పని భారాన్ని తగ్గించాలని వినతి
గొల్లపల్లి, పెన్ పవర్
గ్రామ పంచాయతీ కార్యదర్శుల పైన ఉన్నటువంటి ఉపాధి హామీ పని భారాన్ని తగ్గించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కల్పించాలని మరియు ప్రో బిషన్ కాలాన్ని రెండు సంవత్సరాలు తగ్గించి రెగ్యులర్ చేయాలని గొల్లపల్లి మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో జనార్ధన్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది సంగారెడ్డి జిల్లా లో పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథంకు నివాళులు అర్పించి పని ఒత్తిడి తగ్గించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎంపిడిఓ జనార్ధన్ ఎం పీ ఓ వెంకటేశ్వర్ రెడ్డి సూపరిండెంట్ రవీందర్రావు పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ అధికారులు పాల్గొనడం జరిగింది

No comments:
Post a Comment