Followers

కరోనా పట్ల నిర్లక్ష్యం వీడని గ్రామస్తులు

 కరోనా పట్ల నిర్లక్ష్యం వీడని గ్రామస్తులు

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని అతి పెద్ద గ్రామమైన పేద మేడపల్లి లో ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం పై వ్యవహరిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రాణాంతకమైన కరోనా పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యవంతులను చేస్తున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఇంకా పలువురు గ్రామస్తులు కరోనాపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలువురు గ్రామస్తులు కనీసం మా స్కూలు ధరించకుండా ఇతర గ్రామాలకు ట్రాక్టర్లు ద్వారా  ప్రయాణాలు సాగిస్తున్నారు. గ్రామంలో కూడా చెత్తాచెదారం రాజ్యమేలుతుంది.

 పలువురు గ్రామస్తులు కరోన నిబంధనలు పాటించాలని , అవసరమైతే తప్ప వేరే ప్రాంతాలకు వెళ్లరాదని, ఇతర గ్రామాల నుంచి మన గ్రామానికి రానివ్వకుండా చేయాలని చెబుతున్న గ్రామస్తులు ఆ మాటలను పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. పెద్ద మేడపల్లి గ్రామం చాలా పెద్దది కావడంతో వద్ద వీధిలో ఏమి జరుగుతుందో, మరో వీధికి తెలియని పరిస్థితి ఎక్కడ ఉంది. సంబంధిత గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా స్పందించి రాకపోకలకు అడ్డుకట్ట వేయాలని పలువురు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో పలువురు కరోనా లక్షణాలతో ఉన్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...