సమావేశాలు,జాతరులకు అనుమతులు లేవు : ఎసై విభీషణరావు
పాయకరావుపేట,పెన్ పవర్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ నిభందనలు ప్రజలు పాటించి సహకరించాలని స్థానిక పోలీసు అదికారులు కోరుతున్నారు.ఈమేరకు వారు ఆదివారం పత్రిక ప్రకటను విడుదల చేసారు.ప్రభుత్వం జిల్లాను లాక్ డౌన్ గా ప్రకటించిన కారణంగా ప్రజలు ఇళ్ళకే పరిమితమవ్వాలి.రోడ్లపై ,దుకాణాల వద్ద గుమ్ముగూడి వుండరాదు.నిత్యవసర సరుకులను కొనుగోలు చేసి త్వరతగతిన గృహానికి చేరువాలన్నారు.మండలంలో ఎటువంటి సమావేశాలను నిర్వహించరాదు.పట్టణంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఆనవాయితిగా వస్తున్న ఉగాధి రోజున జరుపుకునే నూకాలమ్మ జాతర,చిలకల తీర్ఠంను కరోనా ప్రభావం దృష్ట్యా అనుమతులు ఇయ్యబడలేదు.కనుక ప్రజలు గమనించగలరని కోరుతున్నామని ఎసై .విభీషణరావు తెలియజేసారు.కరోనాపై అవగాహన కలిగివుండి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తి ప్రభావం ను కొంత వరకూ తగ్గించగలము.ఈమేరకు మండలంలో పలు గ్రామాల్లో కోవిడ్ —19పై ప్రజలకు అవగాహన కార్యక్రమంలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment