వేగేశ్వరపురం లో సోడియం హైపో క్లోరైట్ పిచికారి
బుధవారం వేగేశ్వరపురం గ్రామంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉన్నందున సోడియం హైపో క్లోరైట్ ను సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురమారావు, పంచాయతీ సెక్రెటరీ వెంకట్రాజు ఆధ్వర్యంలో గ్రామంలో వీధులన్నీ పారిశుద్ధ్య కార్మికులచే పిచికారి చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పరశురామారావు మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని, బయటకు వచ్చినప్పుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి, మనల్ని, మనసమాజాన్ని కరోన బారినుండి కాపాడుకోవాలని తెలియజేశారు.
No comments:
Post a Comment