Followers

నాటుసారా కేంద్రాలపై పోలీస్, ఎక్సైజ్ అధికారులు దాడులు


నాటుసారా కేంద్రాలపై పోలీస్, ఎక్సైజ్ అధికారులు దాడులు


పోలవరం పెన్ పవర్


పోలవరం మండలం కొమ్ము గూడెం గ్రామంలో పోలవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ శీను స్టేషన్ సిబ్బందితో శుక్రవారం రాత్రి  నాటుసారా తయారీ కేంద్రాలపై జాయింట్ ఆపరేషన్ చేసినట్లు పోలవరం ఎక్సైజ్ సి ఐ జి సత్యనారాయణ తెలిపారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న ఎనిమిది వందల లీటర్ల పులిసిన బెల్లపు ఊట ధ్వంసం చేసి 45 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన గుగ్గులోతు పోచమ్మ, గుగ్గులోతు సురేష్ లను అరెస్ట్ చేసి కేసు నమోదు వేసినట్లు ఎక్సైజ్ సి ఐ జి సత్యనారాయణ తెలిపారు. నాటుసారా  తయారీ, రవాణా, అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ, పోలవరం సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ శ్రీను, కానిస్టేబుల్ మోహన్, వెంకట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ రాజా, సందీప్ పాల్గొన్నారు


ఆత్రేయపురం మండలంలో వణికిస్తున్న కరోనా


ఆత్రేయపురం మండలంలో వణికిస్తున్న కరోనా


ఆత్రేయపురం, పెన్ పవర్ 


పెన్ పవర్ ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో గత మంగళవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా వ్యక్తి విశాఖపట్నం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస వదిలాడు వారి కుటుంబ సభ్యులు  ఇతర కాంట్రాక్ట్ లో ఉన్నవారిని డాక్టర్ కె శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి కరోనా శాంపిల్స్ ని కాకినాడ పంపడం జరిగినది వాటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉండగా వీరి ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్ లో  ఉండవలసిన అవసరం  తెలియజేయడం జరిగింది.


వాడపల్లి వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం


వాడపల్లి వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం


ఆత్రేయపురం, పెన్ పవర్ 


పెన్ పవర్ ఆత్రేయపురం మండలం  వాడపల్లి లో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయంలో లో  వెంకన్న అన్నప్రసాదం ట్రస్టు కు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు వస్తువులైన ముళ్లపూడి వెంకట సుబ్బారావు శ్రీమతి లక్ష్మీ రంజని దంపతులు 11,116/- స్వామివారికి ట్రస్టుకు విరాళం ఇచ్చినారు మరో భక్తులు గోదావరి జిల్లా వాడపల్లి వాస్తవ్యులైన వీర వెంకట గౌతమ్ కృష్ణ స్వామివారి అన్నప్రసాదం ట్రస్టుకు 15000 /- రూపాయలు విరాళం ఇచ్చినారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు రుద్రం రాజు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు అర్చకులు ఆలయ సిబ్బంది శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు


చుట్టుముడుతూన్న కరోనా.. రూరల్ పోలీస్ కు పాజిటివ్... ధైర్యం విడక... సాహసం గా విధులు నిర్వహణ...


చుట్టుముడుతూన్న కరోనా..
రూరల్ పోలీస్ కు పాజిటివ్...
ధైర్యం విడక... సాహసం గా విధులు నిర్వహణ...


మండపేట, పెన్ పవర్


అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా కరోనా చుట్టుముట్టుతుంది. అందులో 24 కోవిడ్ విధుల్లో తలమునకలై ఉంటున్న పోలీస్ లు సైతం కరోనా కాటుకు బలవుతున్నారు.
అయిన ధైర్యం విడక సాహసం గా విధులు నిర్వహిస్తున్నారు. మండపేట రూరల్ ఎస్ ఐ పీతల దొరరాజు లాక్ డౌన్ సమయంలో అనారోగ్యం కు గురయ్యారు. చికెన్ ఫాక్స్ సోకడం తో ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితి. మరో వైపు లాక్ డౌన్ సమయం. ఉన్నత అధికారులు మరి కొన్ని రోజులు సెలవు తీసుకోవాలని సూచించారు. అయినా ఎస్ ఐ దొరరాజు వీధుల్లో చేరిపోయారు. అనునిత్యం గ్రామాల్లో అవగాహన కల్పించారు. ఈ నేపద్యంలో సాక్షాత్తు రూరల్ పోలిస్ స్టేషన్ కు కరోనా సెగ తాకింది. స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఆతనికి ఈ నెల 5 న జ్వరం గా ఉండటంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కాగా శాంపిళ్ళు కాకినాడ వెళ్లడం తో పలితాలు ఆలస్యం అయ్యాయి. జ్వరం తగ్గకుండా ఉండటం తో ఎస్ ఐ చొరవ తో ద్వార పూడి పి హెచ్ సి లో శుక్రవారం తిరిగి పరీక్షలు నిర్వహించి రాజమహేంద్రవరం పంపారు. కాగా శనివారం అతనికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో స్టేషన్ లో కలకలం ఏర్పడింది. మరో కానిస్టేబుల్ కు పరీక్షలు చేయగా అతనికి నెగిటివ్ వచ్చింది. శనివారం పోలిస్ సిబ్బంది తో బాటు రూరల్ సి ఐ మంగాదేవి, ఎస్ ఐ దొరరాజు లు సైతం పరీక్షలు చేయించుకోగా పలితాలు రావాల్సి ఉంది. కాగా పాజిటివ్ వచ్చిన కానిస్టేబుల్ మండపేట మండలం తాపేశ్వరం లోని శివాలయం వీధి సమీపంలో నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. తాపేశ్వరం పంచాయతీ కార్యదర్శి శుభకర్ అక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. కానిస్టేబుల్ బావమరిది పది రోజులు క్రితం తాపేశ్వరం వచ్చి నట్టు సమాచారం. కాగా ఈ విపత్కర పరిస్థితుల్లో సైతం పోలీసులు తమ విధులను సవాల్ గా స్వీకరించారు.


గ్రామ సచివాలయంలో సమాధానమే చెప్పని వైనం


గ్రామ సచివాలయంలో సమాధానమే చెప్పని వైనం


ఆత్రేయపురం, పెన్ పవర్ 


 ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామ సచివాలయంలో సమాధానం చెప్పేవారు కరువైయరు.దళిత పేట నుంచి ప్రసుతం పధకాలు చేసుకోవడానికి వచ్చిన లబ్దిదారులకు  సమాచారం తెలియక  గ్రామ సచివాలయ అధికారులు,వలేంటర్లుచెప్పక పోవడం విచారం వ్యక్తం చేస్తున్నారు.వై ఎస్ ఆర్ చేదోడు,వై ఎస్ ఆర్ చేయూత పథకాల గురించి ఇప్పటి వరకు తెలియదు అనడంలో అతిచేయోక్తి లేదు.అంతేకాదు కుల ధ్రువీకరణ పత్రాలుకు 2 వరాలైన ఇప్పడిివరకు రాని పరిస్థితి.ఎవ్వరికి చెప్పాలో లబ్ధి దారుడికి తెలియని పరిస్థితి.శనివారం గ్రామ సచివాలయంలో శ్రీరాములు,లబ్ధి దారుడు వెంకట్ తనయొక్క వాహన మిత్ర గురించి ఇప్పటి వరకు సొమ్ము అకౌంట్ జామా కాక పోవడంతో  అక్కడ ఉన్న సిబ్బంది ని  అడుగగా వాడపల్లి పంచాయితీ కార్యాలయానికి వెల్లగ   వాడపల్లి దళిత గ్రామస్తుడికి సమాదానం కరువైంది.వాడపల్లి లో దళిత  వాసులు అందరికి  జరిగిన విధంగానే మాకు న్యాయం జరగాలని వాడపల్లి దళిత గ్రామస్తులు కోరుకుంటుంనారు.దీనిపై అధికారులు స్పందించి  వాడపల్లి గ్రామ సచివాలయం పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజానీకం కోరుకుంటున్నారు.


చక్కా కేశవ కి రివార్డు అందజేసిన రూరల్ ఎస్సై అంకమ్మ



చక్కా కేశవ కి రివార్డు అందజేసిన రూరల్ ఎస్సై అంకమ్మ  

 

 (కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి, పెన్ పవర్) 

 

 కొత్తూరి కాశీలక్షమ్మ  ఒంగోలు రిమ్స్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆమె అడ్రస్ పోలీసు వారికి తెలియకపోవడంతో.కందుకూరు రూరల్ ఎస్సై కొత్తపల్లి అంకమ్మ ఈ మహిళ అడ్రస్ తెలిపిన వారికి 1000 రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని కందుకూరు వాట్సప్ గ్రూపుల లో ప్రకటించారు.దీనికి స్పందించిన ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకట కేశవరావు ఆమె పామూరు కు చెందినదని, వారి కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ నెంబర్ సేకరించి రూరల్ ఎస్సై అంకమ్మ కు  వివరాలు అందజేశారు. శనివారం సాయంత్రం చక్కా వెంకట కేశవరావు కు  అంకమ్మ తన చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అంకమ్మ మాట్లాడుతూ ఒంగోలు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె వివరాలు తెలియక పోలీసువారు ఇబ్బంది పడుతున్న సమయంలో మాకు ఆమె వివరాలు తెలియ జేసిన కేశవరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ తనకు ఇచ్చిన రివార్డుకు కొంత నగదును కలిపి ఒక పేదవానికి వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై  అంకమ్మ చేతులమీదుగా ఆదివారం అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వెంకట కేశవరావు కు అభినందనలు తెలిపారు.


మూగబోయిన మున్సిపల్ కార్యాలయం


మూగబోయిన మున్సిపల్ కార్యాలయం


మండపేట, పెన్ పవర్


కార్యాలయ సిబ్బంది కి కరోనా సోకడంతో మున్సిపల్ కార్యాలయం మూగబోయింది. నిత్యం అధికారులు, సిబ్బంది , ప్రజలతో సందడిగా కనిపించే మున్సిపల్ కార్యాలయం ప్రస్తుతం వెల వెల బోయి కనిపిస్తోంది. ప్రస్తుతం కార్యాలయంలోని అన్ని గదులను సానిటైజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ తెలిపారు. సోమవారం నుండి కార్యాలయం యధావిధిగా పని చేస్తుందన్నారు. కొన్ని మినహాయింపులతో ఉద్యోగులు తిరిగి విధుల్లో పాల్గొంటారన్నారు. అత్యవసర సేవలు మినహా ఇతర పనులు నిమిత్తం  ప్రజలను ప్రస్తుతానికి అనుమతించమని తెలిపారు. వాస్తవానికి మున్సిపల్ ఉద్యోగులందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకుని నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రమే విధుల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే 10 రోజులు క్రితం చేయాల్సిన పరీక్షలే నేటికీ పూర్తి కానీ పరిస్థితుల్లో ఇవన్నీ జరగాలంటే అది ఆషామాషీ వ్యవహారం కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...