిరిజనులకు అటవీ భూముల పై  సాగు హక్కు కల్పించేందుకు అర్హులై న లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు .
శుక్రవారం పోలవరంలో సంబంధిత శాఖల అధికారులతో  అటవీ భూములపై గిరిజనులకు సాగు హక్కు కల్పించేందుకు  పట్టాల పంపిణీ,  పోలవరం  నిర్వాసితులకు  పునరావాస  కాలనీలలో  జరుగుతున్న  పనులపై , సీజనల్ వ్యాధులు వ్యాప్తి, వరదలు పై   ఆయన సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరానికి ముందు ఎవరైతే అటవీ  భూములు సాగు చేసుకుంటున్నారు వారిని ఈనెల 20వ తేదీలోగా గుర్తించి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి  వక్కరికి అటవీ భూములపై సాగు హక్కు కల్పించేందుకు పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే సిద్ధం చేసిన జాబితా ను మరొకసారి పరిశీలించాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కొరకు నూతనంగా నిర్మించిన కాలనీలలో మిగిలి ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేసి ఈ నెలాఖరు నాటికి 13 కాలనీల కు  ప్రజలను తరలించాలని ఆయన సంబంధిత ఏజెన్సీలకు   ఆదేశించారు.  మిగిలిన కాలనీలో పనులు కూడా త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ 13 గ్రామాలలోని ప్రజలను తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టలని జిల్లా  కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా అన్నీ గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేయాలన్నారు. వచ్చే 3 నెలలకు సరిపడే విధం మందులు సిద్ధం చేసుకోవాలన్నారు.   ఐ టి డి ఏ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫోన్ రాగానే వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ కెంపులు నిర్వహించాలన్నారు. డెంగు,మలేరియా వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.వరదలు వస్తే తీసుకోవల్సిన ముందస్తు చర్యల పై జిల్లా కలెక్టర్  సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ  కె వెంకట్ రమణారెడ్డి ,, పోలవరం  ప్రాజెక్టు  ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద్, ఐటీడీఏ  పీ వో ఆర్ వి సూర్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఆర్డీవో శ్రీమతి ప్రసన్న లక్ష్మి, ఎస్సీ పంచాయతీ రాజ్ కే సుబ్రహ్మణ్యం , డిప్యూటీ  డి యం &హే ఓ  డాక్టర్ మురళి కృష్ణ , వివిధ శాఖల అధికారులు, ఈ ఈ లు  తదితరులు పాల్గొన్నారు.


రెడ్ జోన్ కుటుంబాలకు దాతలు దాతృత్వం.


రెడ్ జోన్ కుటుంబాలకు దాతలు దాతృత్వం.



తాళ్లపూడి, , పెన్ పవర్:



పైడిమెట్ట లోని రెడ్ జోన్ కుటుంబాలకు శుక్రవారం దాతలు తమ దాతృత్వం చూపించారు. పైడిమెట్ట పంచాయితీ టాంక్ వాచరు గెడ్డం రాజు పాలు పాకెట్స్ పంచిపెట్టగా, కొయ్యలగూడెంలోని చర్చ్ పాస్టర్ కె. డేవిడ్ రాజు, అన్నామని దంపతులు కూరగాయల కిట్లు పంపిణీ చేశారు. నల్లజర్ల  కు చెందిన దూలపల్లి రవి ప్రసన్న బాబు, లక్ష్మి ప్రసన్న దంపతులు రెడ్ జోన్ కుటుంబాల వారికి చికెన్ అందచేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొల్లి దుర్గారావు, టీడీపీ నాయకులు కొప్పాక పోశియ్య, కొప్పాక రాజు, వెంకట్రావు,అవినాష్,ప్రమోద్ పాల్గొన్నారు. వాలంటీర్లు కొప్పాక జనప్రియ,పావని సహకారం అందించారు.అదేవిధంగా శనివారం నాడు
రెడ్ జోన్ కుటుంబాలకు, గ్రామానికి చెందిన వాలంటీర్ కొప్పాక జనప్రియ తన ఒక నెల జీతాన్ని హెచ్చించి పాలు , కిరాణా సరుకులు అందచేసింది. కార్యక్రమంలో వైసీపీ నాయకులు యాళ్ల బాబురావు, కొల్లి దుర్గారావు, పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్ , సుబ్బారావు, పసలపూడి ఆశీర్వాదం, పుష్పరాజు,పోసియ్య, రాజు, జొన్నకూటి రాజు తదితరులు పాల్గొన్నారు


"ఈ-కర్షక్ " నమోదు గురించి అవగాహనా సదస్సు



"ఈ-కర్షక్ " నమోదు గురించి అవగాహనా సదస్సు



తాళ్ళపూడి,  పెన్ పవర్: 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల పాలిట వరాల జల్లు కురిపించే తరుణంలో రైతులు పండించే పంటకు మద్దతు ధర ఇవ్వడానికి, ఎరువులు, విత్తనాలు, పనిముట్లు, వడ్డీలేని రుణాలు, రైతు భరోసా పధకాలు పొందుటకు కేంద్రబంధువయిన "ఈ-కర్షక్ నమోదు కార్యక్రమం" విజయవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారంనాడు తాళ్ళపూడి మండలంలోని అగ్రికల్చర్ ఆఫీసులో రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం వ్యవసాయ అధికారి జి.మోహన్ రావు నిర్వహించారు. రైతులు ధాన్యం అమ్ముటకు;ఎరువులు, విత్తనాలు పొందుటకు; పంట నష్టం జరిగినపుడు రైతు భరోసా కొరకు;సున్నా వడ్డీ పంట రుణాల కొరకు; వివిధ రకాల పథకాలకు రైతులంతా ఈ-కర్షక్ లో నమోదు చేయించుకోవలసిందిగా చూసించారు. ముఖ్యఅతిథి ఎం.ఆర్.ఒ. ఎం.నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ కర్షక్ నమోదు అనేది     జాగ్రత్తగా,నిష్పక్షపాతoగా,పొలానికి వెళ్లి చేయాలని తెలిపారు. కౌలు రైతులకు ఈ-కర్షక్ నమోదులో అవకాశం కల్పించాలని, 100% పంట నమోదు పూర్తిచేయాలని తెలిపారు. ఎ. యస్.ఒ. జె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ-పంట ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని ఏవిధంగా పరిష్కరించాలో తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వి.ఆర్.ఒ. లు, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.


ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ గా పిట్టా నాగమణి


ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ గా పిట్టా నాగమణి



అన్నవరం  అంతర్ జాతీయా హ్యోమన్ రైట్స్ (ఐ హెచ్ ఆర్ సి) తూర్పుగోదావరి జిల్లా వైస్ చైర్మన్ గా శ్రీమతి పిట్టా నాగమణి ని జిల్లా చైర్మన్ పఠాన్ అహ్మద్ వలీఖాన్ అధ్వర్యంలో జగ్గంపేట యూటియఫ్ భవనంలో జరిగిన సమావేషంలో ప్రకటించినారు అనంతరం పఠాన్ అహ్మద్ వలీఖాన్ మాట్లాడుతు అంతర్ జాతీయా హ్యోమన్ రైట్స్ మహిళలపై జరిగే అత్యచారలు అరికటేందుకు కృషిచేస్తుంది ఈ కమిటిలో ప్రజలకు స్వతహగా సేవచేసెటువంటి వారి ని తిసుకుంటుంన్నారు మండల స్దాయి నియోజకవర్గ కమిటి లు కూడాఏర్పటు చేయాడం జరిగుతుందిఅని అన్నారు. పిట్టా నాగమణి మాట్లాడుతు ఖాన్ గారు నామీద పెట్టినటువంటి బాధ్యతను నేను సక్రమంగా నేరవర్తిస్థానని మహిళల పట్ల ఎక్కడ అన్యాయంజరిగిన ముందు ఉండి వారికి సహకరిస్తానని నాకు వైస్ చైర్మన్ బాధ్యతను ఇచ్చిన ఖాన్ గారికి నాకృతఙ్ఞతలు చేలియా చేస్తున్నాను అని అన్నారు.


ఘనంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు జన్మదిన వేడుకలు



 


ఘనంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు జన్మదిన వేడుకలు


 



         మునగపాక, పెన్ పవర్



మునగపాక:యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే యు.వి రమణ మూర్తి రాజు(కన్నబాబు రాజు)జన్మదిన వేడుకలను మండల వైసీపీ నాయకులు కాడ్రేగుల నూకరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో స్థానిక వైసీపీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రమణ మూర్తి రాజు కి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు.


ప్రభుత్వ భూములను పరిశీలించిన ఆర్డీవో లక్ష్మీప్రసన్న...

 


ప్రభుత్వ భూములను పరిశీలించిన ఆర్డీవో లక్ష్మీప్రసన్న...


అవసరమైతే కొనుగోలు చేయండి ఆర్డిఓ



పోలవరం పెన్ పవర్


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఆగస్టు 15 వరకు వాయిదా పడటంతో పూర్తిస్థాయిలో లేఅవుట్లు సిద్ధం కానీ   పోలవరం మండలం గూటాల గ్రామంలో  నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూములను జంగారెడ్డిగూడెం ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న శుక్రవారం పరిశీలించారు. గుటాల పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు అర్హులైన 163 మంది లబ్ధిదారులకు గాను గూటాల గ్రామం కోండ్రు వీధి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన లే అవుట్ లలో 68  మంది లబ్ధిదారులకు మాత్రమే రావడంతో మిగతా  95 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న  గుటాల ,కొత్త పట్టిసీమ గ్రామాలలో ఉన్న డి ఫామ్ పట్టా భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములను పరిశీలించారు. కొండ ప్రాంతంలో గల భూములు, చెరువు భూములు ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించవచ్చని ప్రజలకు అనువుగా ఉండే భూములు ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అయినా లేఅవుట్లు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేసే నాటికి పూర్తి స్థాయిలో లేఅవుట్లు పూర్తి చేయాలని ఆర్ డి ఓ అన్నారు. ఆర్డీవో వెంట పోలవరం ఎమ్మార్వో ఎండి నజీముల్లా షా , ఆర్ఐ కాజా రమేష్, వీఆర్వో ప్రసాద్, స్సర్వేరియర్ హరికృష్ణ, సుంకర అంజిబాబు, సుంకర కొండబాబు, డి హరి రామ కృష్ణ, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...