Followers

లాక్ డౌన్ పాటించండి, కారోనా ను తరిమి కొట్టండి


ఎంవిపి కాలనీ, పెన్ పవర్


 నగరంలో బిజెపి నాయకులు   ఎంవీపీ రైతుబజార్ లో రైతులకు,రిక్షా కార్మికుల కు, స్టాల్ల్స్ లో అమ్మకం దార్లకు కారోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు,  ఈ కార్యక్రమంలో విశాఖ నగర బీజేపీ నాయకురాలు ద్వారాపురెడ్డి అరుణకుమారి మాట్లాడుతూ  ప్రజలందరూ తమకుతాము స్వీయ నియంత్రణ పాటించాలని,  బయటకు ఎవరు రావొద్దని, దేశం మొత్తం ఒక్క తాటిపైకి రావలసిన సమయం వచ్చిందని అన్నారు. మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ  ఐచ్చిన "జనతా కర్ఫ్యూ"  పిలుపుకు  ప్రజలందరూ ఎంత బాధ్యత గా  స్పందించారో... అదే విధంగా లాక్ డౌన్ కు   సహకరించి  స్వచ్చందంగా  డిస్టన్సింగ్ పాటిస్తూ ఈ 31 వరకు  ఎవరి ఇంటిలో వారు ఉంటూ.. కారోనా మహమ్మరిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం  బీజేపీ నాయకురాలు ద్వారాపురెడ్డి అరుణకుమారి    ఆధ్వర్యంలో నోవల్ కరోన వైరస్ కోవిడ్-19 మీద. అవగాహనా కలిగిస్తూ ఉచితం గా మాస్క్ లు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో బీజేపీ నగర కార్యదర్శి కలిగొట్ల సుబ్రహ్మణ్యం,  బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...