Followers

శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

 శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

  నిరంతరం ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్ల శేషగిరి కరోనా తో అకాల మరణం చెందడం విద్యారంగానికి తీరని లోటని, ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శేషగిరి సామాజిక స్పృహ కలిగిన నాయకుడని, ఉపాధ్యాయుల సంక్షేమం  కోసం, కార్మిక వర్గాల హక్కుల కోసం,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారన్నారు. గురజాడ అధ్యయన వేదిక పక్షాన పలు సామాజిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తూ చైతన్యం కోసం కృషి చేశారన్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యోగ,కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. అంతే కాకుండా శేషగిరి విద్యారంగ విశ్లేషకునిగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఏ విధంగా నష్టపోతారనే వ్యాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. గతంలో యూటీఎఫ్ లో శేషగిరితో ఉద్యమ సహచరునిగా కలిసి పని చేసామని,అదేవిధంగా గత రెండున్నర దశాబ్దాలుగా  ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై జరిగిన అనేక ఐక్య పోరాటాల్లో కలిసి పాల్గొన్నామని సామల తన జ్ఞాపకాలను గుర్తు చేసారు. కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి  మరణం  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం రాష్ట్ర  విద్యారంగానికి, ఉపాధ్యాయ , ఉద్యోగ , కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అభివర్ణించారు  ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సామల పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...