Followers

స్వీయ నిర్బంధం లోకి పలు గ్రామాలు




 


పరవాడ మండలం లో స్వీయ నిర్బంధం లోకి పలు గ్రామాలు                                                 


వాలంటీర్ల పేరుతో అత్యుతాహం ప్రదర్శితున్న చోటా నాయకులు         


 పరవాడ, పెన్ పవర్                                                         


 


ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్ వ్యాధి భారిన పడకుండా తమని తాము కాపాడుకొనుటకు మండలం లోని పరవాడ,తాణాo,భరిణికం,ఈ బోనంగి ఇలా పలు గ్రామాల ప్రజలు,నాయకులు కలిసి తమ గ్రామ పొలిమేరలను మూసివేసి స్వీయ నిర్బంధనం చేసుకున్నారు.స్వీయ నిర్బంధనం ఒక్కటే కరోనాని అరికట్టే విరుగుడు మంత్రం అని దేశ ప్రధాని,రాష్టాల ముఖ్యమంత్రులు చేతులెత్తి దణ్ణం పెడుతుంటే ప్రజలు కొందరు పెడచెవిన పెడుతుండటం ఎంతో విచారకరం.రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న కరోనా భాదితుల సంఖ్య చూస్తుంటే రాబోయే రోజుల్లో దేశంలోని ప్రజలు ఎంతటి దుర్దశలను ఎదుర్కొవలసి వస్తుందో అని సర్వత్రా చర్చలు జరుగుతూనే వున్నాయి.ప్రజల నిర్లక్ష్యం వలన ఇలా రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూసి ప్రజా ఆరోగ్య శాఖ కరోనాకి 20 కోట్ల మంది ప్రజలు మృత్యువాత పడే అవకాశం వుంది అని అంచనాలు వేస్తున్నారు.ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులకు, కూరగాయలకు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చింది కదా అని ప్రతిరోజు వాటిపేరుతో బయట సంచరించేవాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతోంది. ప్రతి ఓక్కరు వ్యక్తిగత బాధ్యతతో నెలకి సరిపడా సరుకులు నిల్వ చేసికుని ఇంటి నుంచి   బయటకు రాకుండా వున్నరోజు కరోనా ని కట్టడి చేసే రోజు అతిదగ్గరలో వుటుంది అని సర్వత్రా జరుగుతున్న చర్చ. ప్రజలు అలా చేయకుండా వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ప్రభుత్వాలు ఇప్పుడు వున్న నిత్యావసర సరుకుల వెసులుబాటును కూడా తీసి వేసి నెల రోజులపాటు మిలట్రీ వారి అధీనంలో కర్ఫ్యూ విధించే అవకాశాలు ఎక్కువగావున్నాయి అనే చర్చ కొందరి ప్రజల్లో జరుగుతోంది. కరోనా అనేది విదేశాలనుంచి వచ్చిన వ్యక్తులవలన మనదేశం లోకి వచ్చింది కావున విదేశాలనుచి వచ్చిన 70 మంది ని పరవాడ మండలంలో వారి వారి స్వగృహాల్లో ఉంచి ఆరోగ్యశాఖ సిబ్భంది వారి ఆరోగ్య పరిస్థులను నిశితంగా పరిశీలిస్తున్నారు. 


ఇక వివిద మండలాల వారీగా చూసుకుంటే కొన్ని గ్రామాలు స్వచ్చంధం గా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు....                                                                                                                                       


పరవాడ                                                                               


మండల కేంద్రంలో 144 సెక్షన్ విధించిన విషయం విదితమే కానీ స్థానిక యువకులు 144 సెక్షన్ బయటివారికే కానీ తమకు కాదు అన్నట్లు వ్యవహరించిన తీరు శోచనీయం ప్రస్తుత పరిస్థితులు ల వలన గ్రామ శ్రేయస్సు కోసం వాలంటీర్లగా పనిచేస్తున్నాము అని చెప్పి చోటా నాయకులు రహదారిని కర్రలతో ఆటోలతో మూసివేసి అత్యవసర విధులకు వెళ్ళేవాళ్ళని అడ్డగిస్తే దారి వదలమన్న వాహనదారులతో పత్రికా విలేఖరి తో దురుసుగా ప్రవర్తించిన ప్రవర్తించిన తీరు పై సర్వత్రా విమర్శలు ఎదుర్కుకున్నారు.                                                                                                                                        తాణాం                                                                      


గ్రామంలో కరోనా మహమ్మారి రాకుండా కన్నూరి రమణ కన్నూరి యువసేన అద్వర్యం లో గ్రామానికి వున్న నలువైపులా రహదారులను కర్రలతోను,ఇనప రాడ్ల తోను ఎవరు గ్రామంలోకి  గ్రామంలోంచి బయటకి పోకుండా మూసివేశారు.ఫార్మాసిటీ అనుకోని ఉండటం వలన బయట గ్రామాలనుంచి తాణం మీదగా ఫార్మా సిటీకి ఉద్యోగ నిమిత్తం వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో గ్రామాన్ని కరోనా నుంచి రక్షించుకోవడానికి రహదారులు మూసివేస్తున్నాము అని రమణ అన్నారు.పాలకేద్రం నుంచి పాలు సేకరించే వాహనాన్ని కూడా అనుమతించక పోవడం శోచనీయం.                                                                                                                           


ఈ బోనంగి                                                                                 


స్థానిక గౌతులచ్చన కూడలిలో మాజీ సర్పంచ్ టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి అట్టాసన్యాసి  అప్పారావు,మాజీ ఉపసర్పంచ్ బుగిడి రామగోవిందరావు ఆధ్వర్యంలో గ్రామస్థులకు కరోనా వైరస్ రాకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తల గురించి కొన్ని సూచనలు చెప్పారు.గ్రామాల్లోకి ఎవరైనా విదేశాల నుంచి కానీ వేరే రాష్టాల నుంచి కానీ ఎవరన్నవస్తే స్థానిక ఆరోగ్య సిబ్భంధికి కానీ వాలంటీర్లకు కాని ఎమ్మార్వో ఆఫీసు సిబ్బందికి కానీ పొలిసు సిబ్బందికి కానీ వెంటనే తెలియచేయండి తెలియచేసారు.స్థానికులు పరిసరాల శుభ్రత వ్యక్తిగత శుభ్రత పాటించి కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలి అని కోరారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...