Followers
ఆలమూరులో వ్యాపార సమయాలు కుదిస్తూ అధికారులు, వ్యాపారస్తులు నిర్ణయం
ప్రత్యేక పరిపాలనాధికారి. ఎక్కడ వుంటారో..! ఎలావుంటారో..!
ప్రత్యేక పరిపాలనాదికారి. ఎక్కడ వుంటారో..? ఎలావుంటారో..?
జీకే వీధిలో విధులు నిర్వహించేందుకు అధికారులు ఉత్సాహం
గూడెం కోత్త వీధి, పెన్ పవర్
విశాఖ ఏజెన్సీ. విశాఖ జిల్లా గూడెం కోత్త వీధిమండలంలోని. విదులు నిర్వహించడానికి అధికారులు క్యూ కడుతున్నారు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడంతో అధికార పార్టీకీ చెందిన మండల స్థాయి నాయకులు చక్రం తిప్పుతున్నారని విమర్శులు గుప్పుమంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మండలంలో ఎం. డి. ఒ. తహశీల్దార్. ఇద్దరు గతనెల 30వ తేదీన పదవి విరమణ చేసిన విషయం తెలిసిందే. పాడేరు ఎమ్యేల్యే, అరుకు ఎంపీల పేర్లు వినియోగించుకుంటున్న నాయకులు చుట్టూ అధికారులు. క్యూ కడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిధులు పుష్కలంగా ఉండటంతో అటు ఎం. డి. ఒ. పోస్ట్లు. ఖాళీగా వుండడంతో ఆక్కడ పోస్టింగ్ కు మంచి గిరాకీ పెరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క అధికారికి కొంతమంది అధికారపార్టీ నాయకులు లోకల్ గా ఉన్న మరి కొంతమంది ప్రముఖులు పలుకుబడి వినియోగించుకుని, సుమారు రెండు నుండి ఐదు లక్షలు చెల్లించి. ఎండీఓ పొస్టు ను సంపాదించుకుంటున్నట్లు ప్రజా సంఘాలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు..? ఇప్పటికే గూడెం కోత్త వీధి మండలం లో బాతురూముల నిర్మాణాల లో ల క్షలాది రూపాయలు అవినీతి జరిగిందని, దినిపై సమాగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రజా సంఘాలు డిమాండ్లు చేస్తూన్నాయి. అయినా సంబంధిత జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు. వ్యవహరిస్తున్నరన్నధి జగమెరిగిన సత్యం... ప్రతి పంచాయితీ సర్పంచ్ పాలన ముగిసిన తరువాత. ప్రభుత్వం ప్రతి పంచాయితీకి. ప్రత్యేక పరిపాలనాధికారిని నియమించిన విషయం తెలిసిందే. ఇటువంటి కొంత మంది అధికారులు విధులకు రాకుండా... పంచాయతీ కార్యదర్శులతో కుమ్మక్కు అయ్యి, జీతాలు తీసుకుంటూ సొంతపనులు చేసుకుంటున్న విషయం బహిరంగ. రహస్యమే. మండలం లో మేజర్ పంచాయతీ అయిన గూడెం కోత్త వీధి ప్రత్యేక పరిపాలనాదికారి. ఎక్కడ వుంటారో..? ఎలావుంటారో..? ఎవ్వరికీ తెలియని మిలియన్ డాలర్ల ప్రశ్న..!. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందించి ఎంతమేరకు ఈ నిధులు వినియోగిస్తున్నారనే విషయం పై సమగ్ర దర్యాప్తు చేయాల ని మండల ప్రజలు కోరుతున్నారు..
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందించిన జనసైనికులు
కరోనా లాక్ డవున్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందించిన జనసైనికులు
పరవాడ పెన్ పవర్
పరవాడ మండలం : కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు,వికలాంగులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.గొరుపూటి శ్రీను, రాజేశ్వరి క్లాత్ అండ్ రెడీమేడ్ యజమాని మురుగన్ ల ఆర్థిక సహకారంతో సమకూర్చిన నిత్యవసర సరుకులను సుమారు 50 మంది నిరుపేదలకు ఐదు కేజీల నాణ్యమైన బియ్యం, తొమ్మిది రకాల కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మోటూరి సన్యాసినాయుడు , 79 వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు , చుక్కా నాగు, టిడిపి మాజీ కోఆప్షన్ నంబర్ గణపర్తి ఈశ్వరరావు, గుదె సంజీవ్, కరెడ్ల అభిరాం, కరెడ్ల లక్ష్మణ్, ఒడిసెల రాము, ఒడిసెల రాజు సన్నాఫ్ సూరిబాబు, మోటూరు హరి, తాడి గుఱ్ఱం నాయుడు, కరెడ్ల బ్రహ్మానందం, బీసీ కాలనీ చిరంజీవి, అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ గృహంపై దాడి చేస్తే శిక్షేది
అంబేద్కర్ గృహంపై దాడి చేస్తే శిక్షేది
అనకాపల్లి
నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజా గృహంపై దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని దళిత నాయకులు మామిడి నూకరాజు పేర్కొన్నారు. పాకిస్తాన్ దేశం వాలు భారతదేశం పై యుద్ధాలు చేస్తూ ఉంటే వాళ్లను భారతదేశ ప్రభుత్వం భారత ప్రజలు కూడా ముక్తకంఠంతో ఎదుర్కోవడం జరుగుతుంది కానీ భారత దేశానికి దశ దిశ పాలనాపరమైన రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహ పై దాడి చేస్తే ఇంతవరకు ఎటువంటి ప్రతిస్పందన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గాని భారత ప్రధానికి గాని ఎటువంటి చలనం లేదు ఇటువంటి సంఘటనలకు పాల్గొన్న వారిపై భారత రాజ్యాంగం పొందుపర్చినటువంటి చట్టాలను ఉపయోగించి వాళ్లను నడిరోడ్డుపై ప్రత్యక్షంగా ఉరితీయాలని దళిత కులాల సంక్షేమ సేవా సంఘం తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక హక్కుల వేదిక నాయకులు లక్ష్మణ్ , ప్రముఖ న్యాయవాది శాఖ మంత్రి సాయి వెంకట లక్ష్మణరావు, దళిత బహుజన సేవా సంఘ కొల్లి సత్య రావు తదితరులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్ల ఏఎన్ఎంలకు సరుకులు అందజేత
ఆశా వర్కర్ల ఏఎన్ఎంలకు సరుకులు అందజేత
అనకాపల్లి , పెన్ పవర్
దివంగతనేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 71వ జయంతోత్సవాలలో భాగంగా జీవీఎంసీ 80వ వార్డ్ పరిధిలో ఉన్నా ఆశ వర్కర్లకు, ఏ.ఎన్.ఎమ్ లకు, ఆర్.పి లకు వైస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ చేతుల మీదుగా 80వ వార్డ్ వైస్సార్సీపీ నాయకులు కొణతాల భాస్కరరావు,వైస్సార్సీపీ 80వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిని నీలిమల ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, కిరాణా సరుకులు,కాయకూరలను అందజేశారు.ఈ సందర్బంగా రత్నాకర్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ముందుండే భాస్కర్,నీలిమలు ఈ కరోనా విపత్తు సమయంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఆర్.పి లను, ఏ.ఎన్.ఎమ్ లను,ఆశ వర్కర్లను గుర్తించి వారికి తనవంతు సేవ చేయటం అభినందించదగ్గ విషయమన్నారు.ఈ సందర్బంగా అక్కడికి వచ్చిన ఆర్.పి లు తమకు గత 13 సంవత్సరాలనుంచి జీతభత్యాలు లేవని ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని సమస్యను ఇంతవరకు ఎంతో మంది నాయకులకు తెలియజేసిన మా సమస్యను పరిష్కరించలేదని రత్నాకర్ దృష్టికి తీసుకురాగా అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన సమస్య పరిస్కారమయ్యేలా చేస్తానని ఆర్.పి లకు తెలిపారు.ఆర్.పి లు రత్నాకర్ గారి సేవానిరతిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాండ్రేగుల శ్రీరామ్,విల్లూరి శేఖర్,విల్లూరి సంతోష్,సూరిశెట్టి గిరి, కొణతాల చందు,పెంటకోట సునీల్, బి.వరకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గోకవరం నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
గోకవరం నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
గోకవరం పెన్ పవర్.
గోకవరం మండల నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. గోకవరంలో జరిగిన సంఘం సమావేశంలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షులుగా సానాపల్లి బాపిరాజు, సూదికొండ కుమార్, వల్లూరి నాగేశ్వరరావు, గండ్రెడ్డి నాని, సేనాపల్లి బాబులు, మల్లువలస సుబ్బారావు, అధ్యక్షునిగా సునయిల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షునిగా మల్లువలస రామరాజు, సెక్రటరీగా మల్లువలస రాంబాబు, జాయింట్ సెక్రటరీగా వల్లూరి ప్రసాద్, కోశాధికారిగా గండ్రెడ్డి సుబ్రహ్మణ్యం, జాయింట్ కోశాధికారిగా కొండపల్లి వీరబ్రహ్మం, సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గం సభ్యులను వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్, నాయకులు దాసరి రమేష్, కర్రి సూరారెడ్డి, సుంకర వెంకటరమణలు అభినందించారు.
భయం గుపెట్లో కొత్తపేట వాసులు
భయం గుపెట్లో కొత్తపేట వాసులు
కొత్తపేట, పెన్ పవర్
కొత్తపేట లో గత 3 రోజుల క్రితం 2 పాజిటివ్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే. వారి యొక్క కాంటాక్ట్స్ లో పలువురికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 3 గురికి పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు తెలిసింది. అలాగే మండల పరిధిలోని కండ్రిగ గ్రామానికి చెందిన 1 వ్యక్తికి కరోనా పాజిటీవ్ అని తెలిసింది.అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది.వీరిని బట్టి ఇంకా కొత్తపేట లో పదుల సంఖ్యలో కేసులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తపేట వాసుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...