Followers

వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

 వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

అంతరిస్తున్న తాటి వనాలు తగ్గిన ముంజుల దిగుబడి

పెన్ పవర్,  విశాఖపట్నం

వేసవి కాలం వచ్చిందంటే ముంజు లేయ్- తాటి ముంజులు అన్న కేక వీధుల్లో వినిపిస్తుంటుంది. తాటి ముంజులు తట్టను మహిళలు నెత్తిన పెట్టుకొని  ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతుంటారు. మంజులేయ్  అన్న కేక వినగానే ఏయ్- ముంజులు ఇలారా  అని పలిచి బేరమాడి మరి కొనుక్కొంటాం. వేడికి ఉపశమనం కలిగించే తాటి ముంజులు సేకరణ లో ఎంతో శ్రమ దాగి ఉంది. తాటి చెట్ల నుంచి లేత కాయలు  దించి కత్తితో వలుస్తారు.ముంజులు తీయడం లో జాగ్రత్త వహించాలి. లేకుంటే ముంజులు పగిలి నీరు పోతుంది. చెట్టు గీత  గాళ్లు నేర్పరి గా ముంజులు తీస్తారు. గ్రామీణ ప్రాంతాలకు పరిమితం అయిన తాటి ముంజులు ఇప్పుడు పట్టణాలకు పాకింది. చేరువలో  ఉన్న  గ్రామాల నుంచి  తాటి ముంజల ను  పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. మారికవలస  పిన గాడి   సబ్బవరం ప్రాంతాల చెట్ల కింద తాటి కాయలు రాశులు  ముంజులు తీసి విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి  ముంజుల ధరలు పెరుగుతున్నాయి  గ్రామీణ ప్రాంతాల్లో డజను పాతిక రూపాయలు ఉంటే నగరంలో 50 రూపాయలకు పైనే. వేసవిలో చెట్టు గీత గార్లకు తాటి ముంజలు కాసులు  పండిస్తున్నాయి.  తాటి చెట్లు  అంతరించిపోతుం డంతో తాటి ముంజల  కొరత  వస్తుంది. తాటి ముంజులు కు పట్టణాల్లో గిరాకీ ఉండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి తాటి కాయలు సేకరిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు పరిమితమైన తాటి ముంజులు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. మాడుగుల ప్రాంతం నుంచి పాడేరు కు. నర్సీపట్నం ప్రాంతం నుండి చింతపల్లి కి ఎస్. కోట నుండి అరకు కి తాటి ముంజులు సరపరా అవుతున్నాయి. దూరం పెరిగే కొద్దీ ముంజుల ధరలు చుక్కల నంటుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని తెలంగాణ జిల్లా ల్లొ తాటి కలఫకు మంచి గిరాకి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో తాటి చెట్లును వ్యాపార్లు రవాణా చేస్తున్నారు. మరి కొంత కాలానికి తాటి చెట్లు కనుమరుగై పోయే అవకాశం ఉంది.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...