Followers

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి....కొవ్వూరు డిఎస్పి శ్రీనాథ్

 మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి....కొవ్వూరు డిఎస్పి శ్రీనాథ్


పెన్ పవర్,తాడేపల్లిగూడెం

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పలువురు వక్తలు ఉద్బోధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణం లోని వివిధ ప్రాంతాల్లో మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.  తాడేపల్లిగూడెం పట్టణం మరియు రూరల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినఅంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో కొవ్వూరు డి.ఎస్.పి. బండారు శ్రీనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా మహిళల రక్షణ కోసం దిశా చట్టం తీసుకు వచ్చిందని అన్నారు. అంతేకాకుండా ఎస్ ఓ ఎస్  యాప్ ద్వారా ఆపదలో ఉన్న వారికి సహకరించే విధంగా యాప్ ని రూపొందించారని తెలిపారు.  విద్యాభివృద్ధికి కృషి కోసం అమ్మ ఒడి, మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత వంటి పథకాలను తీసుకు వచ్చిందని తెలిపారు.



 మహిళా పోలీసులకు,  మహిళా సంరక్షణ కార్యదర్శులకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సుజాత, తాడేపల్లిగూడెం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సృజన, దేరా కౌన్సిలింగ్ నెంబర్ మల్లిపూడి కనకదుర్గాదేవిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు, తదితరులు పాల్గొన్నారు.

మహిళలే మహా రాణులు

 మహిళలే మహా రాణులు

పెద్దాపురం, పెన్ పవర్

 మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికి చాటుకోవడమే కాకుండా పలు రంగాలను శాసించే స్థాయికి చేరుకున్నారని పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నవసేన గోరింట సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గోరింట గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బ్లురే హాస్పిటల్స్ (కాకినాడ) కు చెందిన వైద్య బృందం రక్త, వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు ఒకవైపు తమ కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతూనే మరొక వైపు ఉద్యోగ, వ్యాపారాలు చేస్తూ తమ శక్తిని నిరూపించుకుంటున్నారని అన్నారు. 



మనమందరం భారతమాత ముద్దుబిడ్డలమని, ప్రపంచంలో ఏ ఒక్క దేశాన్ని కూడా స్త్రీతో పోల్చి చెప్పరని, మనదేశంలో మాత్రమే భారతమాత అని పిలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బ్లురే హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి, సోము ప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ కుమార్, పెద్దాపురం సిఐ వి. జయకుమార్, ఎస్ఐ ఏ. బాలాజీ, నవసేన గోరింట గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఏఓ జి.రుచిత ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం

 ఏఓ జి.రుచిత ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం


తాళ్ళపూడి, పెన్ పవర్

  సోమవారం నాడు తాళ్ళపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి సౌజన్యంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మహిళా రైతులకు తాళ్ళపూడి మండల వ్యవసాయ అధికారిని జి.రుచిత ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫామింగ్, కిచెన్ గార్డెనింగ్ గురించి మహిళా రైతులకు అవగాహన కల్పించి, ముగ్గురు మహిళా రైతులను సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు, మండల వ్యవసాయ సలహా కమిటీ అధ్యక్షులు వల్లభనేని శ్రీహరి, గ్రామ పెద్దలు మరియు వైసిపి నాయకులు శీర్ల  బ్రహ్మానందం, సచివాలయ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మోతుగూడెంలో సీఆర్పీఎఫ్ వారి సివిక్స్ ప్రోగ్రాం

 మోతుగూడెంలో సీఆర్పీఎఫ్ వారి సివిక్స్ ప్రోగ్రాం 

మోతుగూడెం,పెన్ పవర్

మోతుగూడెం గ్రామంలో సిఆర్పిఎఫ్ జి42 బెటలియన్ వారు కల్చరల్ ఆక్టివిటీస్ ప్రోగ్రాం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలు పాల్గొన్నారు వారికి సెకండ్ కమాండెంట్ జి చింతల్ కుమార్ చేతుల మీదుగా నగదు బహుమతి అందించారు, అనంతరం సివిక్స్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు, ఈ కార్యక్రమానికి ఫోర్ బై క్యాంప్ ,ఈంతులూరు వాగు ,ఒడియా క్యాంపు, ఎం సి డి క్యాంప్ మరియు మల్లారం గ్రామాల ప్రజలు పాల్గోన్నారు వారికి రగ్గులు, చార్జింగ్ లైట్స్,గునపాలు మరియు పారలు పంచడం జరిగింది వచ్చిన వాళ్లందరికీ భోజనాలు సుమారు 600 మందికిఏర్పాటు చేశారు ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమాండెంట్ జి చింతల్ కుమార్ , ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ ఎం గౌరీపతి ,మోతుగూడెం గ్రామ సర్పంచ్ ఆకెటి సీత, చింతూరు సిఐ యువకుమార్ ,మోతుగూడెం ఎస్సై వి సత్తిబాబు పంచాయతీ సెక్రెటరీ జ్యోతి, ఎం పి యు పి హెడ్మాస్టర్ మీనా కబ్బా రావు ,డి ఏవి హెడ్ మాస్టర్ ఎం జి ఎస్ నాయుడు సిఆర్పిఎఫ్ జి 42 బెటలియన్ మరియు సివిల్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బౌర్తి ఉపధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఐటీడీఏ పి.ఓ...

 బౌర్తి  ఉపధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఐటీడీఏ పి.ఓ...



చింతపల్లి, పెన్ పవర్

మండలంలోని చౌడుపల్లి పంచాయతీ బౌర్తి ప్రభుత్వ గిరిజన సంక్షేమ  ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుల్లెల సత్యరాజును ఐ టీడీఏ  ప్రోజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల  సస్పెండ్ చేశారు. సోమవారం మండలం పర్యటనలో బాగంగా బౌర్తి పాఠశాలను తనిఖీ చేశారు. మనబడి  నాడు నేడు పనుకు తనిఖీ చేశారు.మనబడి నాడు పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఉపాధ్యాయుడు రూ.5వేలు వేతనం ఇచ్చి  వాలంటీర్ ను నియమించి ఆయన విధులకు గైరు హాజరయ్యారు. 5వతరగతి విద్యార్థులు కనీసం  అ, ఆ,లు చెప్పలేకపోతున్నారని విద్యా ప్రమాణాలు పై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఉపాధ్యాయుడు  పాఠశాలకు వస్తున్నది లేనిది గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.మధ్యాహ్నం భోజనం పై ఆరాతీశారు.పిల్లలకు యూనిఫామ్ కట్టించాలని తలిదండ్రులకు సూచించారు.

గవ్వలమామిడి లో త్రాగునీరు సమస్య

 గవ్వలమామిడి లో త్రాగునీరు సమస్య



పరిష్కారం చేయాలి-సీపీఎం డిమాండ్

హుకుంపేట - పెన్ పవర్..

  మండలంలోని గన్నేరుపుట్టు పంచాయితి "గవ్వలమామిడి లో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొంది.ఈ  సమస్య పై చీకుమద్దుల ఎంపీటీసీ సీపీఎం పార్టీ అభ్యర్థి సుడిపల్లి కొండలరావు గ్రామస్థుల తో సమావేశమై పొలాల వద్ద ఉన్న ఊట నీటి కుండీ వద్ద మహిళలు నీటిని సేకరిస్తున్న ప్రాంతాం లో గ్రామస్థులు ,మహిళలు తో కలిసి పరిశీలించారు.అనంతరం గవ్వలమామిడి గ్రామంలో 55 కుటుంబాలు,260.జనాభా కలిగిన గ్రామం లో సరైన నీటి సౌకర్యం లేక ప్రజలు కలుషిత నీటిని సేవిస్తున్నారని ,ఆ నీళ్లు త్రాగితే రోగాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.సచివాలయం అధికారులు, ఎంపీడీఓ ,పాడేరు ఐటీడీఏ పీ ఓ గారు స్పందించి గవ్వలమామిడి గ్రామంలో కరెంట్/విద్యుత్ మోటార్ ద్వారా  శాశ్వత మంచినీటి పధకం,మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గవ్వలమామిడి 6 వ వార్డు మెంబర్ పాడి శైలు, మాజీ వైస్ సర్పంచ్ బి రాజారావు, పి బోడన్న,జంగిడి నూకన్మ,బాడ్నైని సుందర్ రావు,బాడ్నైని లక్ష్మణ్ రావు,పాడి ఆనంద్, రాజారావు, జంగిడి రాజారావు,జంగిడి గణేష్,హరీష్, మహిళలు అప్పలమ్మ,కొండమ్మ,రాజులమ్మ,కుజ్జమ్మ,సోములమ్మ,కుమారి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గిరిజనులను హతమార్చడమే మావోయిస్టుల సిద్ధాంతమా

 గిరిజనులను హతమార్చడమే మావోయిస్టుల సిద్ధాంతమా? 

జీకేవీధిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ

గూడెం కోత్తవీధి, పెన్ పవర్




ఇంపార్మన్ల పేరుతో గిరిజనులను హతమార్చడమే మావోయిస్టుల సిద్ధాంతమా ..? మావోయిస్టులు చేసే  విధ్యంసాలు,హత్యలతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి  కావాలని గిరిజనులు నినదించారు.విశాఖ మన్యం లోని జీకేవీధిమండలం  కొత్తపాలెంలో ఇంపార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చిన కొర్ర పిల్కు కుటుంబీకులతో కలిసి గిరిజనులు, విద్యార్థిని,విద్యార్థులు భారీ సంఖ్యలో ఆదివారం జికేవీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు.జికేవీధి మండల కేంద్రం నుంచి గూడెంకొలని వరకు మావోయిస్టు లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మారుమూల గ్రామాలకు రోడ్లు,పాఠశాలలు, సెల్ టవర్లు,వైద్యం వంటి మౌలిక సదుపాయాల కావాలని అడిగితే ఇంపార్మర్ ముద్రవేసి గిరిజనులను మావోయిస్టులు హతమార్చుతున్నారని ఆరోపించారు. వారి హత్యలకు నిరసిస్తూ మావోయిస్టు దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు.గిరిజనుల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టులు వారినే హతమార్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...