Followers

బి.సి.సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ వేణు ను కలిసిన గోదావరి లైబ్రేరియన్స్ అసోసియేషన్ సభ్యులు

బి.సి.సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ వేణు ను కలిసిన గోదావరి లైబ్రేరియన్స్ అసోసియేషన్ సభ్యులు



గండేపల్లి పెన్ పవర్

గండేపల్లి మండలం సూరంపాలెం గోదావరి  లైబ్రేరియన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కె.అశోక్ కుమార్ ఆధ్వర్యంలో  అసోసియేషన్ సభ్యుల బృందం రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖామాత్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారి ని కలిసి తమ సమస్యలు విన్నవించారు.రాష్ట్రవ్యాప్తంగా గల వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో,జూనియర్, డిగ్రీ కళాశాలలకు చెందిన మరియు పబ్లిక్ గ్రంధాలయ సంస్థ లలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడానికి కృషి చేయాలని కోరారు.దీనికి మంత్రి స్పందిస్తూ తాను సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని గౌరవ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టి కి సమస్య పరిష్కారం కొరకు తీసుకుని వెళ్లి తగు ఉత్తర్వులు జారీ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపినట్లు అశోక్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు ను కలిసిన వారిలో సంఘం కార్యదర్శి కె.సాయిబాబు,ఎ.కె.వి.ఆచార్యులు,కె.శివప్రసాద్,పి.రవిశంకర్,సి.హెచ్.రామచంద్రారెడ్డి,డి.రవికిరణ్,వి.వి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...