Followers

కోదండ రామునికి అభిషేకం...

 కోదండ రామునికి అభిషేకం...  

పెన్ పవర్,కందుకూరు

  కందుకూరు పెద్ద బజార్ లో ఉన్న కోదండ రామాలయం లో మాఘ మాసం సందర్భంగా జరిగే లక్ష తులసి పూజ కార్యక్రమం లో భాగంగా సోమవారం కోదండ రామునికి, ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు రాజా, పవన్ స్వాములు పంచామృత అభిషేకం నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మురారి శెట్టి వెంకట సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం..

మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం..

పెన్ పవర్,కందుకూరు

 రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టి మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నదని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి  అన్నారు. సోమవారం పట్టణంలోని  డి ఆర్ ఆర్ విజ్ఞాన్ భవన్  (యుటిఎఫ్ కార్యాలయం) లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీలకు విద్య, ఉద్యోగాలలో  సమాన అవకాశాలు ఉన్నాయని అన్నారు. సీరియల్స్ లో  స్త్రీ లను అవమానకరంగా చూపిస్తున్న మనమే వాటిని ప్రోత్సహించటం బాధాకరమన్నారు. అనేక ప్రచార మాధ్యమాలు మహిళలను కించపరిచే విధంగా సమాజంలో వారి స్థాయి తగ్గించే విధంగా ఉన్నాయని అయినప్పటికీ మహిళా సంఘాలు ఎందుకు పోరాటం చేయడం లేదో అర్థం కాలేదన్నారు. మహిళలు లేనిదే ఏ రంగం లేదని మహిళలను వ్యాపార రంగం కింద చూడడం దారుణమని అన్నారు. బలహీనతలను అధిగమిస్తే మన పాత్ర బలంగా ఉంటుందని అన్నారు. సమాజంలో స్త్రీలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారని అన్నారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న మహిళలను సమాజంలో ఎందుకు చులకనగా చూడ బడుతున్నారు, ఎందుకు చూస్తున్నారు బేరీజు వేసుకోవాలి అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మాట్లాడిన మాటలు ఆచరణలో పెడితే మహిళా దినోత్సవానికి సార్థకత ఏర్పడుతుందని అన్నారు. పురుషులు అహంభావాన్ని చూపిస్తే మహిళలు కుటుంబ గౌరవం నిలబెట్టే విధంగా చూస్తారని అన్నారు. నేటి తరం పొందలేనిది రేపటి తరం పొందే విధంగా కృషి చేయాలని అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, నివేశన స్థలాలు తదితర పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి లెనీన, వీరమ్మ, ఉషశ్రీ, సరోజిని, పద్మజ సుమారు 150 మంది మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు

మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు

పెన్ పవర్,పొన్నలూరు

మండలంలోని మాల పాడు పంచాయితీ పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించినట్లు  పొన్నలూ రు సెక్టార్ సూపర్ వైజర్ కె విజయలక్ష్మి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ శిరిగిరి శ్రీదేవి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నారని , వారిని ఆదర్శంగా చేసుకుని ముందుకు సాగిపోవాలని ఆమె అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాలపా డు పంచాయితీ సెక్రటరీ రవి , శిరిగిరి గోపాల్ రెడ్డి ,పంచాయితీ కార్యకర్తలు ,ఆశా వర్కర్లు ,ఆయాలు ,కిషో ర బాలికలు పాల్గొన్నారు.

తెలంగాణా సేవారత్న అవార్డు ప్రధానం

 తెలంగాణా సేవారత్న అవార్డు ప్రధానం...

పెన్ పవర్, కందుకూరు

జనార్ధన కాలనీ లో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయురాయలు రామలక్ష్మమ్మ కి, కమ్మ పాలెం మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజా కుమారికి కన్నతల్లి ఫౌండేషన్ వరంగల్ వారు ఇచ్చినటువంటి తెలంగాణ సేవరత్న అవార్డులను శ్రీరామ సాయి బాబా సేవా సమితి అధ్యక్షులు రవ్వ శ్రీనివాసులు,ప్రకాశం జిల్లా వాసులు సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావుల చేతుల మీదుగా అందజేశారు.  ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ మహిళా దినోత్సవం నాడు మహిళా ఉపాధ్యాయురాలును  గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.నేడు  సమాజంలో మహిళలు రాజకీయరంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగాల్లో, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు.ఒక మహిళ తమ కుటుంబానికి ఎన్నో సేవలు చేస్తూ తమ కర్తవ్యాన్ని తాను  నిర్వహిస్తున్న దని అన్నారు.అటువంటి మహిళా సోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు అని అన్నారు. రవ్వా  శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యారంగంలో పిల్లలను ఉన్నత స్థాయికి తీర్చే క్రమంలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది అన్నారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి వారి ఉన్నత స్థితికి తోడ్పడాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాలకొండయ్య, మాధవరావు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం రోజున మహిళలుపై దాడులా...

 మహిళా దినోత్సవం రోజున మహిళలుపై దాడులా..

రాజధాని (అమరావతి) మహిళా రైతులు దుర్గగుడికి పోవాలనుకోవడమే నేరమా

 ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదా

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడమే మహిళా రైతులు చేసిన పాపమా

పెన్ పవర్,కందుకూరు

 రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహిళా దినోత్సవం రోజున రాజధాని (అమరావతి) ప్రాంతం మహిళలపై పోలీసులతో దాడి చేయించడం దుర్మార్గపు ఆలోచనని అమరావతి పరిరక్షణ సమితి జే ఎ సి కన్వీనర్  గోచిపాతల మోషే ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల బధ్రత కోసం ప్రత్యేక చట్టాలు తెస్తామని , మహిళల వైపు ఎవరు కన్నెత్తి చూసిన గన్ కంటే ముందు జగనన్న వస్తాడని సభల్లో  ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతూ సాక్షాత్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములు ఇచ్చిన మహిళా రైతులపై దాడి చేయించడాన్ని చూస్తేనే జగన్ మహిళలపట్ల ఏవిధంగా చిన్న చూపు చూస్తున్నాడో  అర్థమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళపై అత్యాచారం జరిగితే ఆ రాష్ట్రానికంటే ముందుగా "దిశచట్టం" కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి స్వంత రాష్ట్రంలో మహిళలపై దాడులు , దౌర్జన్యాలు మరియు అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్యలు చేస్తుంటే పట్టించుకోకుండా నిస్సిగ్గుగా తిరుగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు , ఎమ్మెల్యేలు, నాయకులు రాజధానికి భూములు ఇచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్లు అనే పదేపదే పత్రిక సమావేశాల్లో మాట్లాడుతున్నారు. నిజమైన పెయిడ్ ఆర్టిస్ట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే తప్ప రైతులు కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజధాని అమరావతి మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేస్తూ వాడిన బాష వీదిరౌడిలు , గుండాలు వాడే బాష కంటే నీచాతి నీచమైన రీతిలో వ్యవహరించి జగన్ మోహన్ రెడ్డి దగ్గర మెహార్భాని పొందటం కోసం అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల పట్ల చూపుతున్న వివక్ష ఇకనైనా విడనాడాలని లేని పక్షంలో ఈనెల 10 తేదీన రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ , కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మోషే హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు కొత్తగొర్ల వసంత , తానికొండ సునీత , తాటికొండ పద్మ , గంగవరపు పద్మ , కందుకూరు నియోజకవర్గ సి.పి.ఐ సహాయ కార్యదర్శి బూసి సురేష్ బాబు , మహాదేవపురం సొసైటీ మాజీ అధ్యక్షులు దామా మల్లేశ్వరావు , తెలుగుదేశం పార్టీ నాయకులు పొడపాటి మహేష్ , మాదాల మాల్యాద్రి , బత్తిన వెంకయ్య , బి.సి సెల్ మండల అధ్యక్షులు మంచికలపాటి శ్రీనివాసరావు , యస్.సి సెల్ నాయకులు కలవకూరి మణికుమార్ , టి.ఎన్.ఎస్. ఎఫ్ జిల్లా కార్యదర్శి నలమోతు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ఆర్ వెలుగు కార్యాలయం లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 వైఎస్ఆర్ వెలుగు కార్యాలయం లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు


పెన్ పవర్,వలేటివారిపాలెం

మండలంలోని వైఎస్సార్ క్రాంతి వెలుగు కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహిళా సమాఖ్య కోశాధికారి ముప్పా హరిత ఆధ్వర్యంలో మహిళలకు కబడ్డీ, కుర్చీలాట, ఉపన్యాసం ఆటల పోటీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ సేవ చేస్తున్న వారికి మగువ పురస్కారాన్ని ఇవ్వడం అభినందనీయమన్నారు.  కొండ సముద్రం గ్రామ సర్పంచ్ మన్నం వెంగమ్మ మాట్లాడుతూ  నేటి తరంలో మహిళలను పురుషులతో సమానంగా గౌరవింపబడటం చాలా సంతోషంగా ఉందన్నారు. మహాళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, మహిళా దినోత్సవం కేవలం ఒకరోజు మహిళను గౌరవించే విధంగా కాకుండా ప్రతి రోజూ మహిళను గుర్తించి మహిళలను గౌరవించే సమాజాన్ని తయారుచేయాలని , తద్వారా మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ ను సన్మానించారు. అనంతరం పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం హనుమంతరావు, సిసి  అనితా , వివిధ శాఖల మహిళలు పాల్గొన్నారు.

కేంద్రీయ విద్యాలయం లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 కేంద్రీయ విద్యాలయం లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 

పెన్ పవర్, కందుకూరు 

పట్టణంలోని కేంద్రీయ విద్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ ఎంసి ఛైర్మన్ శిరీష మాట్లాడుతూ నేటి సమాజం లో  స్త్రీలు పురుషుల తో సమానం గా గౌరవింపబడటం చాలా ఆనందం గా ఉందన్నారు. భావిభారత పౌరులును జాతికి అందించడం లో స్త్రీ తను మొదటి గురువుగా, డాక్టర్ గా , సేవకురాలుగా పురిటి బిడ్డ ఎదుగదలకు నిరంతరం కృషి చేసి జాతికి పౌరులను అందించడం జరుగుతుందన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, స్త్రీ చదువు కేవలం ఉద్యోగం కోసం కాకుండా , మన ఇంటిని తీర్చిదిద్దడం కోసం ఉపయోగిస్తే ఆ సమాజం బాగుపడుతుంది అని అన్నారు. తదుపరి విద్యార్థుల తల్లులకు ఆటలపోటిలు నిర్వహించడం జరిగింది. మాచవరం సర్పంచ్ పోట్లూరి లలిత అందరికీ మహిళా దినోత్సవం శుభకాంక్షలు తెలియచేయడం జరిగింది. 15 మంది మహిళలను కేంద్రీయ విద్యాలయం వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్  వెంకటేశ్వర్లు  , ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు , పిటీ ఏ సెక్రెటరీ ఎ వి రావు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...