Followers

ఘనంగా  ఎంప్లాయీస్ యూనియన్ 69 వ అవిర్భవ దినోత్సవ వేడుకలు


ఘనంగా  ఎంప్లాయీస్ యూనియన్ 69 వ అవిర్భవ దినోత్సవ వేడుకలు
 
గోకవరం పెన్ పవర్.


గోకవరం ఆర్టీసి డిపో నందు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద ఎంప్లాయిస్ యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్మికులు  సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు ఆధ్వర్యంలో  ఆవిర్భావ కేకును కట్ చేసి  కార్మికులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1952 సంవత్సరములో జూలై 11వ తేదీన ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంస్థగా రాష్ట్రంలో ఆవిర్భవించినది. అప్పటినుండి  కార్మికుల ఎన్నో సంక్షేమ లు, ఉద్యోగ భద్రత కల్పించడంలో కీలక పాత్ర వహించి ప్రభుత్వ ఉద్యోగు లతో సమాన వేతనాలు ఇప్పించి కార్మికులందరూ అందరిలో వెలుగులు నింపిందని కొనియాడారు. ఈ సందర్భంగా  ఎంప్లాయిస్ యూనియన్ గోకవరం డిపో కార్యదర్శి పైడి మల్ల లక్ష్మణరావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ లో కార్మికుల పక్షాన పోరాడుతూ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పుడూ ముందుండే యూనియన్ అని తెలిపారు .ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మికులు పాలపర్తి నారాయణరావు, మంగరాతి నాగేశ్వరరావు అక్కి రెడ్డి కృష్ణ, దేవుడు శ్రీను ప్రగడ ప్రసాద్ మహిళా ఉద్యోగులు గ్యారేజ్ కార్మికులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.


గీతం ఆస్పత్రిలో సినీ స్టెప్పులేసిన  కరోనా రోగులు.


గీతం ఆస్పత్రిలో సినీ స్టెప్పులేసిన  కరోనా రోగులు.
కోవిడ్_19 ఆస్పత్రిలో కొరవడిన  అధికార్లపర్యవేక్షణ.
ఆందోళన చెందుతున్న  కొత్త రోగులు.


      బ్యూరో ఛీప్ విశాఖపట్నం, పెన్ పవర్ 


నగరంలోని గీతం కోవిడ్ 19 ఆస్పత్రిలో పలువురు కరోనా పాజిటివ్ రోగులు సినీ స్టెప్పులేసి సందడి చేశారు. మాయలోడు చిత్రంలోని చినుకు చినుకు  అనే పాటకు  చిందులేశారు. పెద్ద జాలరి పేట కు చెందిన పలువురుకి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో వారిని గీతం కోవిడ్19 ఆస్పత్రి నైన్త్ బ్లాక్ లో  వైద్యం అందిస్తున్నారు. శనివారం వారు  చినుకు చినుకు అనే పాటకు స్టెప్పులేసి చిందులేశారు. సినిమా  రికార్డు వేసుకొని బహిరంగంగా  డాన్స్ లు  చేస్తున్న అధికారుల్లో చలనం లేదు. ఆస్పత్రిలో పర్యవేక్షణ కనిపించడం లేదు. రోగులు విచ్చలవిడిగా  చిందులేసే పరిస్థితి విమర్శలు వినిపిస్తున్నాయి.కోవిడ్ 19 ఆస్పత్రుల్లో   నిబంధనలు  కట్టుదిట్టంగా అమలు జరుగుతున్నాయని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆస్పత్రుల్లో  అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు అన్నది  గీతంలో రుజువైంది. పెద్ద జాలరి పేట కు చెందిన సుమారు ఎనిమిది మంది కరోనా పాజిటివ్  రోగులు  చిందులు వేయడంతో ఆసుపత్రిలో ఉన్న మిగిలిన రోగులు ఆందోళనకు గురయ్యారు. ప్రశాంతమైన వాతావరణంలో  ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ  వైరస్ తగ్గేవరకు క్రమశిక్షణతో ఉన్న రోగులు   పేద జాలరి పేట రోగుల  నిర్లక్ష్యానికి ఆందోళన చెందుతున్నారు. రోగుల చిందులాట వీడియో వైరల్ అయ్యి విస్మయం కలిగిస్తుంది.


భవనంపై నుంచి దూకి ఆటోడ్రైవర్ ఆత్మహత్య.


భవనంపై నుంచి దూకి ఆటోడ్రైవర్ ఆత్మహత్య.



ఆరిలోవ/ విశాఖపట్నం,  పెన్ పవర్



ఆరిలోవ శ్రీకాంత్ నగర్ శనివారం ఉదయం  భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే  శ్రీకాంత్ నగర్ లో నివాసముంటున్న  భూతల శ్రీను మహేష్ 48 అనే ఆటో డ్రైవర్ నాలుగు అంతస్తుల  భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనాలాక్ డౌన్ కారణంగా  ఆటో సర్వీసులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. దీనికితోడు ఆటో  ఈ ఎం  ఐలు  కట్టడానికి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో కుటుంబ పోషణ ఆటో ఈ ఎం ఐ సమస్య ఎదుర్కోలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఎమ్మెల్యే కన్న బాబు రాజు ను కలిసి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తాతాజీ


ఎమ్మెల్యే కన్న బాబు రాజు ను కలిసి 
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తాతాజీ


          మునగపాక పెన్ పవర్


మునగపాక:యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే,టిటిడి మెంబర్ అయిన యు.వి రమణ మూర్తి రాజు(కన్న బాబు రాజు) 68 వ పుట్టినరోజు సందర్భంగా వెంకటాపురం గ్రామ వైసీపీ నాయకులు సుందరపు తాతాజీ కన్నబాబు రాజు ని కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


వేడుకగా జరిగిన ఎమ్మెల్యే రమణ మూర్తి రాజు 68 వ జన్మదినo


వేడుకగా జరిగిన ఎమ్మెల్యే రమణ మూర్తి రాజు 68 వ జన్మదినo


        మునగపాక పెన్ పవర్ 



 మునగపాక: ఎలమంచిలి నియోజకవర్ఘం ఎమ్మెల్యే,టిటిడి బోర్డ్ మెంబర్ యు.వి.రమణ మూర్తి రాజు  (కన్నబాబు రాజు)జన్మదిన వేడుకలను పాటిపల్లి గ్రామంలో వైసీపీ యువ నాయకులు కోయిలాడ జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  గ్రామ నాయకులు,అబిమానులు కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేసి  శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం ఉపాధి హామీ (ఎన్.ఆర్.జి.యెస్) లో పనిచేసే సుమారు 200  మందికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరిసా శ్రీను, దాడి స్వామి శేఖర్, సన్నిబాబు, వెంకట్, ప్రకాష్, శంకర్, ఆదిబాబు మరియు గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ వాలంటీర్స్, వైయస్సార్సీపి కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆదివాసీలను ఆదుకోని అడ్డాకులు


ఆదివాసీలను ఆదుకోని అడ్డాకులు


అడ్డాకులు సేకరణలో ఆదివాసీ లకు అవస్థ లే.
      వారపు సంతలో దళారుల దోపిడి.


చింతపల్లి,  పెన్ పవర్


మన్యంలోని అటవీ ఉత్పత్తుల పేరు చెప్పగానే చటుక్కున గుర్తుకు వచ్చేది అడ్డాకులు. వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నా ఏడాది పొడవునా అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన అడ్డాకుల సేకరణ ప్రధానంగా చేసుకుని కొన్నివేల గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. విశాఖ మన్యంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పుష్కలంగా లభించే అడ్డాకులను ఆధారంగా చేసుకుని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కొన్ని వేల గిరిజన కుటుంబాలు ఆధారపడుతున్నాయి. మన్యంలో ఇంతటి ప్రాధాన్యత ఉన్నా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అనేక అవకాశాలు న్నప్పటికీ ఇటు గిరిజన సహకార సంస్థ గాని అటు ఐటిడిఎ గాని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. గిరిజనులకు సహకరించాల్సిన గిరిజన సహకార సంస్థ పేరుకే! ఆచరణలో మాత్రం గిరిజనులకు "కారం" రుచి చూపిస్తుంది. మద్దతు ధర ప్రకటించి (ఇచ్చి) అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన గిరిజన సహకార సంస్థ అధికారులు మౌనం దాల్చడంతో దళారులు  ఆదివాసీలను నిలువునా ముంచుతున్నారు. గిరిజనులు సేకరించే అడ్డాకులతో పాటు అన్ని అటవీ ఉత్పత్తులను జి సి సి కొనుగోలు చేయాలి. కానీ, అడ్డాకులను నిల్వ చేసేందుకు తమ వద్ద తగినన్ని గోదాములు లేవనే కారణాన్ని సాకుగా చూపించి ఆ శాఖ వీటిని కొనుగోలు చేయడం లేదు.పోనీ అడ్డాకులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తుందా? అంటే అదీ లేదు. తాము కొనుగోలు చేయని అడ్డాకులకు గిట్టుబాటు ధరలు ప్రకటించడంపై జి సి సి  వెనకాడుతోంది.ఏటా మార్చి నుంచి తొలకరి జల్లులు కురిసే వరకు మన్యంలో వ్యవసాయ పనులేమి ఉండవు. ఈ సమయంలో గిరిజనులు కొద్దిమేర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీంతో వారు అటవీ ఉత్పత్తులపై ఆధారపడతారు. అడవుల్లోకి వెళ్లి అడ్డాకులు సేకరించి వాటిని వారపు సంతలకు తీసుకువచ్చి విక్రయిస్తారు. అడ్డాకులను విక్రయించగా వచ్చిన సొమ్ముతో అవసరాలు తీర్చుకోవడంతోపాటు అడవుల నుంచి ఎంతో శ్రమించి వారం రోజులపాటు సేకరించిన అడ్డాకులను వ్యయ, ప్రయాసలతో వారపు సంతలకు తీసుకు వస్తే తగిన గిట్టుబాటు ధర లభించక పోవడంతో వారు నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.సుమారు రూ.1వేయి నుంచి రూ.12 వందలకు ధర పలికే కావిడ అడ్డాకులను వారపు సంతల్లో దళారులు కేవలం రూ.6 వందలకు కొనుగోలు చేసి గిరిజనులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. మైదాన ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులు మన్యంలోని అన్ని వారపు సంతల్లో భారీగా అడ్డాకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి లక్షల్లో లాభాలు పొందుతున్నారు.  అటవీ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ మాత్రమే కొనుగోలు చేయాల్సిన గుత్తాధిపత్యాలు గిరిజన సహకార సంస్థ కే ఉన్నాయి.


ఆర్వినగర్లో వ్యాపార్లు స్వచ్ఛందంగా లాక్ డౌన్.


ఆర్వినగర్లో వ్యాపార్లు స్వచ్ఛందంగా లాక్ డౌన్.


      గూడెం కోత్త వీధి _పెన్ పవర్



 కరోనా మహామ్మారి భయం తో గూడెం కోత్త వీధి మండలం ఆర్వి.నాగర్ లో వ్యాపార్లు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.
శ్రివరసిద్దివినాయక వర్తకసంఘం ఆద్వర్యంలో  శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో . ఈనెల11 నుండి 25 వరకు లాక్ డౌన్ పొడిగించాలని సంఘం పెద్దలు నిర్ణయించారు. గత నెల రోజులగా లాక్ డౌన్ లోఉన్నాము. ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి మళ్ళీ లాక్ డౌన్ సడలించిన. సమయం. సాధారణం రోజులో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. సంత జరిగే వారం. సోమవారం. గురువారం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. పై నిర్ణయిచిన నిబంధనలు ఉల్లంఘించిన వర్తకులవారిపై ఆరోజు కి1000 రూపాయలు జరిమానా విధించాలని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సంఘం ఉపాధ్యక్షుడు గారుత్తలరామరాకృష్ణ. సహాయ కార్యదర్శి గా కోరాబు సత్యనారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్ళీ 24 నసంఘం సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈసమావేశంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...