Followers

బ్లాక్ బెల్ట్ భవానికి సన్మానం

 బ్లాక్ బెల్ట్ భవానికి సన్మానం

గూడెం కోత్తవీధి, పెన్ పవర్

 మండలం లోని కట్టుపల్లి గ్రామానికి చెందిన బ్లాక్ బెల్ట్ సాధించిన మన్యం మహారాణి సాగిన భవానికి మహిళా దినోత్సవం సందర్భంగా దామనాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ రామకృష్ణ, ఏ ఎం సి వైస్ ఛైర్మన్ యిర్మీయా, ఉప సర్పంచ్ చిలకమ్మ, రిపోటర్ చిట్టిబాబు,సచివాలయ సిబ్బంది, వలంటీర్లు కలిసి సోమవారం శాలువా కప్పి సన్మానించారు.ఈ సంధర్భంగా స్టూడెంట్స్ కోపోఖాన్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్, విశాఖజిల్లా చీప్ ఇన్ సృక్టర్ బాకూరు పాండురాజు,చింతపల్లి కరాటే అసోసియేషన్ సెక్రెటరీ కరాటే ఇన్ సృక్టర్ కొర్ర అజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జికెవీధి లో ఘనంగా మహిళా దినోత్సవాలు

 జికెవీధి లో ఘనంగా మహిళా దినోత్సవాలు

గూడెం కోత్తవీధి,పెన్ పవర్

గూడెం కోత్తవీధి మండలం లోని జి టి డబ్ల్యూ ఆశ్రమ పాటశాల లో గిరిజన ఉద్యోగుల సంక్షేమసంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లోచెల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిని,హెచ్ డబ్ల్యూ వో నూకరత్నం లను సాలువలతో ఘనంగా సన్మానించారు.మరియు 20 మంది మహిళ ఉపాధ్యాయులను  పెన్నులు ఇచ్చి ఘనంగా సన్మానించారు.ఈ సంధర్భంగా  లోచెల రామకృష్ణ మాట్లాడుతూ  మహిళలు అన్నీ రంగాలలో రాణించాలని,మహిళా శక్తీ ని ప్రపంచానికి చాటి చెప్పాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సి ఆర్ పి కె.రాజ్ కుమార్,ఎం ఐ సి యు. సత్యనారాయణ, ఇంద్ర,ఎస్.రామకృష్ణ,పాఠశాల సిబ్బంది,విద్యార్థునిలు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

 మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

పెన్ పవర్,విజయనగరం

 మహిళలు అన్ని రంగాల్లో  సాధికారత సాధించాలని, మహిళా హక్కులపై ఉద్యమాలు చేయాలని ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి బుగత అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టీ.జీవన్ తో టైలరింగ్ మహిళా కార్మికులతో సమావేశము జరిపిన  సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి సాధించుకోవడం జరిగిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రక్షణ చట్టాలను అమలుకోసం ఆనాటి స్పూర్తితో మహిళలంతా ఉద్యమించాలన్నారు. వ్యామోగాములుగా, పైలెట్లుగా, డాక్టర్లు, నటీమణులుగా, అన్నిరకాల వాహన డ్రైవర్లుగా, ఉద్యోగులుగా, కార్మికురాలుగా, ఇంటి పని వారులుగా అన్ని రంగాల్లో సమాజ ఉత్పత్తి పరిణామ క్రమంలో కీలక పాత్ర పోషించిన మహిళలకు చట్ట సభల్లో గానీ, సమాజంలో గాని, సమాన హక్కులు అవకాశాలు లేకపోవడం బూర్జువా పెట్టుబడిదారీ సమాజంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది అన్నారు. సభల్లో మహిళలకు సగం రిజర్వేషన్లు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బానిసలుగా చూసే వికృతి బుద్ధుల నుంచి మహిళలను కాపాడాలని అన్నారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలు, ఈవ్ టీజింగ్,యాసిడ్ దాడులు సర్వసాధారణం అవుతున్న ఈ రోజుల్లో మహిళలంతా ఐక్యంగా ముక్తకంఠంతో తన హక్కుల కోసం ముందుకొచ్చి పోరాడాలని పిలుపు ఇచ్చారు. దిశ చట్టం వచ్చినప్పటికీ మహిళలకు సరైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాల పాత్ర సరియైన పదం లో నిర్వహించకపోవడం విచారించదగ్గ విషయమని,మహిళ అణిచివేతకు వ్యతిరేకముగా  ఉద్యమించాలని పిలుపునిచ్చారు,  ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టీజీవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాధించుకోవడం కోసమే ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరూ పోరాడి సాధించుకున్న రోజు ఈ రోజు అని అన్నారు, అలనాడు సమాజంలో మహిళలను హీనంగా చూడడం, ఓటు హక్కు లేకపోవడం, చట్టసభల్లో కనీసం ప్రాధాన్యత కల్పించక పోవడం,  ప్రపంచవ్యాప్తంగా మహిళలు ముక్తకంఠంతో ఉద్యమించి   రోజున సాధించుకున్నారు అన్నారు,  ఇలా దినోత్సవాన్ని పూర్తిగా తీసుకొని చట్టసభల్లో రిజర్వేషన్ల ను మహిళా హక్కులను, కార్మిక హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సమాజానికి సంపద అందించింది మీరే.. భీశెట్టి అరుణ

 సమాజానికి సంపద అందించింది మీరే.. భీశెట్టి అరుణ

పెన్ పవర్,విజయనగరం

     సమాజంలో ఇంత మంది ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే మీ లాంటి తల్లులు సంపద సృష్టించి ప్రజలకు అందించారని అందుకే నేటి ఆధునిక కాలంలో మహిళలకి మంచి గౌరవం లభిస్తుందని జిల్లా మహిళా సాధికారత సంస్థ అధ్యక్షురాలు భీశెట్టి అరుణ అన్నారు,మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం బి.ఎన్. ఆర్.అశ్రమం లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రోజు రోజుకి మహిళల అవసరం సమాజంలో పెరుగుతుందని మహిళలు ముఖ్యంగా వృద్ధులు ఈ సమాజంలో చాలామందికి బ్రతకడానికి కావలసిన మార్గాలు చూపించారని ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం తప్పదని ఆమె గుర్తు చేశారు ఆశ్రమంలో మహిళా దినోత్సవం వృద్ధుల మధ్య జరుపుకోవడం తనకి ఎంతో ఆనందంగా ఉందని అన్నారు, సభకు అధ్యక్షత వహించిన మహిళాస్ఫూర్తి అధ్యక్షరాలు ఆళ్ల శిరీష మాట్లాడుతూ వృద్ధులు నేటి తరంకి మార్గదర్శకులని వారిని సత్కరించటం ఎంతో అభినందనీయమని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారని,ప్రభుత్వం మహిళలకి ఇంకా ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.

అశ్రమం నిర్వాహకులు భీశెట్టి అరుణను, దొర సునీతను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు నేతలు దొర సునీత,రెడ్డిపల్లి కల్యాణి,శిరీష, కాండ్రేగుల ప్రసాద్,కాండ్రేగుల శివ,అశ్రమం లోని వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పురుషులకంటే మానసికంగా బలమైన మహిళలు స్నిత ప్రజ్ఞులు

 పురుషులకంటే మానసికంగా బలమైన మహిళలు స్నిత ప్రజ్ఞులు

పెన్ పవర్,విజయనగరం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పింకథాన్ వరుగు ప్రారంభ కార్యక్రమంలో

- జిల్లా న్యాయమూర్తి జి.గోపి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “పింక్ థాన్" పరుగును ఎస్పీ బంగ్లా కూడలి వద్ద మార్చి 8, సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి జి.గోపి ముఖ్య అతిధిగా హాజరై, “పింక్ థాన్" పరుగును జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా జి. గోపి మాట్లాడుతూ - పురుషులకంటే మహిళలు బలమైన మానసిక శక్తిని కలిగి ఉంటారన్నారు. పురుషులు శారీరకంగా మహిళల కంటే బలవంతులైనప్పటికీ, దుర్భరమైన ఆలోచనలతో చపల చిత్తులుగా మారుతున్నారన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ఉన్నత స్థానాలకు చేరుతున్నప్పటికీ, దురదృష్టవసాత్తు అంతే సమానంగా మహిళలపై దాడులు కూడా సమాంతరంగా పెరుగుతున్నాయన్నారు. ఇది మన ప్రాంతాల్లోని సామాజిక వెనుకబాటు తనానికి నిదర్శనమన్నారు. మన పూర్వీకుల నుండి వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను వారసత్వంగా తీసుకొని, మహిళల స్వేచ్ఛకు ఆటంకంగా నిలిచే చట్రాల్లో కూరుకుపోతున్నామన్నారు. మహిళల పట్ల వివక్ష మన ఇంటిలో నుండే ప్రారంభం అవుతున్నదని, మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలన్నారు మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, నేడు ఆయా కేసులను త్వరితగతిన విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా జిల్లాలో పోక్సో కోర్టు, మహిళా కోర్టును ప్రారంభించుకోవడం శుభపరిణామన్నారు. స్త్రీలకు స్వేచ్ఛ అన్నది కేవలం కాగితాలకు,కొటేషన్లుకే పరిమితం కాకుండా, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రతీ ఒక్కరూ తమవంతు సహకారాన్ని, సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయమూర్తి జి.గోపి అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగారాష్ట్ర డిజిపి శ్రీ గౌతం సవాంగ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను జిల్లా పోలీసుశాఖ తరుపున చేపట్టామన్నారు. ఇందులో భాగంగా “మహిళకు వందనం", "వైద్య శిబిరం”, “క్యాండిల్ ర్యాలీ” నిర్వహించామన్నారు. నేడు విద్యార్ధులు, క్రీడా కారిణులను ప్రోత్సహించేందుకు “పింక్ థాన్" పరుగును నిర్వహిస్తున్నామన్నారు.అంతేకాకుండా, దిశ ఎస్ ఓఎస్ మొబైల్ యాప్ ను డౌనులోడు చేసుకున్న మహిళలకు వస్త్రాల కొనుగోలు పై 20-30శాతం, మొబైల్స్ కొనుగోలు పై 10 శాతం రాయితీని ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషనుల్లోను మహిళలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేడు ప్రారంభించనున్నారన్నారు. ప్రతీ మహిళ కూడా తమకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, అనుకున్న లక్యాన్ని చేరుకోవాలన్నారు. మహిళా కానిస్టేబుళ్ళుకు “ధీర” అనే కార్యక్రమంతో టైక్వాండో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుళ్ళు జిల్లాలో ఉన్న పాఠశాలలు, కళాశాలలను సందర్శించి, మహిళా చట్టాలు గురించి వివరించడంతో పాటు,ఆసక్తి కలిగిన విద్యార్థినులకు ఆత్మరక్షణ మెళుకువలను నేర్పి, స్వశక్తితో వారు ఒంటరిగానే ఆకతాయిలను ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇస్తామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అన్నారు.అనంతరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేసి, మహిళలకుఅందించారు. మహిళలు సాధిస్తున్న విజయాలకు సూచనగా బెలూన్లను ఎగురవేసారు. “పింక్ థాన్" పరుగును జిల్లా న్యాయమూర్తి జి.గోపి జెండా ప్రారంభించారు.జిల్లా ఎస్పీ బి.రాజకుమారి,జిల్లా న్యాయమూర్తి జి.గోపి 3 కిలో మీటర్ల “పింక్ థాన్" పరుగులో స్వయంగా పాల్గొని, పరుగును పూర్తి చేసారు. ఈ పరుగులో విజేతలుగా నిలిచిన రామభద్రపురంకు చెందిన మడక శారద ప్రధమ స్థానంలోను,జామి మండలం శిరుగుడి రోషిణి ద్వితీయ స్థానంలోను, నెల్లిమర్ల కు చెందిన ఆర్మ్డ్ రిజర్వు మహిళా కానిస్టేబులు యర్రంశెట్టి మధుబాల తృతియ స్థానంలోను, బి. లావణ్య, పి. సత్యవతి లకు కన్సోలేషను బహుమతులను జిల్లా న్యాయమూర్తి జి. గోపి అందజేసారు. ఈ పరుగులో విజేతలుగా నిలిచిన వారికి రూ. 5వేలు, రూ. 3వేలు, రూ. 2వేలు, కన్సోలేషను బహుమతులు గెలుచుకున్న వారికి రూ. 1000/-ల చొప్పున నగదును అందజేసారు.

 మహిళలపై హింసకు పాల్పడవద్దని “పింక్ థాన్” పరుగులో పాల్గొన్నవారందరూ సంతకాలు చేసి, తమ మద్దతును తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఒఎస్ డి ఎన్. సూర్యచంద్రరావు, విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి. త్రినాధ్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బీ సిఐ జి. రాంబాబు,రుద్రశేకర్, 1వ పట్టణ సిఐ జె.మురళి, 2వ పట్టణ సిఐ సిహెచ్.శ్రీనివాసరావు, రూరల్ సిఐ టి.ఎస్. మంగవేణి, ఆర్ఐ లు చిరంజీవి, పి.నాగేశ్వరావు, పి. ఈశ్వరరావు, నెహ్రూ యువ కేంద్రం మేనేజరు విక్రమాదిత్య,బాలల హక్కుల సభ్యులు పెంకి చిట్టి బాబు, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ ఐలు, మహిళా పోలీసు సిబ్బంది, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండారు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండారు


రవాడ,పెన్ పవర్

 మండలం,నాయుడు పాలెం జంక్షన్లో సోమవారం నూతనంగా ప్రారంభించిన టిడిపి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు మాజీ మంత్రి,ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, ముఖ్య అతిదులుగా పాల్గొనే రిబ్బన్ కత్తిరించి నూతన ప్రాంతీయ టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేకు కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు పయిల జగన్నాధరావు, మాజీ మండల అధ్యక్షులు మాసవరపు అప్పలనాయుడు,టిడిపి జడ్పిటిసి అభ్యర్థి అట్ట సన్యాసి అప్పారావు, మాజీ సర్పంచ్ కుండ్రపు సన్యాసినాయుడు,మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీరామ్మూర్తి, స్థానిక టిడిపి నాయకులు కుండ్రపు మధు, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి అధికారంలో హింసాత్మక ఘటనలు...

 బిజెపి అధికారంలో హింసాత్మక ఘటనలు...

అనంతగిరి,పెన్ పవర్ 

అనంతగిరి మండల కేంద్రం గిరిజన సంఘం కార్యాలయంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా మహిళా సంఘం నాయకురాలు ఆల్ ఇండియా డెమోక్రటిక్ మహళ సంఘం ఏఐడి డబ్యు ఏ జి ల్లా కార్యదర్శి వి. వి. జయ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో హింసాత్మక సంఘటనలు దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎక్కడ చూసినా హత్యలు అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పట్టించుకోన దాఖలాలు లేవు నిత్యం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పెట్రోల్ డీజిల్ గేస్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలపై భారాలు పడుతున్నాయి. మరిముఖ్యంగా స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మతోన్మాదం పేరుతో ప్రజలకు చిచ్చు పెట్టే పనిలో ఉన్నారు. ప్రజ సమస్యలపై దృష్టి సారించలేదనారు ఈకార్యక్రమంలో అనంతగిరి సిఐటియు అధ్యక్షులు జి. కళవతి కార్యదర్శి ఎస్. సుమిత్ర ఉపాధ్యక్షులు పి మంజుల. అనంతగిరి మహిళా సంఘం అధ్యక్షులు. బాక కాసులమ్మ. నందుల. సుమిత్ర. దీసరి. శ్రావణి. దీసరి. దేముడమ్మ. జన్ని. దేవీ యుటిఎఫ్ నాయకులు శెట్టి. రాంబాబు. పుడిగి. దేముడు. ఈశ్వరరావు. పరమేశ్వర. నగేష్ మాస్టర్లు అనంతగిరి సిపిఎం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి దీసరి గంగరాజు. గిరిజన సంఘం నాయకులు జన్ని. సుబ్బారావు. ఎస్. నాగులు అంగన్వాడీ ఆశావర్కర్లు మహిళలు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...