Followers

ఏజెన్సీలో మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.

ఏజెన్సీలో  మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.


గిరిజన పిల్లలకు  కల్లిపోయిన గుడ్లు పంపిణీ. 

అంగన్వాడి కేంద్రాలపై  కొరవడిన పర్యవేక్షణ.

విశాఖపట్నం, పెన్ పవర్ 

 విశాఖ ఏజెన్సీలో అంగన్ వాడి కేంద్రాలు మొక్కుబడిగా నడుస్తున్నాయి. కేంద్రాల ద్వారా గిరిజన పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అంగన్ వాడి కేంద్రాలు తూతూ మంత్రంగా నడుస్తున్నాయి. గిరిజనులకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు  మొక్కుబడిగ  ఇస్తున్నారని ఆరోపణలు బాహటంగా వినిపిస్తున్నాయి.  గిరిజన చిన్నారులకు  గర్భిణీలు బాలింతలకు  నిబంధనల ప్రకారం అందించాల్సిన  కోడిగుడ్లు పాలు  గోధుమపిండి  చెనగ చెక్కులు  ఎండు ఖర్జూరం   బియ్యం నూనె పప్పులు పంపిణీ  సక్రమంగా లేదని  గిరిజన మహిళలు  గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ అధికారులు మాత్రం పట్టణాలనుంచి అడపాదడపా వచ్చి పోతున్నట్లు సమాచారం. అధికారి రాలేదని ఎవరైనా ప్రశ్నిస్తే మీటింగ్ కు వెళ్లారన్న  సమాధానం కార్యాలయ సిబ్బంది నుంచి వస్తున్నది.  ఇక  సిబ్బంది  విధులు చెప్పనవసరం లేదు.పర్యాటక కేంద్రం ఐన అరకు ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రత్యేక నిదర్శనం. అంగన్ వాడీ కేంద్రాల పనితీరు వర్ణనాతీతం. వర్రా గ్రామ అంగన్ వాడీ కేంద్రం లో గిరిజన చిన్నారులకు కుల్లిన కోడి గుడ్లుని కార్యకర్త పంపిణీ  చేసిందని తల్లులు ఆరోపించారు. పీఓ పట్టించుకోక పోవడం వలన కార్యకర్త లు ఇష్టానుసారం గా తెరుస్తున్నరని మండి పడుతున్నారు. కుల్లిన గుడ్లు పంపిణీ పై అరకు ఐసిడిఎస్ పీఓని వివరణ  కోరేందుకు ప్రయత్నించగా ఆమే అందుబాటులో లేరు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...