Followers

కరోనా మహమ్మారి నివారణలో ప్రభుత్వం వైఫల్యం - ఎమ్మెల్సీ జగదీశ్

:


 







అనకాపల్లి , పెన్ పవర్ : ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్ పై  ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు . చైనాలో ఈ వ్యాధిని డిసెంబర్ నెల 2019 న గుర్తించడం జరిగింది ఆ దేశంలో సుమారుగా 5500 మంది చనిపోయినట్లుగా చైనా ప్రభుత్వం ప్రకటించిందనారు.సమీప దేశంలో జరుగుతున్న పరిణామాలపై భారత ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు తెలియజేసిన తర్వాత కూడా వైరస్ నిర్ధారణ పర్యటనలో లేకపోవడం విచారకరమనారు. జిల్లా వైద్యాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం వల్ల కరోనా వైరస్ ని విదేశాల నుండి వచ్చిన వారు గుర్తించడంలో విఫలం చెందడం వల్ల రాష్ట్రంలో ప్రజలకు అంటురోగంగా ప్రబలుతుందనారు. ఇప్పటికైనా ఎక్కడక్కడ ప్రజారోగ్యశాఖ వారు గ్రామాల్లో,పట్టణాల్లో,వీధుల్లో అన్ని స్వచ్ఛంద సంస్థల సమీకరించి విస్తృత ప్రచారం కల్పించి కరోనా  వైరస్ బారిన పడకుండా చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని  చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే విశాఖ జిల్లాలో ఆదివారం ఉదయం ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూ పిలుపుమేరకు 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇంటి వద్దే ఉండేవిధంగా ప్రజలు అందరూ సహకరించాలని  విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ పై ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటన చేయకుండా కేంద్రం జారీ చేసిన ప్రజారోగ్య శాఖ అధికారులు ప్రకటనలు పరిగణలోకి తీసుకొని ప్రజలందరూ వారి సూచనలు పాటిస్తూ వైరస్ నివారణకు అందరూ సహకరించాలనారు. మహమ్మారి బారినుండి  కాపాడుకుందామని అన్నారు. వైరస్ బాధితులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించి అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు . ఈ నెల 31 వరకు అందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వ పిలుపుమేరకు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు నగదు ఇచ్చి అదుకోవాలని కోరారు.





 

 


 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...