Followers

పురపోరులో రెబల్స్ జోరు

 పురపోరులో రెబల్స్ జోరు 

 ఐదు వార్డులో వైసిపి రెబల్స్ 

నాయకుల తాయిలాలు, లొంగని స్వతంత్రులు

నర్సీపట్నం, పెన్ పవర్ 

నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి రెబల్స్ వ్యవహారం తలనొప్పిగా మారింది. సహజంగా అధికార పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీలోనూ కొనసాగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కొన్ని వార్డుల్లో రెబల్ అభ్యర్థులను బుజ్జగించి, తన దారికి తెచ్చుకున్నారు. అయితే ఇంకా కొన్ని వార్డుల్లో అనిశ్చితి  కొనసాగుతోంది. ఎమ్మెల్యే , పార్టీలో సీనియర్లు ఎంత నచ్చజెప్పినా మాట వినడం లేదు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి పార్టీకి అండగా ఉంటామని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చొరవ చూపి ఆరో వార్డులో మళ్ళ గణేష్ , 12 వార్డులో దాసును తన దారికి తెచ్చుకున్నారు. అయితే 1, 2 వార్డులలో మాకిరెడ్డి అప్పారావు దంపతులు,  మూడవ వార్డులో మామిడి శ్రీనివాసరావు, 14 వ వార్డులో వర్రే శ్రీనివాసరావు, 15 వార్డులో పెద్దిరెడ్ల శ్రీనివాసరావు స్వతంత్రులుగా బరిలో కొనసాగుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, పుర పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార పార్టీకి స్వతంత్రులే అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది.

ప్రచారంలో జోరుపెంచిన దేవత అరుణ

 ప్రచారంలో జోరుపెంచిన దేవత అరుణ

25వ వార్డులో వైసిపి ఇంటింటా ప్రచారం

నర్సీపట్నం పెన్ పవర్ 

25 వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దేవత అరుణ ప్రచారం ముమ్మరం చేశారు. గడపగడపకూ తిరుగుతూ ఓటర్లను కలిసి  ఆశీర్వాదం కోరుతున్నారు.  ప్రత్యర్థి ఆర్థికంగా, రాజకీయంగా బలవంతుడైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఆమె చేస్తున్న ప్రచార శైలిని వార్డు ప్రజలు అభినందిస్తున్నారు.  సహజంగా సామాజిక కార్యకర్త ఐన అరుణ, తన వాక్చాతుర్యంతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. తనను గెలిపిస్తే రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇంటింటా ప్రచారంలో ప్రజలు చెబుతున్న సమస్యలను ఒక బుక్ లో నోట్ చేసుకుని, గెలిచిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించారని,  మరిన్ని సంక్షేమ పథకాల కోసం వైసిపి అభ్యర్థులను గెలిపించడం ద్వారా, సీఎంకు అండగా నిలవాలని అరుణ కోరారు. 25 వ వార్డును క్లీన్ వార్డ్ గా గుర్తింపు తెచ్చేలా డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని దేవత అరుణ ఓటర్లకు హామీ ఇస్తున్నారు.

సమరానికి" సై" అంటున్న ప్రధాన పార్టీ" రెబల్" అభ్యర్థులు

 సమరానికి" సై" అంటున్న ప్రధాన పార్టీ" రెబల్" అభ్యర్థులు




ఆరిలోవ  పెన్ పవర్

తూర్పు నియోజకవర్గం 13 వ వార్డులో ప్రధాన పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్ కి గట్టి సమాధానం ఇవ్వనున్న రెబల్ అభ్యర్థులు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులవిషయంలో కొలిక్కి రాకపోవడం ఒకవైపు అయితే, మరోవైపు పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్ కి రెబల్ అభ్యర్థులు గట్టిపోటీ  ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా టిడిపి అభ్యర్థిగా నల్లాని వరలక్ష్మి. పార్టీ టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో, పార్టీకి  సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన తనకు గుర్తింపు ఇవ్వనందున రెబల్ గా తన ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ రెబల్ అభ్యర్థిగా కెల్లా సత్యనారాయణ. సతీమణి కెల్లాసునీత సత్యనారాయణ. వనము వరలక్ష్మి. సిపిఎం శీ రెడ్డి రంగమ్మ సిపిఐ విమల. జనసేన నీలి వెంకట నాగ భాను. ఇతర స్వతంత్ర అభ్యర్థులు తన ప్రచారాన్ని ప్రారంభించారు..

ఏజెన్సీలో వీడని ముఢనమ్మకాలు, అనారోగ్యం చేస్తే గురువు వద్ద పూజలు, వైద్యం చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు

ఏజెన్సీలో వీడని ముఢనమ్మకాలు, అనారోగ్యం చేస్తే గురువు వద్ద పూజలు, వైద్యం చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు

 గూడెం కోత్తవీధి పెన్ పవర్ 

విశాఖ ఏజెన్సీలో మారుమూల గిరిజన గ్రామాల్లో మూఢనమ్మకాలు జాడ్యం వీడడం లేదు, ఏజెన్సీలో తరాలు మారుతున్న గిరిజనుల్లో అవగాహన లేకపోవడం వల్ల మూఢనమ్మకాలు మీద ఆధారపడుతున్నారు, మారుమూల గిరిజన గ్రామాల్లో అనుకోని సంఘటనలు జరిగినా అనారోగ్యం పాలైన గురువులతో వారి పూజలు చేయించుకోవడం పరిపాటిగా మారింది,ఈ పూజలతో ఎటువంటి ప్రయోజనం లేక వేల రూపాయలు నష్టపోతున్నారు, అలాగే వచ్చిన వ్యాధులు ముదిరిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు, ఈ కోవలోనే మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లలో, నడిచే దారిలో ఆ గ్రామాలకు చెందిన గిరిజనులకు వచ్చిన చిన్నప్పటి వ్యాధిని తగ్గించుకోవడానికి గురువులతో దారి పూజలు నిర్వహించుకున్న సంఘటనలు మారుమూల గిరిజన గ్రామాల్లో జరుగుతున్నాయి, గిరిజనుల్లో ఉన్న మూఢనమ్మకాలను మీద ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు

ప్రమాదం అంచున ప్రయాణం

ప్రమాదం అంచున ప్రయాణం



 గూడెం కోత్తవీధి పెన్ పవర్ 

ఏజెన్సీలో పరిమితికి  మించి జిప్పులు, ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకుని మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న అధికారులు పట్టించుకోవడం దాఖలాలు కనిపించడం లేదు, నిత్యం ఏదో ఒక చోట ఆటోలు, జీపులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోపోతున్నారు, సంబంధింత అధికారులు దృష్టి సారించడం లేదు, గూడెం కోత్తవీధి మండల కేంద్రం నుండి పరిసర ప్రాంతాల నుండి నిత్యం ప్రజల మండల కేంద్రానికి వచ్చే పోయే ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు, వారపు సంతలకు గిరిజనులు, మైదానం ప్రాంతాల నుండి వ్యాపార నిమిత్తం ఆటో, జిప్పు వాళ్లకు పరిస్థితి ముడు పూలు ఆరు కాయలుగా అన్న చందంగా ఉంది, ఆటో, జిప్ లలో రెండు నుండి మూడు రెట్లు అధికంగా ప్రయాణికులకు ఎక్కుంచుకుని మితిమీరిన వేగంతో ప్రజలకు మండల కేంద్రం నుండి ఆయా మారుమూల గిరిజన గ్రామాలకు తరలిస్తున్నారు, సీలేరు, దారకొండ, సప్పర్ల, పెదవలస, దేవరాపల్లి, లక్కవరపేట్ట, వంజులు, సిరిబాల, ఆర్ వి నగర్ గ్రామాలకు అధిక సంఖ్యలో జిప్ లు, ఆటో వాళ్లు ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు,అధిక సంఖ్యలో ప్రయాణికులకు తరలిస్తున్న నియంత్రించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు, దీంతో ఆటో, జిప్ ప్రమాదాల్లో నిరుపేదల గిరిజనుల ప్రాణాలు కోల్పోపోతున్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీని పై దృష్టి సారించి పరిమితికి మించి ఎక్కించుకునే ఆటోలు, జీపులు పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మంచి మనసున్నోడు ఊబా శ్రీకాంత్

 మంచి మనసున్నోడు ఊబా శ్రీకాంత్


తాళ్ళపూడి  పెన్ పవర్

తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామంలో కీ. శే. పూడి పుష్పావతి జ్ఞాపకార్థం ఆమె మేనల్లుడు ఊబా శ్రీకాంత్ మలకపల్లిలో గల ఎంపిపి స్పెషల్ స్కూల్ అభివృద్ధికి 5 సీలింగ్ ఫ్యాన్ లు, పెద్ద బీరువా బహుకరించారు. అంతేకాకుండా 100 మంది నిరుపేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. లబ్దిపొందిన పేదలు శ్రీకాంత్ కు దీవెనలు అందించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు గ్రామస్థులు కొనియాడారు.

మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన పలువురు సర్పంచులు

 మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన పలువురు సర్పంచులు 



పెన్ పవర్ సత్యవేడు 

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినీ చిత్తూరు జిల్లా సత్యవేడు మండలానికి సంబంధించిన పలువురు సర్పంచులు బుధవారం కలిశారు .రాష్ట్ర వైయస్సార్సీపి జాయింట్ సెక్రటరీ ఏవియమ్ బాలాజీ రెడ్డి ఆధ్వర్యంలో  దాసుకుప్పం పంచాయతీ సర్పంచ్ రవిరెడ్డి ,అల్లపుగుంట సర్పంచ్ మునస్వామి ,మదనంబేడు సర్పంచ్ శివరంజని వెంకటేశులు ,గన్నవరం సర్పంచ్ జయంతి గురునాధం ,అంబాకం సర్పంచ్ సంగీతకనకరాజు ,మదనంజెరి పంచాయతీ సర్పంచ్ బాలాజీ తదితరులు తిరుపతిలో మంత్రి స్వగృహంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినీ కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు . రెండు రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి మద్దతు దారులుగా ప్రత్యర్థులను చిత్తు చేసి విజయకేతనం ఎగరవేసి సర్పంచులుగా ఎన్నికైన నేపద్యంలో వీరందరూ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినీ కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు .ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆయా పంచాయతీల్లో గ్రామీణ సమస్యలపై సర్పంచ్లు దృష్టి సారించాలన్నారు .ముఖ్యంగా తాగునీటి వసతులు మెరుగుపరచడం , వీధి దీపాలు ,ఆరోగ్యం పై దృష్టి పెట్టాలన్నారు . ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సచివాలయాల ద్వారా వాటిని పూర్తి చేయించే బాధ్యత  సర్పంచ్పై ఉన్నట్టు గుర్తు చేశారు . అభివృద్ధిపై దృష్టి సారించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే ఈ సందర్భంగా ఆయన సూచించారు .గ్రామాభివృద్ధికి నిధులు కొరత లేదన్నారు .అధికారులతో కలసి అభివృద్ధిలో లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...