Followers

ఇలా అయితే  కరోనా కట్టడి కష్టమే 


ఇలా అయితే కరోనా కట్టడి కష్టమే 


- ప్రజలు, ప్రభుత్వ విధానాల్లో లోపం 

- సీరియస్నెస్ లోపిస్తున్న  లాక్ డౌన్ 

- పోలీసులకు తలనొప్పిగా నిలుస్తున్న వైనం 

- ఇలా అయితే లాక్డౌన్ కాల పరిమితి పెరిగే అవకాశాలు 

 

అనకాపల్లి , పెన్ పవర్ 

 

కరోనా కట్టడిలో ప్రజా సంక్షేమ కోసం ప్రభుత్వం తలపెట్టిన లాక్ డౌన్  లక్ష్యాన్ని అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో గుమిగూడుతున్న జనంతో  ఇది తేటతెల్లమవుతుంది. ఇదే కొనసాగితే మళ్లీ లాక్డౌన్  కాల పరిమితి పెరిగే అవకాశాలును కొట్టి పారేయలేమన్న భావన వినిపిస్తోంది. ఎవరికి వారు స్వీయ నియంత్రణతో పాటు జాగ్రత్తలు వహించకపోతే కరోనా నివారణ కష్టంగా మారినా ఆశ్చర్యం లేదు.  నిజానికి కరోనా  వ్యాధి నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బంది చర్యలు  తీసుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అధికారులతో తీసుకుంటున్న చర్యలు  ఒకెత్తైతే... ప్రధానముగా ప్రజలను ఇళ్లల్లోనే ఉండే విధంగా లాక్ డౌన్ విధానాన్ని  ప్రవేశ పెట్టారు. దీనిని పక్కాగా అమలు చేస్తే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులువే. అయితే ప్రజల జీవనానికి ఆటంకం లేకుండా నిత్యావసరాల సరుకుల కోసం ఇచ్చిన వెసులుబాటు  కరోనా కట్టడి లక్ష్యానికి ఆటంకంగా నిలిచెలా ఉంది.

       ఒకరి నుంచి మరొకరికి సోకే కరోనా మహమ్మారిని  నియంత్రించడం లొో భాగంగా జనం గుమికూడకూడదనెది లాక్డౌన్ ఉద్దేశ్యం. అయితే తెల్లారింది మొదలు కూరగాయల మార్కెట్లో  జనం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. దీంతో అనుకోని లక్షణాలు ఎవరికైనా ఉంటే అది మరొకరికి వ్యాపించినా ఆశ్చర్యం అక్కర్లేదు. వారు మరొకరికి మరొకరు ఇంకొకరికి ఇలా వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు.     దీనితో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇక్కడ లోపం లక్ష్యానికి ఆటంకంగా నిలిచే అవకాశం లేకపోలేదు. జనం గుమికూడకుండా నిత్యావసర సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని విశ్లేషకుల మాట. చాలా మంది ఇళ్లకే పరిమితమైనా కొందరు అనవసరంగా తిరుగుతున్న జనంతో  పోలీసులకు ఇటు ప్రజలకు తలనొప్పిగా నిలుస్తుంది.   సామాజిక దూరమే కరోనా వ్యాధి నివారణకు మార్గమన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రజలే స్వయంగా అనుసరించాల్సి ఉంది. అలా కాకపోతే లాక్ డౌన్ కాలపరిమితి మళ్లీ  పెరిగే అవకాశాలను కొట్టి పారేయలేం. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...