ప్రధాని పిలుపు మేరకు 21 రోజుల స్వీయ నిర్బంధాన్ని విధించుకున్న ఎన్టీపీసీ
పరవాడ, పెన్ పవర్
దేశంలో రాష్టం లో కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాపితి చెందుతున్న తరుణంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సింహాద్రి ఎన్టీపీసీ ఉద్యోగులు స్వీయ నిర్బంధనను విధించుకుంటున్నట్లు ఎన్టీపీసీ సిజిఎం వి సుదర్శన్ బాబు తెలియ చేసారు.బుధవారం నాడు ఎన్టీపీసీ అధికారుల సమావేశంలో చర్చిoచి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుదర్శన్ బాబు తెలిపారు.రేపటి నుంచి దీపాంజలి నగర్ గేట్లు,ప్లాంట్ యొక్క గేట్లు బయటివారు ఎవ్వరూ రాకుండా మూసివేస్తాము అని అన్నారు.లోపల వున్న ఎంప్లాయిస్ కూడా ప్లాంట్ లోకి తప్పించి బయటికి వెళ్లకూడదు అని నిర్ధేశించారు.కాంట్రాక్ట్ లేబర్ని 50% శాతం మందిని విధులకు రాకుండా విరామం ఇచ్చారు.ఎక్కువ శాతం మందికి ఉద్యోగులకు ఇంటినుంచే విధులు నిర్వహించే సదుపాయం చేశామన్నారు.సీజీఎం సుదర్శన్ బాబు ప్లాంట్ లో విద్యుత్ వుత్పత్తికి సరిపోయే బొగ్గు నిల్వలు వున్నాయి అని తెలియ చేసారు.దీపాంజలి నగర్ లో నివాసముండే ఉద్యోగులకు సరిపడినన్ని నిత్యావసర సరుకులను నిల్వ చేసినట్లు సుదర్శన్ బాబు చెప్పారు.ఉద్యోగులకు తాగునీరు,నిరంతర విద్యుత్ సరఫరా కి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఎన్టీపీసీ అన్నిరకముల జాగ్రత్తలు,సదుపాయాలను ఏర్పాటు చేసింది అని తెలియచేసారు.
No comments:
Post a Comment