Followers

రాబోయే వర్షా కాలంలో ఇసుక నిల్వలు ఉంచాలి...

రాబోయే వర్షా కాలంలో ఇసుక నిల్వలు ఉంచాలి...

కొవ్వూరు, పెన్ పవర్

జిల్లాలో రాబోయే వర్షా కాలంలో జూన్ 15 వ తేదీ నాటికి సుమారు 5 లక్షల టన్నుల ఇసుకను నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్  రెవెన్యూ కె.వెంకట రమణా రెడ్డి అన్నారు. కొవ్వూరు  ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఏ.పి.యం.డి.సి. అధికారులతో, ఇసుక ర్యాంపుల్లో ఉన్న ఇసుక సొసైటీ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఇసుక ఉత్పత్తి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక పట్టా ర్యాంపులు, ఓపెన్ ర్యాంపులు, డీసిల్టేశన్ ర్యాంపులు, ఇసుక డిపోలు మొదలగునవి త్వరిత గతిన ప్రారంభించే విధంగా చర్యలు తీసు కోవాలని అన్నారు. 28 డీసిల్టేశన్ ర్యాంపు ల్లో సుమారు 18 మాత్రమే పనిచేస్తున్నాయని, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు వెళ్లి పోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, వాళ్ళని వెనక్కి పిలిచి అన్ని ర్యాంపులు పనిచేసే విధంగా చర్యలు తీసు కోవడం జరుగుతుంది అని అన్నారు.  10 పట్టా ర్యాంపులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని అన్నారు.  22 ఓపెన్ ర్యాంపుల్లో 7 నుండి 8 మాత్రమే పని చేయడం జరుగుతోంది అని అన్నారు. ఇసుక ఉత్పత్తి ని పెంచేందుకు అన్ని ర్యాంపులు తెరిపించాలని  ఏ.పి.యం.డి.సి. అధికారులను ఆదేశించారు. 

కరోనా వైరస్ భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి అని, 4 రకాల పోస్టర్స్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ  కె. వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ టీకాలు తప్పనిసరిగా  వేయించుకోవాలి అని అన్నారు. కరోనా వైరస్ కి సంభందించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 104 కి కాల్ చెయ్యాలి అని అన్నారు. ప్రజ లందరూ అప్రమత్తంగా ఉండి, వైరస్ వ్యాప్తిని నియంత్రించి, మనమందరం ప్రాణాలను కాపా డుకుందామని అని అన్నారు. మాస్క్ లు ధరించి, సానిటైజర్ లు వాడుతూ, భౌతిక దూరం ప్రజలు తప్పనిసరిగా పాటించాలి అని అన్నారు. వాలంటీర్ ల ద్వారా జ్వరం ఎవ్వరికీ వచ్చింది అనే దాని గురించి సర్వే నివహిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ టెస్టులు చాలా వరకు పెంచడం జరిగింది అని, చేసిన 24 గంటల్లో రిపోర్ట్ లు వస్తున్నాయి అని అన్నారు.   ప్రస్తుతం 3 వేల 600 బెడ్ లు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సుమారు 5 వేల బెడ్ ల వరకు పెంచడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో  కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి, డి.ఎస్.పి. బి.శ్రీనాథ్, సి.ఐ సురేష్, ఏ పి.యం.డి.సి. అధికారి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...