Followers

ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగం పెంచాలి


ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగం పెంచాలి


                                      జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్


విజయనగరం,పెన్ పవర్ 


 


:  ఉపాధి  హామీ నిధులతో పలు శాఖల సమన్వయం తో చేపడుతున్న  పనులను వేగంగా జరిగేలా  చూడాలని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ ఆదేశించారు.  శనివారం కలెక్టర్ తన  ఛాంబర్ లో  ఉపాధి హామీ పనులను  సమీక్షించారు.   ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న గ్రామ సచివాలయ భవనాలకు కొన్ని చోట్ల భూ సమస్య ఉన్నట్లు  పంచాయతీ రాజ్ ఎస్.ఈ.  కలెక్టర్ దృష్టికి తెచ్చారు.   కలెక్టర్ వెంటనే సంయుక్త కలెక్టర్  జి.సి. కోశోర్ కుమార్ కు ఫోన్ చేసి ఎక్కడెక్కడ భూమి సమస్య ఉందో  తనిఖీ చేసి వెంటనే పరిష్కరించాలని చెప్పారు.  జిల్లాలో ఉపాధి నిధులతో 655 గ్రామ సచివాలయ  భవనాలను  మంజూరు చేయగా 619 నిర్మాణాలు పురోగతి లో నున్నాయని తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ ద్వారా  1210 పాఠశాలల  ప్రహరీ నిర్మాణాలు మంజూరు కాగా పనులు పురోగతి లో నున్నాయన్నారు.     గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా 1075  సి సి డ్రైన్ లు మంజూరు కాగా 859 పనులు పురోగతిలో నున్నాయని, మిగిలిన శాఖల ద్వారా చేపడుతున్న  కన్వర్జెన్స్ పనులను కూడా  త్వరగా పూర్తి చేయాలని అన్నారు.  లాక్ డౌన్ కొనసాగుతున్నందున  ఈ పనులలో పాల్గొనే  ఇంజినీర్లకు  పాస్ లకు దరఖాస్తు చేస్తే జారీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశం లో  డుమా పి .డి. ఎ.నాగేశ్వర రావు,  వ్యవసాయ శాఖ  సంయుక్త సంచాలకులు యం . ఆశాదేవి, గ్రామీణ నీటి సరఫరా ఎస్.ఈ.  పప్పు రవి తదితరులు పాల్గొన్నారు.  


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...