Followers

చేతివృత్తుల వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి జగదీష్ రెడ్డి

 చేతివృత్తుల వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి జగదీష్ రెడ్డి      

 సూర్యాపేట/పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమం కొరకు సీఎం కేసీఆర్ పాలనలో అనేక పధకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పద్మశాలి భవనం లో ఆదివారం జరిగిన ప్రపంచ టైలర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన అన్నిరకాల చేతి వృత్తుల వారికి తమ ప్రభుత్వం అండగా నిలించిందని, తెలంగాణ రాష్ట్రములో కుల వృత్తులు, చేతి వృత్తుల పునరుజ్జీవం జరిగిందని ఆయన అన్నారు. ప్రపంచానికి నాగరికత నేర్పింది భారతదేశం అయితే, కుట్లు అల్లికల ద్వారా బట్టలు కుట్డి అందించిన దర్జీలు గొప్పవారని ఆయన అన్నారు. మేరు సంఘం వారికి కుట్టు మిషన్ లు అందజేయడం జరిగిందని.. త్వరలోనే మిషన్ కుట్టే ఇతర కులాల వారికి కూడ కుట్టు మిషనులు అందజేస్తామని ఆయన అన్నారు. టైలర్స్ దుకాణాలకు విద్యుత్ సబ్సిడీ విషయంలో పేదవారికి మాత్రమే అదేవిధంగా చూడాలని మంత్రి అన్నారు. జిల్లా టైలర్స్ &ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. నీడ్స్ టైలర్స్ క్లాత్ షోరూం దూలం నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సంఘం అధ్యక్షులు మహేష్, సీపీఐ  నాయకులు, కేవీఎల్, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి, పట్టణ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్, పాండురంగా చారి, సంఘం ప్రధాన కార్యదర్శి కర్నే ఉపేందర్. కోశాధికారి దేవిరెడ్డి వీరారెడ్డి. జాన్ టెక్స్టైల్స్ విజయ కుమార్ శ్రీనివాస్, రమేష్, టైలర్స్, దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...