Followers

మే 6 సమ్మె వాయిదా

 మే 6 సమ్మె వాయిదా 


విశాఖపట్నం, పెన్ పవర్

స్టీల్ కార్మికులకు వేతన ఒప్పందం కోసం మే 6 న తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు తెలియజేశాయి ఈరోజు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్సనల్ కె.సి.దాస్ కలిసి ఆయన కార్యాలయంలో సమ్మె వాయిదా వేస్తున్న వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలకు ఆక్సిజన్ అందిస్తున్న మహోన్నత కార్యక్రమాల్లో స్టీల్ కార్మికవర్గం ఉందని వారన్నారు. నూతన వేతన ఒప్పందం కోసం సమ్మె చేయవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ  ప్రజలను కాపాడాలన్న ఆశయానికి కట్టుబడి సమ్మెను వాయిదా వేస్తున్నామని వారు వివరించారు. ఇప్పటికైనా స్టీల్ యాజమాన్యం కార్మికులకు న్యాయంగా సంక్రమించాల్సిన వేతన ఒప్పందాన్ని చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,అయోధ్య రామ్,వైటి దాస్, స్టీల్ ఎన్.జె.సి.ఏస్,సభ్యులు డి.ఆదినారాయణ,నాయకులు కె.సత్యనారాయణ, దొమ్మేటి అప్పారావు,పిట్ట రెడ్డి,కె.సత్య రావు,డి.సురేష్ బాబు,వి.రామ్ మోహన్ కుమార్,ఎన్.కృష్ణా రావు, వి.శ్రీనివాస్,వి.రామ్ కుమార్, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...