Followers

ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఐసోలేషన్ ఆసుపత్రి


ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఐసోలేషన్ ఆసుపత్రి  


అనకాపల్లి ఆర్డిఓ  సీతారామారావు


వి మాడుగుల, పెన్ పవర్ 


కరోనా  రోగుల  వైద్య పరీక్షలకు  అనుకూలంగా  ప్రతి నియోజకవర్గంలో  వంద పడకల  ఐసొలేషన్  వార్డును  ఏర్పాటు చేస్తున్నామని  అనకాపల్లి  రెవెన్యూ డివిజనల్ అధికారి  సీతారామారావు  అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మాడుగుల లో వంద పడకల  బెడ్స్  ఏర్పాటుకు  అవసరమైన  భవనాన్ని  పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్  బాలికల హై స్కూల్ వద్ద  ఇటీవల నిర్మించిన బాలికల వసతి గృహాన్ని  ఆయన పరిశీలించారు. ఆ భవనంలో  75 బెడ్లు  మాత్రమే  ఏర్పాటు చేసే అవకాశం ఉందని  తెలిపారు. మిగిలిన  25   బెడ్లుని   స్థానిక  సి హెచ్ సి లో  లేక  ఆర్ సి ఎం లో  ఏర్పాటు చేస్తామని  ఆయన తెలిపారు. కరోనా  మహమ్మారి  కారణంగా  రోగుల సంఖ్య  పెరిగే అవకాశం ఉన్నందున  అత్యవసర పరిస్థితుల్లో  వైద్య పరీక్షల నిమిత్తం  అందుబాటులో   ఐసోలేషన్  వార్డులను  సమకూర్చాలని అవసరం ఉందని  తెలిపారు. ఈ మేరకు  జిల్లా కలెక్టర్  వినయ్ చంద్  టెలి కాన్ఫరెన్స్ లో  ఆదేశాలు జారీ చేశారని  ఈ మేరకు  అన్ని నియోజకవర్గాల్లో  వంద పడకల  ఐసోలేషన్  వార్డులో  ఏర్పాటుకు  చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  తహసిల్దార్  రామశేషు  ఎంపీడీవో  పోలినాయుడు  ఎస్ ఐ  రామారావు  పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...