కేతిరెడ్డి బండిపై అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దేశంలోనే తొలిసారి ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆయన అమలు చేశారన్నారు . ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అవార్డును కలెక్టర్ గంధం చంద్రుడు స్వయంగా కేంద్ర వ్యవసాయశాఖామంత్రి తోమర్ చేతుల మీదుగా అందుకున్నారు . అవార్డు అందుకున్న కలెక్టర్‌ను సీఎం జగన్ ప్రశంసించారు . అయితే జగన్ వద్ద గంధం చంద్రుడు ప్రశంసలు అందుకోగా , ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం ఈ క్రెడిట్ జాయింట్ కలెక్టరు దక్కుతుందని , ఆయన చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించడం హేయమైన చర్య అన్నారు. విజయనగరం అభివృద్ధి వేదిక అధ్యక్షుడు పుక్కిళ్ళ షణ్ముఖ రావు మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్ స్వరో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు అని సంజయ్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారురు. వారి ఇరువురు పై అట్రాసిటీ కేసు నమోదు చేయకుంటే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన కళా మండలి కార్యదర్శి ఆతవ ఉదయ భాస్కర్, ఆదడా మోహన రావు, గంటన అప్పారావు, గండ్రేటి సత్యనారాయణ, కొమ్ము సోములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేగేటి సంతోష్, కింతడా పైడి రాజు, బోనెల అరుణా, ఎద్దు సంతోషి, విజయనగరం నియోజకవర్గ కన్వీనర్ అయినాడ కృష్ణ, గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ పెంట శంకర్ రావు, సోము మురళీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment