ఆడబిడ్డలకు అండగా కేసీఆర్
Followers
అడబిడ్డలకు అండగా కేసీఆర్
అత్యవసర సందర్భాల్లో బ్లడ్ డొనేట్ చేస్తున్నా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ
అత్యవసర సందర్భాల్లో బ్లడ్ డొనేట్ చేస్తున్నా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం
ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు
ఆదిలాబాద్, పెన్ పవర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
రామకృష్ణాపూర్, పెన్ పవర్
నేటి సమాజంలో మహిళలు ఎంతో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి
నేటి సమాజంలో మహిళలు ఎంతో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి
మందమర్రి, పెన్ పవర్
నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండాలని మందమర్రి మార్కెట్ లోని భగత్ సింగ్ ఏరియా యువత సభ్యులు రాయబారపు కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భగత్ సింగ్ ఏరియా యువత ఆధ్వర్యంలో మందమర్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఆరోగ్య సిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువత సభ్యులు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ, మహిళలు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఓర్పుతో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్య రంగంలో పనిచేసే మహిళా ఆరోగ్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని, కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళా నాయకురాలు పద్మ, ఫర్జానా, యువత సభ్యులు శ్రీకాంత్, అశోకరెడ్డి, జమాల్, రమేష్, సుజిత్, శ్రీకర్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు
మందమర్రి, పెన్ పవర్
ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మహిళా నాయకురాల్లు ఉప్పులేటి గోపిక, తోకల నిరోషలు మాట్లాడాతూ, పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నా ఇంకా సమాజంలో మహిళలు వివక్షకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలను గౌరవించడం వల్లనే సమాజం అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలకు, మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు కళ్లెపెళ్లి శోభారాణి, యుద్దమారి లావణ్య, సిరిపెళ్లి రవళి, పుప్పాల సునీత, పోతకనూరి దివ్య, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాని ప్రారంభించిన ఎస్సై భూమేష్
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాని ప్రారంభించిన ఎస్సై భూమేష్
మందమర్రి, పెన్ పవర్
ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాని సోమవారం పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిని దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అంబేద్కర్ యువజన సంఘం నాయకులను అభినందించారు. పట్టణ ప్రదాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎవరైనా ముందుకు వస్తే పోలీస్ శాఖ నుండి సహకారాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చలివేంద్రాలను ధ్వంసం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరాస్వామి, పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు, నాయకులు, నెరువట్ల దేవయ్య, చీర్ల సత్యం, నర్సోజి, ఉప్పులేటి నరేశ్, జూపాక సంపత్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, రామ్ శ్రీనివాస్, కటిక శ్రీనివాస్, కాసిపేట రవి, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.ఐక్య కార్యాచరణతో నూర్బాష్ / దూదేకుల గుర్తింపు , సమస్యలు సాధించుకోవాలి
ఐక్య కార్యాచరణతో నూర్బాష్ / దూదేకుల గుర్తింపు , సమస్యలు సాధించుకోవాలి - తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్
వనపర్తి,పెన్ పవర్
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
-
గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు. సంతబొమ్మాలి, పెన్ పవర్ మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చ...










