Followers

ఉపాధి కూలీలతో బీజేపీ సమావేశం



ఉపాధి కూలీలతో బీజేపీ సమావేశం


అనకాపల్లి పెన్ పవర్



 తగరంపూడి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఎన్ అప్పారావు, మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు , భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి  శ్రీనివాసరావు, కప్పెర తాతారావు పాల్గొన్నారు.  ఉపాధి హామీ పథకం కూలీ రేటు ఇరవై రూపాయలు పెంచి 202 రూపాయలు చేయడమైనది అన్నారు. అదేవిధంగా రాబోయే మూడు నెలలు ఉచితంగా అర్హులైన అందరికీ రేషన్ ఇవ్వటము  అవుతుందని వచ్చే నెలలో  కిషాన్ సమ్మోహన నిధి కింద రెండు వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేయడం అవుతుందని చెప్పారు .  ఒక సంవత్సర కాలంలో మోడీగారి సాధించిన విజయాల్ని చేసిన కార్యక్రమాల యొక్క ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన నిధుల వివరాలను కరపత్రాల  పంపిణీ చేశారు.


రహదారి పనులు  పై నిరసన -మాజీ ఎమ్మెల్యే పెందుర్తి


రహదారి పనులు  పై నిరసన  -మాజీ ఎమ్మెల్యే పెందుర్తి


పెన్ పవర్ ,సీతానగరం


 


మండల కేంద్రం నందు రహదారి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పత్రికా విలేఖరులతో పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వరకు గల జాతీయ రహదారిని తెలుగుదేశం హయామంలో ఆర్ అండ్ బి నుండి స్టేట్ హైవే గా మార్చి కాతేరు వరకూ పూర్తిచేసిన పనులను సీతానగరం వరకూ తక్షణమే పూర్తిచేయాలని ఈ నిరసన దీక్షను చేపట్టడం జరిగిందని అన్నారు. మండల ప్రజలు రాజమహేంద్రవరం  డయాలసిస్ పేషెంట్స్, వృద్ధులు,వికలాంగులు పలువురు వైద్య సేవల నిమిత్తమై వెళ్లాలంటే రహదారి తూట్లు తూట్లు కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ నాయకులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఈ రోడ్డు దుస్థితి గమనించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ నాయకులను అధికారులను వెంకటేశ్ డిమాండ్ చేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పెళ్ళికానుకను తమ ప్రభుత్వ పెళ్లి కానుకగా మార్చి సంవత్సర కాలం నుంచి ప్రజలకు ఎటువంటి న్యాయం జరగని దుస్థితి నెలకొందని అన్నారు. పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప పేదలకు పూర్తి న్యాయం జరగడం లేదని సూచించారు.నీట మునిగిన పంట పొలాల రైతులను ఆదుకుని ఆ రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. పేదలకు అందించే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ లోన్లు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని కరోనా మహమ్మారి తీవ్రంగా వృద్ధి చెందుతున్న సందర్భంలో సీతానగరం మండలంలో ప్రజా సమస్యలను తక్షణమే సేకరించేందుకు పోలీస్ స్టేషన్ నందు పర్మినెంట్ ఎస్సై లేకుండా ఇంచార్జ్ ఎస్ఐలతో నియోజకవర్గ పరిపాలన నడుస్తుందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నాటుసారా వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వులవుల రాజా,కంటే వీరన్న చౌదరి,మింగి లక్ష్మీనారాయణ,పుక్కాల శ్రీను,అడబాల వీరబాబు,నాగా రమేష్, కొయ్య సామ్యేల్,పెందుర్తి రాజా,పోలిన కృష్ణ, గద్దే రసురేష్,మంచాల బాలాజీ,అఖిలపక్ష రైతు సమన్వయ కర్త కడపా శ్రీను తదితరులు  పాల్గొన్నారు.


అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి


 


అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి

 

పశువులుతో వెళ్ళి  అదృశ్యమైన బాలుడు

 

వారం తరువాత శవమై కనిపించాడు

 

సిరసపల్లిలో అలుముకున్న విషాద ఛాయలు

 

 పెదబయలు/విశాఖపట్నం బ్యూరో (పెన్ పవర్)

 

పశువులు తోలుకు వెళ్ళి న బాలుడు ఆరు రోజుల తరువాత శవమై కనిపించాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.పెదబయలు మండలం సిరసపల్లి గ్రామానికి చెందిన కృష్ణ రావు ఒక్కగానొక్క కుమారుడు రోహిత్ కుమార్ (13) గత ఆదివారం పశువుల కాపలకు  వెళ్లాడు. సాయంత్రం అయిన ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి తండ్రులు వెతికారు.అయినా ఫలితం లేదు.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న  రోహిత్ కుమార్ కనిపించక తల్లిదండ్రులు వారం రోజులు నిద్ర ఆహారం లేక శోకసంద్రంలో పడిపోయారు.పాడేరు గాలింపు చర్యలు నిమిత్తం ఈరోజు ఉదయం అటు వైపు వెళ్లిన పలువురికి దుర్వాసన రావడంతో దగ్గరకు వెళ్లి చూడగా చెట్టు కొమ్మపై బాలుడి మృతదేహం వేలాడుతుంది. తక్షణమే సమాచారం అందుకున్న తండ్రి మృతదేహాన్ని పరిశీలించి శవం తన కుమారునిదే అని గుర్తించాడు.ఈ సంఘటన పై తండ్రి కృష్ణారావు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు .ఆదివారం తన కుమారుడు తో పసుపుల ఆనందరావు, చిట్టపులి భూపతి పడల్, కుంటూరు బొజ్జయ్య, వెచంగి హేమంత్ కుమార్ లు కలసి  పశువులకాపాలకు వెళ్ళారని కానీ రోహిత్ మాత్రం తిరిగి రాలేదని చెప్పారు. సాయంత్రం 7గంటలకు సెల్ఫోన్ ఎక్కడో పడిపోయిందని  ఆ నలుగురు తన వద్దకు వచ్చారని తెలిపారు. మరలా నాలుగు రోజుల తర్వాత పోయిన సెల్ ఫోన్ వారే తెచ్చారు అని తెలిపారు. గత కొన్నాళ్లుగా కుటుంబీకులతో తగాదాలు ఉన్నాయని దానితో వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.... ఈ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని తండ్రి కోరుతున్నారు.... ఈ విషయంపై పెదబయలు ఏఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు .పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తామని తెలిపారు.

విస్తృత తనిఖీలు


జి.మాడుగుల, పెన్ పవర్   


సిపిఐ మావోయిస్టు వారోత్సవాలు దగ్గర పడుతుండడంతో మన్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తు, భద్రత కట్టుదిట్టం చేశారు జి.మాడుగుల తహశీల్దార్  కార్యాలయం సమీపంలో మండలంలోని నిత్యం మారుముల ప్రాంతాలకు  వెళ్లివచ్చే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. జి. మాడుగుల స్టెషన్  ఎస్సై, ఎ. ఎస్సై, సిబ్బంది పాల్గొన్నరు.

డ్రైనేజీ వేశారు పై కప్పులు మరిచారు


 

జి.మాడుగుల, పెన్ పవర్



 

మారుమూల ప్రాంతమైనటువంటి

మద్దిగరువు గ్రామములో డ్రైనేజి కొరకు కాంట్రాక్టురు అరకొర పనులతో పూర్తి చేయకుండ డ్రైనేజి పై మూతలు నిర్మించకుండ బిల్లులు విషయములో మాత్రం ముందున్నారు. ఈ డ్రైనేజి పై మూత వేయకపోవడంవలన ముసలివారు చిన్న పిల్లలు డ్రైనేజిలో పడిపోతున్నారు అందువలన గ్రామస్తులు ఎవరి ఇంటి ముందు వాళ్ళు సొంతంగా పలకలకి వందరూపాయలు  పెట్టి వేయించు కుంటున్నారు, సదరు కాంట్రాక్టర్ ఈ విషయంపై స్పందిచక పోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు 


విశాఖ డిస్ట్రిక్ట్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వంశీ కృష్ణ.




విశాఖ డిస్ట్రిక్ట్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వంశీ కృష్ణ.

 

    విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

విశాఖపట్నం జిల్లాకు  రాష్ట్రంలోనే కాకుండా  దేశంలో బ్యాడ్మింటన్ క్రీడలో  సముచితమైన గుర్తింపు తెచ్చేందుకు  కృషిచేస్తానని షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నూతన అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్ యాదవ్ ఇలియాస్ వంశీకృష్ణ యాదవ్ అన్నారు.శనివారం అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగాఏకగ్రీవంగా ఎన్నికైన వై ఎస్ ఆర్ సి పి నగర అధ్యక్షుడైన వంశీకృష్ణ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడలో విశాఖపట్నం మెరికల్లాంటి క్రీడాకారులను అందించిందని అదే పంధా కొనసాగించేలా సీనియర్ క్రీడాకారులు క్రీడాభిమానులు అందరిసహకారంతో  మరింతగా పేరు ప్రఖ్యాతులు తెస్తామన్నారు జిల్లా సంఘం నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడు 2011 అమలు చేస్తూ  నూతన  కార్యదర్శిగా పల్లా శ్రీనివాసరావు ని ఏకగ్రీవంగా సభ్యులంతా ఎన్నుకున్నారు వంశీకృష్ణ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడ అభివృద్ధికి  తన శాయశక్తులా కృషి చేస్తానని మేజర్టోర్నమెంట్లు నిర్వహణ క్రీడాకారులకు ప్రోత్సాహం తదితర అంశాలపై దృష్టి పెడతానని అంతేకాకుండా విశాఖపట్నంకు గతంలో ప్రభుత్వం మంజూరు చేసిఅనివార్య కారణాల వల్ల ఆగిపోయిన  బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు ఇప్పటివరకు కార్యదర్శిగా వ్యవహరించినచుక్క శ్రీనివాసరావు పదవికి రాజీనామా చేస్తూ పల్లా శ్రీనివాస్ పేరును కార్యదర్శిగా ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పోలీస్ అధికారి అయిన చుక్క శ్రీనివాసరావు తో పాటు మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ స్పోర్ట్స్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా తమ రాజీనామాలు సమర్పించారు అధ్యక్షత వహించిన సర్వసభ్య సమావేశంలో చర్చించారు.



వరహా నదిలో పడి ఆవు మృతి



వరహా నదిలో పడి ఆవు మృతి

 

ఎస్.రాయవరం/విశాఖ పెన్ పవర్

 

 ఎస్. రాయవరం మండలం ధర్మవరం- అగ్రహారం గ్రామంలో శుక్రవారం వరహానది లో ప్రమాదవశాత్తు పడి ఆవు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే ధర్మవరం మరియు ఏటికొప్పాక కు వరహానది పక్కనుండి గూర్జ్ రహదారి ఉన్నది. అక్కడ గూర్జ్ కి అనుకుని చాలా మంది రైతులకు భూములు ఉన్నాయి. అక్కడ గ్రామానికి చెందిన స్థానిక వైసీపీ నాయకుడు, ఎలిమెంటరీ స్కూల్ చైర్మన్ వెదుళ్ల బద్రి కి చెందిన ఆవు మేతకు వెళ్లి నీటిలో పడిపోయి చనిపోవడం జరిగింది. ఈ విషయమై ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వరహానది గట్టు గురించి ఎటువంటి జాగ్రత్తలు  తీసుకోక నోరులేని మూగ జీవాలే  కాక , మనుషులు కూడా కాలు జారి పడిపోయిన సంఘటనలు అనేకం జరిగాయి. అక్కడ గట్టు లేక కోతకు గురయ్యే భూములు కూడా ఏటిలో కలిసిపోతున్నాయి అని అక్కడ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా   అధికారులు స్పందించి ప్రభుత్వానికి సమగ్ర  నివేదిక సమర్పించాలని కోరుతూధర్మవరం-అగ్రహారం  గ్రామ మాజీ ఉపసర్పంచ్ సయ్యాదుల అచ్యుత్ కోరారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...