Followers

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

 హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని పలు గ్రామాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని పలువురు మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయితీ సర్పంచులు ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనుల చేపట్టారు. ఇందులో భాగంగా పిట్టా డ గ్రామ సర్పంచ్ కాపరపు నాయుడు బాబు ఆధ్వర్యంలో వాణిజ గిరిజన గ్రామంలో  క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గ్రామంలో అన్ని వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు. సర్పంచ్ నాయుడు బాబు  మాట్లాడుతూ ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశలో ఉందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇంట్లో ఉన్న, అత్యవసర సమయాల్లో బయటికి వెళ్ళిన మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని ఆయన వివరించారు. ప్రస్తుతం మెంటాడ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టీకాలు, టెస్టుల్లో చేస్తున్నారని 45 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులకు టీకాలు వేయించుకోవాలని ఆయన తెలిపారు. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...