Followers

ఏఓ జి.రుచిత ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం

 ఏఓ జి.రుచిత ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం


తాళ్ళపూడి, పెన్ పవర్

  సోమవారం నాడు తాళ్ళపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి సౌజన్యంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మహిళా రైతులకు తాళ్ళపూడి మండల వ్యవసాయ అధికారిని జి.రుచిత ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫామింగ్, కిచెన్ గార్డెనింగ్ గురించి మహిళా రైతులకు అవగాహన కల్పించి, ముగ్గురు మహిళా రైతులను సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు, మండల వ్యవసాయ సలహా కమిటీ అధ్యక్షులు వల్లభనేని శ్రీహరి, గ్రామ పెద్దలు మరియు వైసిపి నాయకులు శీర్ల  బ్రహ్మానందం, సచివాలయ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మోతుగూడెంలో సీఆర్పీఎఫ్ వారి సివిక్స్ ప్రోగ్రాం

 మోతుగూడెంలో సీఆర్పీఎఫ్ వారి సివిక్స్ ప్రోగ్రాం 

మోతుగూడెం,పెన్ పవర్

మోతుగూడెం గ్రామంలో సిఆర్పిఎఫ్ జి42 బెటలియన్ వారు కల్చరల్ ఆక్టివిటీస్ ప్రోగ్రాం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలు పాల్గొన్నారు వారికి సెకండ్ కమాండెంట్ జి చింతల్ కుమార్ చేతుల మీదుగా నగదు బహుమతి అందించారు, అనంతరం సివిక్స్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు, ఈ కార్యక్రమానికి ఫోర్ బై క్యాంప్ ,ఈంతులూరు వాగు ,ఒడియా క్యాంపు, ఎం సి డి క్యాంప్ మరియు మల్లారం గ్రామాల ప్రజలు పాల్గోన్నారు వారికి రగ్గులు, చార్జింగ్ లైట్స్,గునపాలు మరియు పారలు పంచడం జరిగింది వచ్చిన వాళ్లందరికీ భోజనాలు సుమారు 600 మందికిఏర్పాటు చేశారు ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమాండెంట్ జి చింతల్ కుమార్ , ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ ఎం గౌరీపతి ,మోతుగూడెం గ్రామ సర్పంచ్ ఆకెటి సీత, చింతూరు సిఐ యువకుమార్ ,మోతుగూడెం ఎస్సై వి సత్తిబాబు పంచాయతీ సెక్రెటరీ జ్యోతి, ఎం పి యు పి హెడ్మాస్టర్ మీనా కబ్బా రావు ,డి ఏవి హెడ్ మాస్టర్ ఎం జి ఎస్ నాయుడు సిఆర్పిఎఫ్ జి 42 బెటలియన్ మరియు సివిల్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బౌర్తి ఉపధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఐటీడీఏ పి.ఓ...

 బౌర్తి  ఉపధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఐటీడీఏ పి.ఓ...



చింతపల్లి, పెన్ పవర్

మండలంలోని చౌడుపల్లి పంచాయతీ బౌర్తి ప్రభుత్వ గిరిజన సంక్షేమ  ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుల్లెల సత్యరాజును ఐ టీడీఏ  ప్రోజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల  సస్పెండ్ చేశారు. సోమవారం మండలం పర్యటనలో బాగంగా బౌర్తి పాఠశాలను తనిఖీ చేశారు. మనబడి  నాడు నేడు పనుకు తనిఖీ చేశారు.మనబడి నాడు పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఉపాధ్యాయుడు రూ.5వేలు వేతనం ఇచ్చి  వాలంటీర్ ను నియమించి ఆయన విధులకు గైరు హాజరయ్యారు. 5వతరగతి విద్యార్థులు కనీసం  అ, ఆ,లు చెప్పలేకపోతున్నారని విద్యా ప్రమాణాలు పై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఉపాధ్యాయుడు  పాఠశాలకు వస్తున్నది లేనిది గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.మధ్యాహ్నం భోజనం పై ఆరాతీశారు.పిల్లలకు యూనిఫామ్ కట్టించాలని తలిదండ్రులకు సూచించారు.

గవ్వలమామిడి లో త్రాగునీరు సమస్య

 గవ్వలమామిడి లో త్రాగునీరు సమస్య



పరిష్కారం చేయాలి-సీపీఎం డిమాండ్

హుకుంపేట - పెన్ పవర్..

  మండలంలోని గన్నేరుపుట్టు పంచాయితి "గవ్వలమామిడి లో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొంది.ఈ  సమస్య పై చీకుమద్దుల ఎంపీటీసీ సీపీఎం పార్టీ అభ్యర్థి సుడిపల్లి కొండలరావు గ్రామస్థుల తో సమావేశమై పొలాల వద్ద ఉన్న ఊట నీటి కుండీ వద్ద మహిళలు నీటిని సేకరిస్తున్న ప్రాంతాం లో గ్రామస్థులు ,మహిళలు తో కలిసి పరిశీలించారు.అనంతరం గవ్వలమామిడి గ్రామంలో 55 కుటుంబాలు,260.జనాభా కలిగిన గ్రామం లో సరైన నీటి సౌకర్యం లేక ప్రజలు కలుషిత నీటిని సేవిస్తున్నారని ,ఆ నీళ్లు త్రాగితే రోగాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.సచివాలయం అధికారులు, ఎంపీడీఓ ,పాడేరు ఐటీడీఏ పీ ఓ గారు స్పందించి గవ్వలమామిడి గ్రామంలో కరెంట్/విద్యుత్ మోటార్ ద్వారా  శాశ్వత మంచినీటి పధకం,మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గవ్వలమామిడి 6 వ వార్డు మెంబర్ పాడి శైలు, మాజీ వైస్ సర్పంచ్ బి రాజారావు, పి బోడన్న,జంగిడి నూకన్మ,బాడ్నైని సుందర్ రావు,బాడ్నైని లక్ష్మణ్ రావు,పాడి ఆనంద్, రాజారావు, జంగిడి రాజారావు,జంగిడి గణేష్,హరీష్, మహిళలు అప్పలమ్మ,కొండమ్మ,రాజులమ్మ,కుజ్జమ్మ,సోములమ్మ,కుమారి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గిరిజనులను హతమార్చడమే మావోయిస్టుల సిద్ధాంతమా

 గిరిజనులను హతమార్చడమే మావోయిస్టుల సిద్ధాంతమా? 

జీకేవీధిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ

గూడెం కోత్తవీధి, పెన్ పవర్




ఇంపార్మన్ల పేరుతో గిరిజనులను హతమార్చడమే మావోయిస్టుల సిద్ధాంతమా ..? మావోయిస్టులు చేసే  విధ్యంసాలు,హత్యలతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి  కావాలని గిరిజనులు నినదించారు.విశాఖ మన్యం లోని జీకేవీధిమండలం  కొత్తపాలెంలో ఇంపార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చిన కొర్ర పిల్కు కుటుంబీకులతో కలిసి గిరిజనులు, విద్యార్థిని,విద్యార్థులు భారీ సంఖ్యలో ఆదివారం జికేవీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు.జికేవీధి మండల కేంద్రం నుంచి గూడెంకొలని వరకు మావోయిస్టు లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మారుమూల గ్రామాలకు రోడ్లు,పాఠశాలలు, సెల్ టవర్లు,వైద్యం వంటి మౌలిక సదుపాయాల కావాలని అడిగితే ఇంపార్మర్ ముద్రవేసి గిరిజనులను మావోయిస్టులు హతమార్చుతున్నారని ఆరోపించారు. వారి హత్యలకు నిరసిస్తూ మావోయిస్టు దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు.గిరిజనుల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టులు వారినే హతమార్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే కటిన చర్యలు

  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే కటిన చర్యలు 



విశాఖపట్నం, పెన్ పవర్ 

ఈ నెల 10వ తేదీన  జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్థేశించిన ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటల కల్లా  అభ్యర్థులు తమ ప్రచారాలను నిలుపుదల చేసుకోవాలని కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా అభ్యర్థులందరూ విధిగా తమ ప్రచారాన్ని సోమవారం సాయంత్రం 5 గంటల లోపు ముగించుకోవాలి అన్నారు. ప్రచారాలకు వినియోగించే మైక్ లు,రిక్షాలు,ఆటోలు వంటి ఇతర ప్రచారాంశాలను తప్పనిసరిగా నిర్దేశించిన గడువులోగా ముగించుకోవాలన్నారు. లేని యెడల ఎన్నికల కమిషన్ తీసుకోబోయే చర్యలకు గురి కావాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా ఓటరు తన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా  ఓటర్ సౌకర్యార్థం వెబ్ సైట్ ను రూపొందించడం జరిగిందన్నారు. అలాగే సదరు వెబ్ సైట్ లో ఓటరు పేరు, తండ్రి పేరు,ఓటరు గుర్తింపు కార్టు నెంబరు వంటివి నమోదు చేసిన వెంటనే ఓటరు యొక్క వివరాలు, పోలింగ్ స్టేషన్ వంటి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

వెబ్ సైట్ ..  http://13.127.225.132/ULB/1093

18లో బీజేపీ అభ్యర్ధి దూకుడు పరేషన్ లో ప్రత్యర్ధులు

 18లో బీజేపీ అభ్యర్ధి దూకుడు... పరేషన్ లో ప్రత్యర్ధులు


గెలుపు బాటలో 18 వ వార్డ్ బిజెపి మరియు జనసేన   పార్టీ, ఉమ్మడి అభ్యర్థిని ద్వారపురెడ్డి అరుణ కుమారి






విశాఖ తూర్పు, పెన్ పవర్  :-


 ఎన్నికల ప్రచారంలో భాగంగా  18 వ వార్డు లో పోటీ చేస్తున్న బి.జె.పి. మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ని ద్వారాపురెడ్డి ఎన్. ఎల్. అరుణ కుమారి ప్రచారాన్ని ఉధృత పరిచారు.తన ప్రచారంలో ఓటరు లెవ్వరూ    అన్య పార్టీ ల ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలని, శాశ్వత అభివృద్ధికి దూరం కావద్దని హితవు పలికారు. వార్డు అభివృద్ధికి పట్టం కట్టే వ్యక్తులకు మాత్రమే ఓటు వేయాలని సూచించారు. 

గత 20 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, స్థానికురాలు, విద్యావేత్త నైనా తనకు వార్డు సమస్యలన్నింటి పై పూర్తి అవగాహన ఉందని. వార్డు ప్రజలు ఒక్క  అవకాశం ఇస్తే వాటిని పూర్తిగా  తీర్చగల సమర్ధత కలిగి ఉన్నానని, ప్రజలు ఆలోచించి తమ యొక్క అతి విలువైన ఓటును వేసి అత్యధిక మెజారిటీ తో అఖండ విజయాన్ని చేకూర్చాలని అభ్యర్దించారు. ఇంటింటికీ వెళ్లి నమూనా బ్యాలెట్ పేపర్ ను చూపించి అందులో 3వ వరుస సంఖ్య లో ఉన్న కమలం గుర్తు పై ఓటేసి గెలిపించమని కోరారు. వార్డులోని అన్ని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మోడీ  మాస్కులతో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన  రోడ్ షో ప్రజలను అమితంగా ఆకట్టుకుంది.  ప్రచారంలో  వయసుతో తారతమ్యం లేకుండా అన్నివర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కె. సుబ్రమణ్యం, వార్డు అధ్యక్షులు శ్యామ్ కుమార్,  బాబ్జి, రామా రావు, జనరల్ సెక్రటరీ రమా దేవి, లలిత కుమారి,  జాస్ని, నూకరాజు, చక్రవర్తి,  మరియు జనసేన కార్యకర్తలు, బి.జె.పి కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...