Followers

సర్కారీ దవాఖానాలో బెడ్లు లేవు.. ప్రయివేటుకు సొమ్ము లేదు.. కరోనా పేషెంట్ల ఇక్కట్లు!



సర్కారీ దవాఖానాలో బెడ్లు లేవు.. ప్రయివేటుకు సొమ్ము లేదు.. కరోనా పేషెంట్ల ఇక్కట్లు!


 ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత.. ప్రభుత్వాస్పత్రిలో వసతుల లేమి.. కరోనా రోగుల పాలిట శాపంగా మారాయి. లక్షణాలు లేని కరోనా వ్యాధిగ్రస్తులను హోం క్వారంటైన్‌కు పంపిస్తుండగా.. లక్షణాలున్న పేషెంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సర్కారీ ఆస్పత్రుల్లో ఆశించిన మేర చికిత్స దొరకని వారంతా ప్రైవేటు బాట పడుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా చికిత్సలకు అనుమతులున్న 18 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవు. దీంతో రోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పై స్థాయిలో ఉన్న వ్యక్తుల రికమండేషన్‌ ఉంటేనే బెడ్లు దొరికే అవకాశం ఉండటంతో.. సాధారణ పేషెంట్ల పరిస్థితి నరకంలా మారింది. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో బెడ్‌కు 8 మంది వెయిటింగ్‌ లిస్ట్‌ ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ బెడ్ దొరికినా.. పీపీఈ కిట్స్‌ అని, మెడిసిన్ అని.. లేదా వెంటిలెటర్‌ అంటూ లక్షల్లో చార్జీలు దండుకుంటున్నాయి.. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 11 ప్రభుత్వ ల్యాబ్‌లలో టెస్టులు చేస్తున్నప్పటికీ.. సామాన్యుడుకి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం కొవిడ్ పరీక్ష చేయాలంటే.. ఒక రోజు వచ్చి టోకెన్ తీసుకోవాలి. ఆ తర్వాత పరీక్ష కోసం ఏకంగా రెండు రోజుల పాటు లైన్‌లో నిలబడాల్సిన దుస్తితి ఉంది. కేవలం పరీక్షలకే మూడు రోజులు సమయం పట్టగా.. రిపోర్ట్ రావడానికి ఏకంగా 6 రోజులు పడుంతోంది. దీంతో లక్షణాలు ఉన్నవారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చికిత్స తీసుకుందామనకుంటే రిపోర్ట్‌ లేకపోవడంతో ఎక్కడా చేర్చుకోవడం లేదు. ప్రతీ పరీక్షా కేంద్రంలో రోజూ 250 వరకు పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్నా.. రికమెండేషన్‌లతోనే సగం పరీక్షలు పూర్తవుతున్నాయని.. రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోన పాజిటివ్ కేసుల్లో.. 80 శాతం లక్షణాలు లేని కేసులు మాత్రమే వస్తుండడంతో.. ప్రభుత్వ క్వారంటైన్ గా ముందు నుంచీ ఉన్న నేచర్ క్యూర్ హస్పిటల్ లో.. వందలాది మంది రోగులు కోలుకొని ఇంటికి వెళ్తున్నారు. 300 బెడ్స్ సౌకర్యం ఉన్న ఈ ఆస్పత్రి.. యాక్టీవ్ కేసులతో పాటు.. డిశ్చార్జీలతో నిత్యం రద్దీగా కనిపిస్తోంది.


మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్‌


మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్‌


ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. ఇప్ప‌టికే మాజీ మంత్రి అచ్చెనాయుడు స‌హా ప‌ది మంది ఈ కేసులో అరెస్టైన విష‌యం అందరికి తెలిసిందే. తాజాగా ఏసీబీ అధికారులు మ‌రొక‌రిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ వ‌ద్ద‌ పీఎస్‌గా ప‌నిచేసిన ముర‌ళీ మోహ‌న్ అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఆంధ్రసప్రదేశ్ స‌చివాల‌యంలో వద్ద ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముర‌ళీ మోహ‌న్ ప్ర‌స్తుతం స‌చివాలయంలోని మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలలో విధులు నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఈఎస్ఐ కుంభకోణం కేసులు అరెస్టుల సంఖ్య 11 కు చేరింది. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో మొదట కింజరాపు అచ్చెనాయుడు ఆ త‌ర్వాత పితాని స‌త్య‌నారాయ‌ణ కార్మిక శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ఇదిలావుంటే ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను ఇటీవల కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు గ‌త శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టిన సంగతి తెలిసిందే.. అధికారులు చెబుతున్న దాని ప్రకారం గత ఆరేళ్లలో రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది.


క‌రోనా టెస్టుల్లో ఏపీ స‌ర్కార్ దూకుడు..15 నిమిషాల్లోనే ఫలితాలు..


క‌రోనా టెస్టుల్లో ఏపీ స‌ర్కార్ దూకుడు..15 నిమిషాల్లోనే ఫలితాలు..


క‌రోనా టెస్టుల విష‌యంలో ఇప్ప‌టికే దూసుకుపోతున్న ఏపీ ప్ర‌భుత్వం మ‌రింత జోరు పెంచింది. ఎమ‌ర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం వ‌చ్చినవారు క‌రోనా టెస్ట్ ఫ‌లితం కోసం ఎక్కువ స‌మ‌యం వెయిట్ చేయాల్సిన పనిలేదు. కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల్లోనే టెస్టుల రిపోర్ట్ తెలుసుకునేలా స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో కోవిడ్‌- 19 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌లను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కిట్‌లోని స్వాబ్‌తో తొలుత‌ ముక్కులో నుంచి జిగురును టెస్టు కోసం తీస్తారు. దానిని కిట్‌లోని లిక్విడ్‌లో మూడుసార్లు తిప్పి, ఆ స్వాబ్‌కు అతుక్కున్న మూడు చుక్కల ద్రవాన్ని కిట్‌పై వేస్తారు. 15 నిమిషాల త‌ర్వాత రిజ‌ల్ట్ తెలుస్తోంది. కిట్‌పై క‌ల‌ర్ మారితే కరోనా సోకిన‌ట్లు నిర్ధారిస్తారు. గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రుల‌కు ఎమర్జెన్సీ వైద్యం కోసం వచ్చే రోగులకు, యాక్సిడెంట్స్, ప్రసవాల చికిత్స కోసం వచ్చిన వారికి ఈ టెస్టులు చేయ‌నున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కిట్లు పంపిణీ చేశారు. అలాగే ఫ‌స్ట్ ఫేజ్ లో కర్నూలు జిల్లాకు 1,900 కిట్లు పంపారు. వీటిని కర్నూలు పెద్దాసుపత్రి, ఆదోని మాతాశిశు కేంద్రం, నంద్యాల జిల్లా ఆసుపత్రితో పాటు జిల్లాలోని 18 కమ్యూనిటి హెల్త్‌ సెంటర్లకు పంపారు. గురువారం నుంచే ఈ కిట్ల ద్వారా ఎమ‌ర్జెన్సీ రోగులకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రోగికి క‌రోనా సింట‌మ్స్ ఉండి, అతనికి నెగిటివ్ అని వ‌చ్చినా మళ్లీ ఆ వ్యక్తికి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు.


కారు బోల్తాప‌డలేదు..  అది ఎన్‌కౌంటరూ కాదు.. 



 


కారు బోల్తాప‌డలేదు.. 
అది ఎన్‌కౌంటరూ కాదు.. 



యోగి స‌ర్కార్‌పై ప్ర‌శ్న‌ల తూటా
దూబే ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా 
అందుకే ఈ చర్యలు తీసుకున్నారు: అఖిలేశ్
దూబేకు సహకరించిన వారి సంగతేంటి?: ప్రియాంకా గాంధీ
చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా: ఒమర్ అబ్దుల్లా


 


గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే భ‌య‌ప‌డిందే జ‌రిగింది. ప్రాణ‌భ‌యంతో స్వ‌యంగా పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన‌ వికాస్ దుబే.. చివ‌రికి త‌న చావును తానే కొనితెచ్చుకున్న‌ట్ట‌యింది. పోలీసుల నుంచి త‌ప్పించుకుని పారిపోతూ వికాస్ దుబే హ‌తమ‌య్యాడ‌న్న ‌వార్త విని కా‌న్పూర్ వాసులు పండ‌గ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవ‌ల వికాస్‌దుబే చేతిలో చ‌నిపోయిన పోలీసు కుటుంబాలు.. త‌మ‌కు అస‌లైన న్యాయం ఇప్పుడే జ‌రిగిందంటూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.


మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో వికాస్ దుబే ఎన్‌కౌంట‌ర్‌పై విమ‌ర్శ‌లు కూడా మొద‌ల‌య్యాయి. వికాస్ దుబేది ఫేక్ ఎన్‌కౌంట‌ర్ అంటూ.. విపక్షాలు యోగి స‌ర్కార్‌ను టార్గెట్ చేశాయి. వికాస్ దుబే ఎన్‌కౌంట‌ర్‌పై న్యాయ విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. స‌మాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడుఅఖిలేష్ యాద‌వ్.. వికాస్ దుబే పేరు ప్ర‌స్తావించ‌కుండా యూపీ స‌ర్కార్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కారు బోల్తాప‌డ‌లేదు కానీ.. కాని ర‌హ‌స్యాలు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డి.. ప్ర‌భుత్వం బోల్తాప‌డ‌కుండా చూసుకోగ‌లిగింది అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు. క్రిమిన‌ల్‌ని చంపారు స‌రే..ఇన్నాళ్లు అత‌ని నేరాల‌కు స‌హ‌క‌రించిన‌వారు, కాపాడిన వారి సంగ‌తేంట‌ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా యూపీ స‌ర్కార్‌ను ప్ర‌శ్నించారు. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దులా .. వికాస్ దుబే ఎన్‌కౌంట‌ర్‌పై పోలీసులు చేసిన ప్ర‌క‌ట‌న‌పై సెటైర్ వేశారు. మ‌ర‌ణించిన‌వారు క‌థ‌లు చెప్ప‌లేరు అంటూ ఆయ‌న కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవ‌లే యూపీలో జ‌రిగేవ‌న్నీ ఫేక్‌ ఎన్‌కౌంట‌ర్లేన‌ని.. వాటిపై విచార‌ణ జ‌రిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లైంది. ఈ క్ర‌మంలోనే వికాస్‌దుబే ఎన్‌కౌంట‌ర్ కూడా జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


 


నిజానికి కారు బోల్తా పడలేదు... వికాస్ దూబే 'ఎన్‌కౌంటర్'‌పై అఖిలేశ్ యాదవ్ కామెంట్!


నిజానికి కారు బోల్తా పడలేదు
వికాస్ దూబే 'ఎన్‌కౌంటర్'‌పై అఖిలేశ్ యాదవ్ కామెంట్!



    దూబే ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా 
    అందుకే ఈ చర్యలు తీసుకున్నారు: అఖిలేశ్
    దూబేకు సహకరించిన వారి సంగతేంటి?: ప్రియాంకా గాంధీ
    చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా: ఒమర్ అబ్దుల్లా


గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన విషయం తెలిసిందే. అతడిని ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా అది బోల్తా పడడంతో వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు. అతడికి బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఎన్‌కౌంటర్ చేశారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి కారు బోల్తా పడలేదని.. అతడి ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా పడే అవకాశం ఉండడంతో అలా జరగకుండా చర్యలు తీసుకున్నారని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ చురకలంటించారు. అసలు ఆ గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులే పట్టుకున్నారా? అతడే లొంగిపోయాడా? అన్న విషయం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నేరస్తుడు చచ్చిపోయాడు సరే.. మరి అతడు చేసిన నేరాలు, అందుకు సహకరించిన వారి సంగతేంటి? అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నిలదీశారు. కాగా, దీనిపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. 'చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా' అని ట్వీట్ చేశారు. అందుకే, బతికి ఉన్నవారు ఈ విషయంపై కథలు చెబుతున్నారనేలా ఈ వ్యాఖ్య చేశారు. 


 


నిర్మల సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ 


నిర్మల సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ 



 కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్బంగా రాష్ట్రానికి రావలసిన పెండింగ్ నిధులు సహా పలు కీలక విషయాలపై చర్చించారు. పెండింగ్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చెయ్యాలని నిర్మలా సీతారామన్ ను కోరినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితోను మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. అలాగే పెండింగ్ నిధుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ అధికారులను బుగ్గన రాజేంద్రనాథ్‌ కలవనున్నట్టు సమాచారం. బుగ్గన వెంట ఏపీ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ్‌ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా ఉన్నారు.  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్బంగా పీడీఎస్, జీఎస్టీ పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు, అలాగే పెండింగ్ బకాయిల విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి చేయూతగా అదనంగా నిధులు  ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణలు కేంద్రానికి ఇచ్చినట్టు తెలిపారు. 3,500 కోట్ల రూపాయల రీయంబర్స్‌మెంట్‌‌ చేయాల్సి ఉందని. పోలవరానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయంబర్స్‌మెంట్‌ చెయ్యాలని కోరినట్టు తెలిపారు. కోవిడ్ కారణంగా నిధుల విడుదలలో కొంత ఆలస్యం ఉందని అన్నారు.. కేంద్రం నుంచి జీఎస్టీ బకాయిలు 3500 కోట్లు రావాల్సి ఉందని బుగ్గన తెలిపారు.


మోతుగూడెంలో గంజాయి పట్టివేత



మోతుగూడెంలో గంజాయి పట్టివేత

 

....చింతూరు

 

 

ఈరోజు  సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లోమోతుగూడెం ఎస్ఐ గారు సిబ్బంది సుకుమారుడు బ్రిడ్జి దగ్గర వాహనాలు తనిఖీ చేయుచుండగా డొంకరాయి వైపు నుండి లక్కవరం వైపు పోవు AP 05TB 6460 ఆటో ఆపి తనిఖీ చేయగా ఆటో లో ముగ్గురు వ్యక్తులు 60 కేజిల గంజాయి ఉన్నట్లు వారి పేర్లు అడగ్గా 1,కుర్ర రవి చింతూరుచికెన్ షాపు 2,వినోద్ కుమార్ చింతూరు ఆటో డ్రైవరు, మరియు నందిగాం సురేంద్ర  చింతూరు మోటార్ సైకిల్ మెకానిక్ అని ఈ గంజాయిని ఒరిస్సా పప్పు లూరు నుండి భద్రాచలంలో అమ్ముటకు తీసుకొని వెళుతున్నట్లు చెప్పినట్లు వారి వద్ద ఉన్న 60 కేజీల గంజాయిని రెండు సెల్ఫోన్లు ఆటో స్వాధీనపరచుకొని వారి ముగ్గురు నీ అరెస్ట్ చేసి రంపచోడవరం కోర్టుకు హాజరు పరుస్తామని ఎస్సై  తెలిపారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...