Followers

Showing posts with label EMPLOYMENT. Show all posts
Showing posts with label EMPLOYMENT. Show all posts

మే 6 సమ్మె వాయిదా

 మే 6 సమ్మె వాయిదా 


విశాఖపట్నం, పెన్ పవర్

స్టీల్ కార్మికులకు వేతన ఒప్పందం కోసం మే 6 న తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు తెలియజేశాయి ఈరోజు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్సనల్ కె.సి.దాస్ కలిసి ఆయన కార్యాలయంలో సమ్మె వాయిదా వేస్తున్న వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలకు ఆక్సిజన్ అందిస్తున్న మహోన్నత కార్యక్రమాల్లో స్టీల్ కార్మికవర్గం ఉందని వారన్నారు. నూతన వేతన ఒప్పందం కోసం సమ్మె చేయవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ  ప్రజలను కాపాడాలన్న ఆశయానికి కట్టుబడి సమ్మెను వాయిదా వేస్తున్నామని వారు వివరించారు. ఇప్పటికైనా స్టీల్ యాజమాన్యం కార్మికులకు న్యాయంగా సంక్రమించాల్సిన వేతన ఒప్పందాన్ని చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,అయోధ్య రామ్,వైటి దాస్, స్టీల్ ఎన్.జె.సి.ఏస్,సభ్యులు డి.ఆదినారాయణ,నాయకులు కె.సత్యనారాయణ, దొమ్మేటి అప్పారావు,పిట్ట రెడ్డి,కె.సత్య రావు,డి.సురేష్ బాబు,వి.రామ్ మోహన్ కుమార్,ఎన్.కృష్ణా రావు, వి.శ్రీనివాస్,వి.రామ్ కుమార్, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి

  ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి 

గుడివాడ, పెన్ పవర్

ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సోమవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఉయ్యూరుకు చెందిన సుద్దపల్లి హెప్సిబా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3గా కాంట్రాక్ట్ పద్దతిన 2018 వ సంవత్సరం నుండి పనిచేస్తున్నానని తెలిపారు. కొన్ని కారణాలతో తనను విధుల్లోకి రాకుండా నిలిపివేశారన్నారు. దీనికి సంబంధించిన ఫైల్ పౌరసరఫరాల శాఖ ఎండీ కార్యాలయంలో పెండింగ్ లో ఉందని చెప్పారు. తన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించేలా చూడాలని మంత్రి కొడాలి నానిని కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ ఎండీతో మాట్లాడతానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ నియామకాలు జరిగేవన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగికైనా రాష్ట్ర ఆర్ధికశాఖే జీతాలను చెల్లిస్తుందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు

ఉపాధి వేతనదారులు లకు కరోనాపై అవగాహన

 ఉపాధి వేతనదారులు లకు కరోనాపై అవగాహన

మెంటాడ, పెన్ పవర్

మెంటాడ మండలం లోని, కుంతిని వలస గ్రామ సర్పంచ్ పెద్ది రెడ్ల రమేష్ నాయుడు శనివారము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న ఉపాధి వేతనదారులు వద్ద కు నేరుగా వెళ్లి కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ నాయుడు మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఉపాధి పనుల్లో కూడా వేతనదారులు బహుదూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. ఇళ్ల వద్ద కూడా ప్రతి ఒక్కరు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి వద్ద వేడి నీటిని తాగాలని సూచించారు. ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి వలన ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనీ ఆయన పేర్కొన్నారు. అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని అన్నారు. ప్రస్తుతం కరోన టీకాలు, టెస్టులు వేస్తున్నారని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా టీకా వేసుకోవాలి అని ఆయన సూచించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...