Followers

అడబిడ్డలకు అండగా కేసీఆర్

డబిడ్డలకు అండగా కేసీఆర్

గుడిహత్నూర్,పెన్ పవర్
కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ అడబిడ్డలకు అండగా ఉంటుందని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని బోథ్ ఎమ్యెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో  36 మంది కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రు.36.4176 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గతంలో పేద ప్రజలు ఆడపిల్లల పెండ్లిళ్లు చేయాలంటే భయపడేవారని, నేడు ఆ పరిస్థితి లేదని పిల్లల పెండ్లిళ్లలకు కేసీఆర్‌ పెద్దన్న వలే ఆదుకుంటున్నారన్నారు.ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేకనే  ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పవన చంద్ర, ఎంపీపీ,సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అత్యవసర సందర్భాల్లో బ్లడ్ డొనేట్ చేస్తున్నా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ

 అత్యవసర సందర్భాల్లో బ్లడ్ డొనేట్ చేస్తున్నా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం

ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు

 ఆదిలాబాద్, పెన్ పవర్ 


ఆదిలాబాద్: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలతో బ్లడ్ డొనేట్ కార్యక్రమం చేపట్టడం వారు చేసే సేవలు అభినందనీయమని ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్  వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలకు ఇమ్యూనిటీపవర్ తక్కువ ఉన్న మహిళలు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రజలకు బ్లడ్ ఎంత అవసరమో గుర్తించి ఈ రోజు ఈ సొసైటీని ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 2012 సొసైటీని ప్రారంభించి ఇప్పటి వరకు 7 వేల మందికి బ్లడ్ డొనేట్ చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. వారి సొసైటీ అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మహిళలు కూడా సేవ చేయడంలో ముందు ఉన్నారని,  మహిళలు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అజీజ్, రిమ్స్ డైరెక్టర్ బాల కిషన్ రాథోడ్, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్, పెన్ పవర్



రామకృష్ణాపూర్ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రవీంద్రఖని ఆధ్వర్యంలో కల్వరి అనాథ వృద్ధుల ఆశ్రమంలో  వృద్ధులకు చీరలు పళ్ళు పంచి వారి మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ చైర్ పర్సన్. లయన్  కటుకం నాగరాజు క్లబ్ అధ్యక్షులు లయన్ నల్లాల శ్రీనివాస్ సెక్రటరీ లయన్ కాంపల్లి పూర్ణచందర్ ట్రెజరర్. లయన్ నక్క శ్రీనివాస్ క్లబ్ సభ్యులు గుర్రం ఉదయ్ ఆత్రం సంజయ్ గార్లు పాల్గొనడం జరిగినది. లయన్స్ క్లబ్ ఆఫ్ రవీంద్ర ఖని

నేటి సమాజంలో మహిళలు ఎంతో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి

 నేటి సమాజంలో మహిళలు ఎంతో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి

మందమర్రి, పెన్ పవర్

నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండాలని మందమర్రి మార్కెట్ లోని భగత్ సింగ్ ఏరియా యువత సభ్యులు రాయబారపు కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భగత్ సింగ్ ఏరియా యువత ఆధ్వర్యంలో మందమర్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఆరోగ్య సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువత సభ్యులు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ, మహిళలు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఓర్పుతో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్య రంగంలో పనిచేసే మహిళా ఆరోగ్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని, కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళా నాయకురాలు పద్మ, ఫర్జానా, యువత సభ్యులు శ్రీకాంత్, అశోకరెడ్డి, జమాల్, రమేష్, సుజిత్, శ్రీకర్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు

 అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు

మందమర్రి, పెన్ పవర్


ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మహిళా నాయకురాల్లు ఉప్పులేటి గోపిక, తోకల నిరోషలు మాట్లాడాతూ, పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నా ఇంకా సమాజంలో మహిళలు వివక్షకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలను గౌరవించడం వల్లనే సమాజం అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలకు, మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు కళ్లెపెళ్లి శోభారాణి, యుద్దమారి లావణ్య, సిరిపెళ్లి రవళి, పుప్పాల సునీత, పోతకనూరి దివ్య, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాని ప్రారంభించిన ఎస్సై భూమేష్

 అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాని ప్రారంభించిన ఎస్సై భూమేష్

మందమర్రి, పెన్ పవర్

ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాని సోమవారం పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అంబేద్కర్ యువజన సంఘం నాయకులను అభినందించారు. పట్టణ ప్రదాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎవరైనా ముందుకు వస్తే పోలీస్ శాఖ నుండి సహకారాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చలివేంద్రాలను ధ్వంసం చేస్తే  కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరాస్వామి, పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు, నాయకులు, నెరువట్ల దేవయ్య, చీర్ల సత్యం, నర్సోజి, ఉప్పులేటి నరేశ్, జూపాక సంపత్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, రామ్ శ్రీనివాస్, కటిక శ్రీనివాస్, కాసిపేట రవి, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

ఐక్య కార్యాచరణతో నూర్బాష్ / దూదేకుల గుర్తింపు , సమస్యలు సాధించుకోవాలి

 ఐక్య కార్యాచరణతో నూర్బాష్ / దూదేకుల గుర్తింపు , సమస్యలు సాధించుకోవాలి - తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్ 

 వనపర్తి,పెన్ పవర్

 తెలంగాణ ముస్లిం నూర్భాషా, దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఖలీల్  అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా షేక్ సిద్ధాసాహెబ్ , విశిష్ట అతిధులుగా దూదేకుల సీనియర్ నాయకులు & రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ.సుబాన్ అలీ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్ ఆధ్వర్యంలో  నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ నాయకులను సన్మానించారు. వనపర్తి జిల్లా దూదేకుల సోదరులను వివిధ పదవులలో నియమించారు. ముఖ్య అతిధి షేక్ సిద్దాసాహెబ్ చేతుల మీదుగా సీనియర్ నాయకులు సుబాన్ అలీ  రాష్ట్ర నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ-జాతి సమస్యల సాధనే ప్రధానంశంగా, రాష్ట్ర వ్యాప్తంగా దూదేకులకు విద్యాపరంగా, రాజకియంగా,  సామాజికంగా గుర్తింపు కోసం రాష్ట్ర , జిల్లా కమిటీలు పని చేస్తున్నాయని, గత రెండు సం.లలో మన దూదేకుల సంఘీయులు రాజకీయంగా మరియు సామాజికంగా గుర్తింపు సాధించి, కోకాపేటలో దూదేకుల భవనం వంటి సానుకూల ఫలితాలు సాధించామని, ఇదే స్పూర్తితో, ఐక్య కార్యాచరణతో నూర్బాష్ / దూదేకుల సమస్యలు సాధించుకుందామని పిలుపునిచ్చారు. నిరంతరం మన  సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంఘ సేవా కార్యక్రమాలతో దూదేకుల ఉన్నతికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు- అబ్దుల్ బషీర్, రాష్ట్ర పొలిటికల్ కోఆర్డినేటర్-జహంగీర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు-ఎండీ. ఖాసిం, మైనారిటీ నాయకులు-జహంగీర్, రాష్ట్ర కార్యదర్శులు ఎండీ. ఖాజా,  ఇదయితుల్లా, రజాక్, జమాల్, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు ఎండీ. ఖాజా మోయినుద్దీన్, రాష్ట్ర నాయకులు ఉస్మాన్, మహమూద్ పాషా, గద్వాల్ జిల్లా అధ్యక్షుడు- సుబాన్, యండి. ఉస్మాన్, మౌలాలీ, షేక్ షావలి, షాలిమియ, హుసేన్, అహ్మద్ హుస్సేన్, బాషా, రుఖ్మద్దీన్, మస్తాన్, చాంద్ పాష,లాల్ మహ్మద్, బాలెమియ, నవాబ్, సల్మాన్, అల్లీపీర్,ఆరిఫ్, షాబుద్దీన్, నౌషాద్, బాలెమియ, జిల్లా ఉపాధ్యక్షుడు-మాబాష తదితరులున్నారు. తదనంతరం వనపర్తి జిల్లా, రాష్ట్ర సమస్యలను స్థానిక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి  వినతిపత్రం అందజేశారు. ఈ మద్యనే అగ్ని ప్రమాదంలో పరుపుల ప్యాక్టరీ  కాలిపోయిన బాధిత యజమాని మంత్రిని  కలిశారు. ప్రభుత్వ సహాయం కోరగా, మంత్రి  వారికి అండగా ఉంటామని తెలిపారు. నూతన నియామక సభ్యులకు జాతీయ అధ్యక్షుడు అనీస్ మన్సూరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్, జాతీయ ఇంచార్జి షేక్ షకీనా, జాతీయ ఉపాధ్యక్షుడు షకీల్ మన్సూరీ, రాష్ట్ర వనపర్తి జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...