అనకాపల్లి లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
-మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్
అనకాపల్లి, పెన్ పవర్
రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి రూరల్ ప్రాంతాన్ని కరోనా కేసులలో హైరిస్క్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో అనకాపల్లి పట్టణంలో 100 పడకల సామర్ధ్యం గల క్వారం టైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ను మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ కోరారు . నిత్యావసర వస్తువుల ను అధిక ధరలకు అమ్ముతున్నా వ్యాపారస్తులు పై చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం ఆయన ప్రెస్ నోట్ విడుదుల చేశారు. అనకాపల్లి రూరల్ ప్రాంతంలో 150 మందికి పైగా ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారని,వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. గ్రామాలలో పారిశుధ్యం పై దృష్టి సారించాలని,ప్రజలకు కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలును విరరించాలని అన్నారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ పరిధిలో కొత్తగా 2తాత్కాలిక "రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రజలకు మాస్కులను, సానిటైజేషన్ కిట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. కరోనా నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment