చారిటీ సోసైటీ ఆధ్వర్యంలో 20 కుర్చీలు బహుకరణ
బిక్కవోలు, పెన్ పవర్
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం బిక్కవోలు చారిటీ సొసైటీ మరియు గ్లోబల్ విజన్ హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ కరస్పాండెంట్ ఎం.జాన్ డీన్ మరియు ప్రధానోపాధ్యాయులు సత్యవాణి రంగంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం 15 కుర్చీలు పి.హెచ్.సి డాక్టర్ ఎం.కృష్ణ చైతన్య మరియు డాక్టర్ ఎం.పద్మ వీరికి అందించారు. అలాగే సింగంపల్లి ఉప కేంద్రం ఆరోగ్య కేంద్రానికి 5 కుర్చీలు బహుకరిందం జరిగింది అని డాక్టర్లు తెలిపారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కీర్తిశేషులు ఎం.శామ్యూల్ రాజు పేదలకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తు చేసుకుంటాము అని,మా వెన్నంటే ఉంటూ, ప్రోత్సహించే వారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం కుర్చీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment