విశాఖపట్నం, పెన్ పవర్
కేంద్రం చేసే హెచ్చరికలను అందరూ పాటించాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా 3.75లక్షల మందికి కరోనా సోకిందన్న ఆయన ,ప్రస్తుతం వరకు దాదాపు 17వేల మంది చనిపోయారన్నారు.కరోనా వైరస్ వచ్చిన వారు బాధ్యతగా వ్యవహరించకపోతే .. మిగిలిన వారు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని సూచించారు. మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం గుర్తుచేస్తూ ,ప్రజలంతా అంకితభావంతో మెలిగి కరోనా పై విజయం సాధించాలన్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలకు ఇబ్బందులు దరిచేరకుండా ,అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
No comments:
Post a Comment