Followers

వాలంటీర్లకు వందనం

  వాలంటీర్లకు వందనం


కరోనా సేవలలో మేము సైతం అంటున్న వాలంటీర్లు

కోవిడ్ సేవలలో మహిళా వాలంటీర్లు ముందంజ

మగవారికి దీటుగా సేవలకు సిద్ధం

ప్రజల మన్ననలు పొందుతున్న గ్రామ వాలంటీర్లు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్,


గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో గ్రామ వాలంటీర్లు కోవిడ్ సేవల్లో నిమగ్నమయ్యారు. కోవిడ్ రెండవ దశ ప్రజల జీవితంపై తన పంజా విసురుతున్నప్పటికి వాలంటీర్లు మాత్రం కోవిడ్ కు భయపడకుండా వారి సేవలను ముమ్మరం చేసారు.గుమ్మలక్ష్మీపురం పంచాయతీ లోని పలువీధుల్లో కోవిడ్ బారిన పడిన బాధితులకు మేమున్నమే భరోసా కల్పిస్తూ ఆ బాధితుల నుండి వైరస్ వ్యాప్తి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు పాటిస్తు పారిశుద్యం పై దృష్టి సారిస్తున్నారు. కోవిడ్ బాధితుల పరిసర ప్రాంతాల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేయడంతో పాటు డిస్ ఇన్ఫెక్షన్ పౌడర్లను జల్లుతున్నారు. గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో  గ్రామ వాలంటీర్లు 25మంది తో పాటుగా 10మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ 35మందిలో 19మంది మహిళలు 16మంది పురుషులు కోవిడ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఈ పంచాయతీలోని మగవారితో సమానంగా మహిళ వాలంటీర్లు,ఉద్యోగులు కోవిడ్ సేవల్లో ఎండనక వాననక ముందంజలో ఉంటూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు.గ్రామంలో ఎక్కడ పాజిటివ్ కేసులు నమోదైన తక్షణమే అక్కడకు చేరుకుని పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో వాలంటీర్లతో పాటుగా సచివాలయ సిబ్బంది కూడా వారి విధులను ముగించుకుని వాలంటీర్లతో పాటుగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొవడంతో గ్రామ ప్రజలు వారి యొక్క విధినిర్వహనలను కొనియాడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్ సూచనల మేరకు మేమందరం మా విధులను నిర్వహించడానికి  సిద్ధంగా ఉన్నామని కరోనా కష్టకాలంలో మేము ఎంత సేవచేయడానికైన వెనుకాడమని కానీ గ్రామంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...