Followers

కరోనా వైరస్ పై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది


 


స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం( పెన్ పవర్) కరోనా వైరస్ పై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని  ప్రజలు  మాత్రం ఆందోళన చెందనవసరం లేదని  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన పద్మనాభం పీహెచ్ చిన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ    కరోనా  కేసులపై  వస్తున్న వదంతులను నమ్మొద్దని  హితవు  పలికారు. కరోనా వైరస్  కేసులు నమోదైతే వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడిస్తారని వాటిని నమ్మాలి తప్ప వచ్చే ఫేక్ వార్తలను ప్రజలు నమ్మి ఆందోళన చెందవద్దని  తెలిపారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పరిసరాల శుభ్రత పాటించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.  అనుమానితులను  ఐసొలేషన్  వార్డుల్లో  తరలించాలని  సెల్ఫ్  క్వారాంటైన్స్  పాటించాలని  భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని అనుమానితులు వస్తే వారికి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. లండన్ లో ఉన్నత చదువులు చేస్తూ పద్మ నాబ మండలం  రేవడి గ్రామానికి తిరిగి వచ్చిన  యువకునిపై  కరోనా అనుమానిత  కేసు నమోదు  అయిన విషయం తెలుసుకొని తక్షణమే  పరీక్షల నిమిత్తం తరలించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.  కరోనా వైరస్  లక్షణాలు గుర్తించడానికి  ప్రతి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో  ప్రత్యేక సెల్  ఏర్పాటు జరిగిందన్నారు. సిబ్బంది అందుబాటులో ఉండి  అనుమానితులను పరీక్షలు చేస్తున్నారన్నారు నుంచి వచ్చిన వారి పరిసరాల్లో తనిఖీలు జరుగుతాయన్నారు. జిల్లాలో వైద్యాధికారులు అప్రమత్తంగా  ఉంటూ సిబ్బందిని చైతన్యం చేయాలని మంత్రి కోరారు. విదేశాలనుండి వస్తున్న వారిని ఎయిర్పోర్ట్ నుంచే వైద్య పరీక్షలకు తరలించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్యలు ముమ్మరం చేశారు అన్నారు. ప్రజలు వైద్యుల సూచనలు సలహాలు పాటించాలని మంత్రి కోరారు.


 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...