ఫార్మా యాజమాన్యాలు ఉద్యోగుల
పరవాడ, పెన్ పవర్
మండలం లోని జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీలో ని కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు కరోనా వ్యాధి సోకకుండా వారిని కాపాడు కొనుటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని మండల తెలుగుదేశం నాయకులు వర్రి పరదేశి నాయుడు డిమాండ్ చేసారు.ఫార్మా ఉద్యోగులకు కరోనా సోకితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని ప్రశించారు.దేశ వ్యాప్తంగా లాక్ డవున్ పాటిస్తుంటే ఫార్మా పరిశ్రమలు యధావిధిగా పనిచేస్తున్నాయి అని ఆరోపించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా పరిశ్రమల పనిచేయడం ఎంతో ఆవశ్యకత ఉన్నపటికీ జవహర్ లాల్ ఫార్మాసిటీ అనుకోని వున్న గ్రామాల ప్రజల ఆందోళన మరో విధంగా వుంది అని నాయుడు అన్నారు.ఫార్మాసిటీ కంపెనీల ఉద్యోగులు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటే వారిలో ఎవరికన్నా కరోనా వైరస్ సోకితే తమపరిస్థితి ఏంటి అని తాడి,తాణం గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని పరదేశి నాయుడు ఆందోళన తెలియ చేసారు.ఫార్మా కంపేనిలను మూసేయమని చెప్పడంలేదుకానీ పరిమితి అయిన ఉద్యోగులతో వారికి వైరస్ సోకకుండా తగిన భద్రతా సామాగ్రి వారికీ ధరించి వారితో విధులు నిర్వహించుకోవాలి అని డిమాండ్ చేసారు.ఫార్మా కంపెనీలు కార్మికుల శ్రమను దోచుకునే విషయంలో అగ్రస్థానంలో వుంటున్నాయికానీ వారి ఆరోగ్యవిషయములో ఈసమంత జాగ్రత్త లు పాటించడం లేదు అని ఆరోపించారు.కార్మికులకు మాస్కులు,చుట్టు పక్కల పరిసరాలలో శానిటేషన్ చేసే భాద్యత కంపెనీలదే అని కానీ ఎక్కడా శానిటేషన్ చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు అని ఆరోపించారు.తాడి,తాణం గ్రామ ప్రజలు బయటికి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలి అన్నా ఫర్మాసిటీ లోంచి వెళ్ళవలసి వస్తున్న కారణముగా అక్కడ ఎటువంటి శానిటేషన్ చేయని పరిస్థితులు చూసి ప్రజలు కరోనా వైరస్ సోకుంది అనే భయంతో హడలి పోతున్నారు అని అన్నారు.ఇప్పటికి అయినా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్,పరిశ్రమల శాఖ అధికారులు పట్టించుకుని ఫార్మా కంపెనీల పై నియంత్రణ ఉంచి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అని కోరారు.
No comments:
Post a Comment