Followers

పరవాడ లో 144 సెక్షన్ అమలు 


పరవాడ లో 144 సెక్షన్ అమలు


సి ఐ రఘువీర్ విష్ణు


పరవాడ, పెన్ పవర్



 

పరవాడ మండలంలో కరోనా వ్యాధి కారణంగా 144  సెక్షన్ అమలు లో ఉన్నందున ప్రజలు ఎవరు రోడ్ల మీదకు అవసరం లేకుండా రాకూడదు అని సి ఐ రఘువీర్ విష్ణు హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లిలు,పేరంటాలు,ఊరేగిoపులు,ప్రజలు అధికంగా కూటమి చెందే ఎటువంటి శుభకార్యం అయినా సమావేశాలు లాంటి కార్యక్రమాలను నిషేధించడం విధించడం అయినది అని తెలియ చేశారు.ప్రతి వక్కరు వ్యక్తిగత ఆరోగ్య భద్రతతో సమాజం పట్ల భాద్యత తో ప్రతివక్కరు నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది అని అన్నారు.ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్లమీద సంచరించడం వలన మీ ఆరోగ్యం తో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మీ చుట్టుపక్కలవారి ప్రాణాలకు మీరు హాని చేసినవారు అవుతారు అని హెచ్చరించారు.కూరగాయలు,పాలు,నిత్యావసర సరుకుల వాహనాలను,ఫార్మాసిటీ ఎంప్లాయిస్ వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుంది అని అన్నారు.చికెన్,మటన్ షాపుల దగ్గర జనాలు గుమికూడటం జరుగుతున్న కారణంగా ప్రజా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అన్ని షాపులు బంధు చేయవలిసిందిగా విజ్ఞప్తి చేసారు.ప్రజలు ఎవరు అయినా అనవసరంగా తిరిగినా యువకులు ఆకతాయి తనంగా రోడ్ల మీద సంచరించినా వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.144 ఫోర్ సెక్షన్ విధించడం వలన కర్ఫ్యూ లాంటి వాతావరణం లా ఈనెల 31 వరకు ఉంటుంది అని అన్నారు.విదేశాలనుండి ఎవరు వచ్చినా స్థానిక పోలీసు వారికి,ఆరోగ్య శాఖ అధికారుల కు,రెవెన్యూశాఖ వారికి కాని తప్పనిసరిగా వ్యక్తి గత బాధ్యతతో తెలియ చేయాలి అని అన్నారు.ఎవరు అయినా జలుబు,దగ్గు,జ్వరం లాంటి వున్నప్పుడు మాములు సీజన్ మార్ప్ అనారోగ్యం అని ఆశ్రద్ద చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ లు చేయించు కోవాలో అని సూచించారు.కరోనాని మనదేశం నుండి తరిమికొట్టడం లో ప్రజలు అందరూ సమిష్టిగా కృషి చేయాలి అని విన్నవించారు.ఈ విషయం లో ఎవరు అయినా భాధ్యతారహితంగా వ్యహరించి ఈ వ్యాధి వ్యాప్తికి కారకులు అయిన వారిని కఠినంగా శిక్షార్హులు అని హెచ్చరించారు. ఎవరు అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించి వ్యాధి వ్యాప్తికి కారకులు అయితే సెక్షన్ 269,270 లు విధించి వారిని శిక్షించడం అవుతుంది అన్నారు.ఎవరు అయినా ప్రభుత్వం విధించిన 144 సెక్షన్ వ్యతిరేకించి బాధ్యతా రాహిత్యం గా వ్యవహరిస్తే సెక్షన్ 271 ద్వారా 6 నెలలు జైలుశిక్ష కు శిక్షార్హులు అని తెలియ చేశారు.ప్రజలంతా సహృదయం తో సహకరించాలి అని  రఘువీర్ విష్ణు కోరారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...