Followers

జగన్ గూగ్లీకి టీడీపీ బౌల్డ్


జగన్ గూగ్లీకి టీడీపీ బౌల్డ్



వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలివిగా వేసిన గూగ్లీకి టీడీపీ క్లీన్ బౌల్డ్ అయింది. సెంటిమెంట్ తో కొట్టిన దెబ్బకు.. సెంటిమెంట్ గానే రియాక్ట్ అయింది. సన్నాయి నొక్కులు నొక్కుతూ.. అలా కాదు ఇలా కాదు అలా అంటూ చెప్పుకొచ్చింది. రెండు రోజులయ్యాక.. ఆలోచించుకుని.. ఇప్పుడు డొంక తిరుగుళ్లు మానేసి.. స్ట్రెయిట్ పాయింట్ కొచ్చేసింది. కాని అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడిక ఏం చేసినా.. అది కవర్ అయ్యే సమస్యే లేదు. జగన్ సడెన్ డెసిషన్ తో సడెన్ గా రియాక్ట్ అవ్వాల్సి రావడంతో.. కన్ఫ్యూజ్ అయిపోయి.. ఇప్పుడు తల కొట్టుకుంటున్నారు.  ఇదంతా 125 అడుగు అంబేద్కర్ విగ్రహం గురించే. సడెన్ గా జగన్మోహన్ రెడ్డి విజయవాడ స్వరాజ్ మైదాన్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని.. అక్కడే స్మృతివనం కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ప్రకటించిన తెల్లారే శంకుస్థాపన చేస్తారని చెప్పారు. పెట్టేది అంబేద్కర్ విగ్రహం.. అది కూడా విజయవాడ నడిబొడ్డున.. అవుననాలా.. కాదనాలా అని ఆలోచనలో పడింది తెలుగుదేశం.  గతంలో చంద్రబాబు ఈ స్మృతివనం అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాన్ చేశారు. అది అక్కడ నిర్మించాల్సి ఉండగా.. జగన్ తెలివిగా దాన్ని విజయవాడకు మార్చేశారు. రాజధాని విశాఖకు మారిపోతున్నందున.. అమరావతిని మరింత బలహీనం చేసేందుకే ఈ ఎత్తుగడ వేశారని అందరికీ అర్ధమైంది. కాని టీడీపీ నేతలు మాత్రం ఈ మాట చెబుతూనే.. విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నాం అన్నారు. ఒకరోజు అయ్యాక.. విగ్రహం ఇక్కడ పెట్టినా స్మృతివనం అమరావతిలోనే పెట్టాలన్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చాక.. విగ్రహం, స్మృతివనం రెండూ అమరావతిలోనే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ టీడీపీ నేతలు ఏమీ మాట్లాడటం లేదు.. కాని గుంటూరు టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనందబాబు మాత్రం అమరావతిలోనే స్మృతివనం, విగ్రహం పెట్టాలని.. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. జనానికి మాత్రం మొదటిరోజు స్వాగతిస్తున్నాం అని చెప్పిన టీడీపీ నేతల మాటలనే ఫాలో అయిపోయారు. వైసీపీ దళిత నేతలు మాత్రం దీనిని ఫుల్లు హైలెట్ చేసుకునే పనిలో పడ్డారు. అసలు మహానుభావుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏ మాత్రం గౌరవించకుండా.. ఆ నిబంధనలన్నిటికి తూట్లు పొడవటమే కాక.. తాననుకున్నదే రాజ్యాంగంలా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి అనర్హుడు.. ఈ మాట మాత్రం ఒక్క టీడీపీ నేత కూడా అనలేకపోయారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారం, పంచాయతీ ఆఫీసుకు పార్టీ రంగుల వ్యవహారం, డిపార్ట్ మెంట్ల తరలింపు, మండలి రద్దు.. మండలిలో రెండుసార్లు బిల్లులు పెట్టడం.. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి..చెప్పడానికి .. కాని ఇవేమీ ఎత్తకుండా.. అంబేద్కర్ విగ్రహం అనే సబ్జెక్ట్ లో పడిపోయి.. టీడీపీవాళ్లు ఘోరంగా దెబ్బ తిన్నారు. అంతేకాదు.. ఇదే స్వరాజ్ మైదాన్ ను అమ్మేయాలని కూడా ప్రభుత్వం ప్రయత్నించింది.. ఆ విషయం కూడా ఎవరూ నొక్కి చెప్పలేదు. కాని ఇప్పుడు ఏం చెప్పినా.. ఎవరూ పట్టించుకునే పరిస్ధితిలో లేరు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...