Followers

విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

 విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

                                                                                      నగరంలో పిట్టల్లా రాలిపోతున్న కరోనా రోగులు

 పట్టించుకోని కేజిహెచ్ యాజమాన్యం.

విశాఖపట్నం,పెన్ పవర్,

విశాఖ నగరంలో పెద్దాస్పత్రి కేజీహెచ్ క్యాంటీన్ వద్ద కరోనా నిబంధనలు పాటించడంలేదు. క్యాంటీన్లో  భోజనం టీ టిఫిన్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ప్రాణాలను హరించి వేస్తుంటే  ప్రజలకు చీమ కుట్టినట్లయినా లేదని    ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత క్యాంటీన్ వద్ద జనం రద్దీ ఎక్కువయింది. తోపులాటలు ఒకరిపై ఒకరు ఢీ కొంటూ  ఆహార పదార్థాలకు ఎగబడ్డారు. జనం గుంపుగా  కుమ్ము లాడు  కుంటున్న   క్యాంటీన్ నిర్వాహకులు గాని  ఆస్పత్రి యాజమాన్యం గానీ  పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. నగరంలో కరోనా కేసులు గంట గంటకు పెరిగిపోతున్నాయి మరోపక్క మరణాల సంఖ్య విస్మయాన్ని కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా  జనంలో మాత్రం చలనం లేదు. భయం కనిపించలేదు. కాంటీన్ లో  ఆసుపత్రికి వచ్చిన జనం కిక్కిరిసి పోవడం చూస్తుంటే  కరోనా మహమ్మారి  కోరలు చాస్తుందని  అంటున్నారు.


కేసులు పెరుగుతున్న దృష్ట్యా  ప్రభుత్వం మధ్యాహ్నం పన్నెండు తర్వాత  తెల్లవారు 6  వరకు  బుధవారం నుంచి కర్ఫ్యూ విధించినా విషయం తెలిసిందే. ఒకపక్క కర్ఫ్యూ అమలులో ఉన్నా కేజీహెచ్ ఆస్పత్రి వద్ద  మరియు క్యాంటీన్ లో  జనాలు నిబంధనలకు విరుద్ధంగా ఎగబడటం పై  ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో  క్యాంటీన్ వద్ద జనం తోపులాటలు  అవసరమా అని ప్రత్యక్షంగా  సాక్షి అరకు వైయస్సార్ సిపి నాయకుడు   జీవన్ కుమార్   ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేజీహెచ్ అధికారులు పోలీసులు చొరవ తీసుకోవాలని లేనిపక్షంలో భోజనం క్యాంటీన్   కరోనా క్యాంటీన్ గా  పోతుందని జీవన్ కుమార్ అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...