కొండరెడ్ల రెడ్డిగుంపులోబోరింగ్ మరమ్మతులు
వి.ఆర్.పురం,పెన్ పవర్వి.ఆర్.పురం మండలం ఉమ్మడివరం గ్రామంలో కొండరెడ్ల రెడ్డి గుంపులోమంచినీటి సమస్య ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న రేఖపల్లి పంచాయతీకి సంబంధించిన నూతన సర్పంచ్ పూ నెం సరోజిని ఆ గ్రామానికి వెళ్లి దగ్గరుండి బోరింగ్ మరమ్మతులు చేయించినారు. రేఖపల్లి పంచాయతీలో గల గ్రామాల్లో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే గ్రామంసర్పంచ్ కి తెలియజేయాలని ఆమె ప్రజలకు తెలియజేసినారు.ఆ గ్రామ ప్రజలు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ ఉప సర్పంచ్ పాయం లక్ష్మణ్ చిక్కాల రామారావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment