Followers

విశాఖలో కరోనా మహమ్మారి దోబూచులు


 


విశాఖలో కరోనా మహమ్మారి దోబూచులు

 

వృద్ధుడు మృతితో వైద్యుల హైరానా

 

   స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)

 

 నగరంలోని దక్షిణ నియోజకవర్గం, వన్ టౌన్ ఏరియా, ఏవిఎన్ కాలేజ్ దగ్గరలో,చంగల్రావుపేటలో తొలి కరోనా వ్యాధి వలన  మరణం సంభవించింది. 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో గురువారం కేజీహెచ్లో కిడ్నీ సమస్య తో చేరాడు. అతనిని తాత్కాలిక ఐసోలేషన్ వార్డులో ఉంచారు. రాత్రికి రాత్రి కరోనా పరీక్షలు జరిపించారు. రిపోర్టు కోసం ఎదురు చూస్తూ ఉండగానే శుక్రవారం తెల్లవారి మృతిచెందాడు. అనారోగ్యంతోనే చనిపోయాడు గనుక మృతుని బంధువులు మృతదేహాన్ని చెంగల్ రావు పేట లోని తన ఇంటికి తీసుకు వెళ్లి పోయారు. ఇంటికి తీసుకు పోయిన తర్వాత కరోనా రిపోర్ట్ వచ్చింది. దీంట్లో పాజిటివ్ ఉండడంతో కేజీహెచ్ సిబ్బంది పరుగులు తీశారు. అయితే కెసీట్లు పొందుపరిచిన టెలిఫోన్ నెంబర్ మాత్రం పని చేయడం లేదు.వెంటనే జివిఎంసి చీఫ్ మెడికల్ అధికారికి పోలీసులకు సమాచారం అందించారు. విశాఖలో తొలి కరోనా మరణం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వృద్ధుల చికిత్స పొందిన కేజీహెచ్ తాత్కాలిక ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్న వైద్యులందరికీ కరుణ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేసినట్టు పర్యవేక్షణాధికారి డాక్టర్ అర్జున్ సూపర్డెంట్ మాట్లాడుతూ తెలియజేశారు. ఈ వార్డులో వైద్యులతో సహా సుమారు 40 మంది సిబ్బంది ఉన్నారు. వైద్యులు, నర్సులు, వార్డు బాయ్ లు,శానిటరీ సిబ్బందికి, కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు.అలాగే దిబ్బ పాలెం కి చెందిన తల్లి కొడుకులకు కూడా శుక్రవారం కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.
 

 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...