Followers

నిషేధిత ప్రాంతంలో పర్యటించిన జివిఎంసి ఉన్నతాధికారులు

 



 


 


నిషేధిత ప్రాంతంలో పర్యటించిన జివిఎంసి ఉన్నతాధికారులు


విశాఖపట్నం,పెన్ పవర్  :


జివిఎంసి పరిధిలో గల మూడవజోన్ 20వ వార్డు దిబ్బపాలెం చందకవీధి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసు రావడంతో ఆ ప్రాంతం అంతయూ నిషేధిత ప్రాంతముగా ప్రకటించబడినది. దిబ్బపాలెం పరిసర ప్రాంతాల్లో వ్యాధి మరింత ప్రబలుకుండా తగు చర్యలు చేపట్టేందుకు జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు, సి.ఎం.ఓ. హెచ్ డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బయాలజిస్టు పైడిరాజు తో కలసి పర్యటన చేపట్టారు. ఇటీవల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థ చెన్నై నుండి తీసుకువచ్చిన “బైల్ మిస్టర్' యంత్రం ద్వారా సోడియం హైడ్రో క్లోరైట్ రసాయన ద్రావణాన్ని ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా చల్లించారు. చిన్న చిన్న వీధి మార్గాల్లో చేతిపంపుల ద్వారా రసాయన ద్రావణాన్ని, బ్లీచింగ్ కలిపిన సున్నాన్ని కాలువల పై, చెత్తను వేసే బిన్స్ వద్ద చల్లించారు. అక్కడ ప్రజలుతో మాట్లాడుతూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలు, ఆవాసాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే, కరోనా వ్యాధిపై ఎటువంటి భయాందోళనలు ఉండవని ప్రజలకు ఉద్బోదించారు.


 


 


 


 


 


 


 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...