Followers

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాని ప్రారంభించిన ఎస్సై భూమేష్

 అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాని ప్రారంభించిన ఎస్సై భూమేష్

మందమర్రి, పెన్ పవర్

ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాని సోమవారం పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అంబేద్కర్ యువజన సంఘం నాయకులను అభినందించారు. పట్టణ ప్రదాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎవరైనా ముందుకు వస్తే పోలీస్ శాఖ నుండి సహకారాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చలివేంద్రాలను ధ్వంసం చేస్తే  కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరాస్వామి, పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు, నాయకులు, నెరువట్ల దేవయ్య, చీర్ల సత్యం, నర్సోజి, ఉప్పులేటి నరేశ్, జూపాక సంపత్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, రామ్ శ్రీనివాస్, కటిక శ్రీనివాస్, కాసిపేట రవి, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

ఐక్య కార్యాచరణతో నూర్బాష్ / దూదేకుల గుర్తింపు , సమస్యలు సాధించుకోవాలి

 ఐక్య కార్యాచరణతో నూర్బాష్ / దూదేకుల గుర్తింపు , సమస్యలు సాధించుకోవాలి - తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్ 

 వనపర్తి,పెన్ పవర్

 తెలంగాణ ముస్లిం నూర్భాషా, దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఖలీల్  అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా షేక్ సిద్ధాసాహెబ్ , విశిష్ట అతిధులుగా దూదేకుల సీనియర్ నాయకులు & రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ.సుబాన్ అలీ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్ ఆధ్వర్యంలో  నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ నాయకులను సన్మానించారు. వనపర్తి జిల్లా దూదేకుల సోదరులను వివిధ పదవులలో నియమించారు. ముఖ్య అతిధి షేక్ సిద్దాసాహెబ్ చేతుల మీదుగా సీనియర్ నాయకులు సుబాన్ అలీ  రాష్ట్ర నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ-జాతి సమస్యల సాధనే ప్రధానంశంగా, రాష్ట్ర వ్యాప్తంగా దూదేకులకు విద్యాపరంగా, రాజకియంగా,  సామాజికంగా గుర్తింపు కోసం రాష్ట్ర , జిల్లా కమిటీలు పని చేస్తున్నాయని, గత రెండు సం.లలో మన దూదేకుల సంఘీయులు రాజకీయంగా మరియు సామాజికంగా గుర్తింపు సాధించి, కోకాపేటలో దూదేకుల భవనం వంటి సానుకూల ఫలితాలు సాధించామని, ఇదే స్పూర్తితో, ఐక్య కార్యాచరణతో నూర్బాష్ / దూదేకుల సమస్యలు సాధించుకుందామని పిలుపునిచ్చారు. నిరంతరం మన  సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంఘ సేవా కార్యక్రమాలతో దూదేకుల ఉన్నతికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు- అబ్దుల్ బషీర్, రాష్ట్ర పొలిటికల్ కోఆర్డినేటర్-జహంగీర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు-ఎండీ. ఖాసిం, మైనారిటీ నాయకులు-జహంగీర్, రాష్ట్ర కార్యదర్శులు ఎండీ. ఖాజా,  ఇదయితుల్లా, రజాక్, జమాల్, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు ఎండీ. ఖాజా మోయినుద్దీన్, రాష్ట్ర నాయకులు ఉస్మాన్, మహమూద్ పాషా, గద్వాల్ జిల్లా అధ్యక్షుడు- సుబాన్, యండి. ఉస్మాన్, మౌలాలీ, షేక్ షావలి, షాలిమియ, హుసేన్, అహ్మద్ హుస్సేన్, బాషా, రుఖ్మద్దీన్, మస్తాన్, చాంద్ పాష,లాల్ మహ్మద్, బాలెమియ, నవాబ్, సల్మాన్, అల్లీపీర్,ఆరిఫ్, షాబుద్దీన్, నౌషాద్, బాలెమియ, జిల్లా ఉపాధ్యక్షుడు-మాబాష తదితరులున్నారు. తదనంతరం వనపర్తి జిల్లా, రాష్ట్ర సమస్యలను స్థానిక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి  వినతిపత్రం అందజేశారు. ఈ మద్యనే అగ్ని ప్రమాదంలో పరుపుల ప్యాక్టరీ  కాలిపోయిన బాధిత యజమాని మంత్రిని  కలిశారు. ప్రభుత్వ సహాయం కోరగా, మంత్రి  వారికి అండగా ఉంటామని తెలిపారు. నూతన నియామక సభ్యులకు జాతీయ అధ్యక్షుడు అనీస్ మన్సూరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్, జాతీయ ఇంచార్జి షేక్ షకీనా, జాతీయ ఉపాధ్యక్షుడు షకీల్ మన్సూరీ, రాష్ట్ర వనపర్తి జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు.

కాంగ్రెస్ఎస్టీసెల్ నెల్లికుదురు మండల అధ్యక్షులుగా భాస్కర్ నాయక్

 కాంగ్రెస్ఎస్టీసెల్  నెల్లికుదురు  మండల అధ్యక్షులుగా భాస్కర్ నాయక్ 

నెల్లికుదురు,పెన్ పవర్

మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్  అధ్యక్ష ప్రధానకార్యదర్శులుగా రత్తిరామ్ తండాకు చెందిన గుగులోత్ భాస్కర్,వస్రం తండాకు చెందిన గుగులోత్ రవిలను నియమించినట్లు డిసిసి అధ్యక్షులుజెన్నారెడ్డి భరత్ చంద్రా  రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ నాయక్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతుల హక్కుల కోసం ఉద్యమిస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి భాస్కర్,రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ మురళి నాయక్,డి సి సి ఉపాధ్యక్షులు ఎద్ఎ దళ్ళయాదవరెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్,నాయకులు దల్ సింగ్,గంకిడి ఎల్లారెడ్డి,మట్టవెంకట్ రెడ్డి,లింగ్యానాయక్,వీరన్న నాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

సమస్యలపై పోరాడే ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించుకుందాం.

 సమస్యలపై పోరాడే ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించుకుందాం..   బిజెపి జిల్లా నేత సురేందర్ రెడ్డి

నెల్లికుదురు,పెన్ పవర్

ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం అని ఆ పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బీరవెల్లి సురేందర్ రెడ్డి పట్టభద్రఓటర్లను అభ్యర్థించారు మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు.మండల కేంద్రo  లో సోమవారంబీజేపీ పార్టీ జిల్లా నేత బీరవెల్లి  సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోరుతూ ఉద్యోగులు నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల ఇళ్లల్లోకి వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటును సమస్యలపై పోరాడి  సాధించే సత్తా కలిగినప్రేమేందర్రెడ్డికేవేయాలనికోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధికార ప్రతినిధి వెలుకూచి నాగయ్య శాస్త్రిపార్టీ సీనియర్ నాయకులు ఆకుల వెంకటేశ్వర్లు ,కిసాన్మోర్చా మండల అధ్యక్షులు కొత్త సమ్మిరెడ్డి,ఓ బి సి మండల అధ్యక్షులు బొమ్మ రాతి నగేష్,తదితరులు పాల్గొన్నారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఎమ్మెల్సీగా జయ సారథి రెడ్డినిగెలిపించాలి

 వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఎమ్మెల్సీగా జయ సారథి రెడ్డినిగెలిపించాలి

..వామపక్షాల నాయకులు

నెల్లికుదురు,పెన్ పవర్

వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గ వామపక్ష పార్టీలఎమ్మెల్సీ  అభ్యర్థి జయ సారథి రెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారంమహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో  ఆ పార్టీల మండల కార్యదర్శులు వరిపెల్లి  వెంకన్న,పెరుమాండ్ల తిలక్ బాబు లు మండల కేంద్రం నెల్లికుదురుమరియు ,పార్వతమ్మ గూడెంలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు పట్టభద్రులైన ఓటర్ల ఇళ్లలోకి వెళ్లి ప్రశ్నించే గొంతు విజయ సారథి రెడ్డిని గెలిపించడానికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ్ ఇసంపెల్లి సైదులు తూటి వెంకట్ రెడ్డి,గారె అనిల్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పాలన

 రైతుల సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పాలన

జగిత్యాల ,పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో నూతనంగా ఏర్పాటు అయిన బుగ్గరాం మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చమైన త్రాగునీరు

 గ్రామాల సంపూర్ణ అభివృద్దే మా లక్ష్యం  బుగ్గరాం మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో బుగ్గరాం మండల జెడ్పిటిసి బాధినేని రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది రైతుల రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల సంక్షేమమే ద్యేమంగా పాలన సాగిస్తున్నారని బుగ్గరాం మండల జెడ్పిటిసి  బాధినేని రాజేందర్ అన్నారు. సోమవారం బుగ్గరాం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ బాదినేని రాజమణి  మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  రైతుల కష్టాలను తొలగించే విధంగా రైతులకు ఉచితంగా 24గంటల కరెంట్, రైతు భీమ, రైతుబంధు, సకాలలంలో పేదింటి ఆడ్డబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ షాదముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్న  ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని అన్నారు  సిఎం గారి మానసపుత్రిక మీషన్ భగీరధ పధకం ద్వారా ప్రతి ఇంటికి ఉచింతగా నల్లకనేక్షన్ తో పాటు స్వచ్చమైన త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు.  ప్రజల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ అభివృద్దే లక్ష్యంగా తాము పాలన చేస్తున్నమని గ్రామంలో సమస్యలను ఒకోక్కటిగా పరిష్కారం చేస్తు ముందుకు సాగుతున్నామన్నారు. ఆరేళ్ళ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని బంగారు తెలంగాణ సాధనలో తమవంతు పాత్ర పోషించామన్నారు  ఈ సమావేశంలో  వైస్ ఎంపిపి జోగినిపెల్లి సుసెంధర్  ఎంపీపీ కో ఆప్షన్ సభ్యులు రహమాన్  బుగ్గరాం మండల రైతు బంధు అధ్యక్షులు సత్యనారాయణ రావు  మండలక్  సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మూల సుమలత శ్రీనివాస్ గౌడ్ మండల ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అధ్యక్షులు గాలిపెళ్లి మహేష్  తహశీల్దార్ పారఖ్  ఎంపీడీవో తిరుపతి  ఎంపీఓ అబ్దుల్ మియా  వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..

సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి

 సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం  అభివృద్ధి

చిన్నగూడూరు,పెన్ పవర్

స్థానిక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా తెరాస నాయకులు సోమవారం నాడు ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.  రాష్ట్రం ఏర్పడిన  నుండి నిరుద్యోగులకు లక్షకుపైగా ఉద్యోగాలను చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, ఇంకా రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరుగుతోందని తెలియజేశారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటికి వెళ్లి తమ మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి వేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూల మురళీధర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, తెరాస మండల పార్టీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్, చెన్నారెడ్డి, తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు మన్నె చెన్నయ్య, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, టిఆర్ఎస్ నాయకులు దొంగరి నరసయ్య, దేశగాని రమేష్, వీరాచార, సిహెచ్ ప్రవీణ్, మూల గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...